సేంద్రియం వైపు.. రైతు చూపు | - | Sakshi
Sakshi News home page

సేంద్రియం వైపు.. రైతు చూపు

Feb 1 2026 3:04 AM | Updated on Feb 1 2026 3:04 AM

సేంద్

సేంద్రియం వైపు.. రైతు చూపు

ధర్మవరం రూరల్‌: పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగం పెరిగిపోవడంతో నేలలోని పోషకాల నిల్వల్లో సమతుల్యత లోపించి ఉత్పాదకత తగ్గుతోంది. చీడపీడలు ఆశించడం, సూక్ష్మ పోషకాల లోపం తదితర కారణాలతో దిగుబడులపై ప్రభావం పడుతోంది. ఈ సమస్యను అధిగమించాలంటే సేంద్రియ పద్ధతులను పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తుండడంతో ఆ దిశగా రైతులు దృష్టి సారిస్తున్నారు. ఇటీవల సేంద్రియ ఎరువులకు డిమాండ్‌ పెరగడమే ఇందుకు నిదర్శనం. ధర్మవరం మండలంలో 20 పంచాయతీల్లో 22 వేల హెక్టార్ల సాగు భూమి ఉంది. ఖరీఫ్‌ సీజన్‌లో దాదాపు 10 వేల హెక్టార్లలో వివిధ పంటలను రైతులు సాగు చేస్తుంటారు. చీనీ, బొప్పాయి, మామిడి, దానిమ్మ, సపోటా, ద్రాక్ష , దోస, కళింగర తదితర పంటలతో పాటు వేరుశనగ, కాయ గూరల పంటలను విరివిగా పండిస్తుంటారు. మండలంలో పాడి సంపద ఎక్కువగా ఉంది. దీనికి తోడు గొర్రెలు, మేకలు అధికంగా ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే ఎరువులను పొలాలకు వాడుతున్నారు.

సేంద్రియ ఎరువులతో భూసారం..

పొలాలు దుక్కులు దున్నేముందు పశువులు, గొర్రెల ఎరువును పొలాల్లో వేసుకుంటే బాగుంటుంది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. దుక్కులు దున్నిన తరువాత పశువుల పేడ, గొర్రెల పెంట మొత్తం భూమిలోకి వెళ్లి పంట దిగుబడిని పెంచడానికి దోహదపడుతుంది. పంట ఎదుగుదల, మొక్కలు బలంగా ఉండేందుకు సేంద్రియ ఎరువు ఎంతో ఉపయోగపడుతుంది. ఎకరానికి నాలుగు నుంచి ఐదు ట్రాక్టర్ల పశువుల ఎరువును వినియోగిస్తే భూమి సారవంతమవుతుంది.

గొర్రెల పెంటకు భలే గిరాకీ..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షల్లో గొర్రెలు ఉన్నాయి. ఒకప్పుడు రెండు మూడు సామాజిక వర్గాల వారే గొర్రెలను మేపే వారు. ఇటీవల గొర్రెల మాంసా నికి డిమాండ్‌ ఉండడంతో చాలా మంది షెడ్లను ఏర్పాటు చేసుకొని మరీ గొర్రెలను పెంచుతున్నారు. గొర్రెల పెంటకు గిరాకీ ఉండడంతో కాపరులకు అదనపు ఆదాయం తెచ్చి పెడుతోంది. గొర్రెల పెంట కోసం ఉమ్మడి జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతాల నుంచి కొనుగోలు చేయడానికి వ్యాపారులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు కాపర్లు చెబుతున్నారు. తమ వద్దకే వచ్చి గొర్రెల పెంట 30 కిలోల బస్తాను రూ. 60 దాకా వెచ్చించి కొనుగోలు చేసి వాహనాల్లో తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. గొర్రెల పెంటను కర్ణాటక రాష్ట్రంలో వక్క చెట్లకు, దానిమ్మ తోటలకు అధికంగా వినియోగిస్తున్నట్లు తెలిసింది.

సేంద్రియ ఎరువులతో ఎన్నో లాభాలు

అధిక దిగుబడులతో పాటు

భూసారం పెంపు

అధికారుల సూచనలతో

అటువైపు అన్నదాతల దృష్టి

అధిక దిగుబడులు..

పొలాలకు సేంద్రియ ఎరువులను తోలుకుంటే అధిక దిగుబడులు వస్తాయి. రసాయనిక మందులను వేసుకుంటే వారం పది రోజుల పాటు మాత్రమే పొలం కళగా వుంటుంది. ఆ తరువాత యథాస్థితికి వస్తుంది. పశువుల ఎరువును వేసుకుంటే చివరి వరకు పొలం పచ్చగా కళకళలాడుతుంది. దిగుబడి కూడా గణనీయంగా పెరుగుతుంది. – వెంకటరెడ్డి, రైతు, కుణుతూరు

సేంద్రియ సాగుపై దృష్టి పెట్టండి

రసాయన ఎరువులను అధికంగా వాడుతుండడంతో తో భూమిలోని సారం తగ్గిపోతుంది. రైతులు సేంద్రి య సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పంట మార్పిడితో రైతులకు ఆర్థిక దన్ను ఉంటుంది. సేంద్రియ ఎరువులతో భూమి సారవంతంగా మారుతుంది. అధిక దిగుబడులనూ సాధించవచ్చు.

– ముస్తఫా, వ్యవసాయాధికారి, ధర్మవరం

సేంద్రియం వైపు.. రైతు చూపు 1
1/3

సేంద్రియం వైపు.. రైతు చూపు

సేంద్రియం వైపు.. రైతు చూపు 2
2/3

సేంద్రియం వైపు.. రైతు చూపు

సేంద్రియం వైపు.. రైతు చూపు 3
3/3

సేంద్రియం వైపు.. రైతు చూపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement