శభాష్‌ ‘నిత్యశ్రీ’ | - | Sakshi
Sakshi News home page

శభాష్‌ ‘నిత్యశ్రీ’

Feb 1 2026 3:04 AM | Updated on Feb 1 2026 3:04 AM

శభాష్‌ ‘నిత్యశ్రీ’

శభాష్‌ ‘నిత్యశ్రీ’

తొలి ప్రయత్నంలోనే గ్రూప్‌–1కు ఎంపిక

డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టు దక్కిన వైనం

గ్రూప్‌లో–2లో సైతం సత్తా చాటిన

తనకల్లు యువతి

తనకల్లు: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించిన గ్రూప్‌–1 ఫలితాల్లో తనకల్లుకు చెందిన నిత్యశ్రీ సత్తాచాటారు. జోన్‌–2 పరిధిలో ఆంధ్రప్రదేశ్‌ కో ఆపరేటివ్‌ సర్వీసులో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా ఎంపికయ్యారు. తొలిప్రయత్నంలోనే ఆమె గ్రూప్‌–1 సాధించడం విశేషం. రెండు రోజుల క్రితం విడుదలైన గ్రూప్‌–2 ఫలితాల్లోనూ మంచి ప్రతిభ చూపి రోడ్లు, భవనాల శాఖలో పోస్టు సాధించారు.

తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే..

నిత్యశ్రీ ప్రాథమిక విద్య నుంచి పదో తరగతి వరకూ మొలకలచెరువులో చదివారు. ఆ తర్వాత ఐఐఐటీ ఇడుపులపాయ క్యాంపస్‌లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఆమె తల్లిదండ్రులు రెడ్డెప్ప, టి.శ్రీవాణి ప్రభుత్వ ఉపాధ్యాయులు. శ్రీవాణి తనకల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఇటీవలే బదిలీపై హిందూపురానికి వెళ్లారు. తండ్రి రెడ్డెప్ప బి. కొత్తకోట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కాగా నిత్యశ్రీ తొలిసారే గ్రూప్‌–1 పరీక్షల్లో సత్తా చాటి డిప్యూటీ రిజిస్ట్రార్‌గా ఎంపిక కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సివిల్స్‌ సాధించడమే లక్ష్యం

నా తల్లిదండ్రులతో పాటు మేనమామలు లక్ష్మీనారాయణ, గిరిధర్‌ అందించిన ప్రోత్సాహంతోనే నేను గ్రూప్‌–1లో విజయం సాధించగలిగాను. డిప్యూటీ రిజిస్ట్రార్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. అయితే నా టార్గెట్‌ సివిల్స్‌. అందులో విజయం సాధించి కలెక్టర్‌గా పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం. – నిత్యశ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement