బొమ్మనహాళ్ మండలం నేమకల్లు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఎన్.అంకిత నెట్‌బాల్ క్రీడలో రాణిస్తోంది. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో అండర్ –14, అండర్ –17, అండర్–19 విభాగాల్లో అద్భుత ప్రతిభ ప్రదర్శించి శ్రీకాకుళంలో జరగనున్న రాష్ట్రస్థాయి నెట్‌బాల్ క్రీడా పోటీలకు ఎంపికయ్యింది. తన ఊరు పేరును జాతీయ స్ధాయిలో నిలబెట్టాలనే పట్టుదలతో నెట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నానని అంకిత చెబుతోంది. హెచ్ఎం పాణ్యం అనిల్‌కుమార్, ఫిజికల్ డైరెక్టర్ బి.బోగేష్ అందించిన నిరంతర శిక్షణ, మార్గదర్శకత్వం ఎంతగానో ఉపయోగపడిందని తెలిపింది.
– బొమ్మనహాళ్


