ప్రశాంతి నిలయం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రామగిరి మండల వ్యాప్తంగా టీడీపీ గూండాలు అరాచకాలకు పాల్పడి ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేకుండా చేశారని, కనీసం పంచాయతీ ఎన్నికలైనా ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రామగిరి మండలం పేరూరు, కొండాపురం, ఎంసీ పల్లి పంచాయతీలకు చెందిన వారు కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు విన్నవించారు. శుక్రవారం కలెక్టరేట్‌కు విచ్చేసిన వారు కలెక్టర్ శ్యాం ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పరిషత్ ఎన్నికల్లో రామగిరి మండల వ్యాప్తంగా నామినేషన్ కూడా వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలు ఓటు వేయకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారన్నారు. పంచాయతీ ఎన్నికలకు సరైన చర్యలు తీసుకోకపోతే మళ్లీ అవే పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. పేరూరు, కొండాపురం, ఎంసీపల్లి పంచాయతీల్లో 12 వేలకుపైగా జనాభా ఉందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశించిన మేరకు 10వేలకు పైబడి జనాభా ఉన్న ప్రతిచోటా ప్రత్యేకంగా ఆర్‌ఓను నియమించి ఎన్నికలు నిర్వహించాలన్నారు. స్పందించిన కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పేరూరు మాజీ సర్పంచ్ బెస్త రాజేష్, నరసింహారెడ్డి, వెంకటరెడ్డి, కేసీ మల్లికార్జున, మోహన్‌బాబు, నాగిరెడ్డి, పెద్దన్న, గంగన్న, రాజ్ కమల్, రాజారెడ్డి, సిద్దన్న, గంగాధర్ పాల్గొన్నారు.
పరిషత్ ఎన్నికల్లో టీడీపీ గూండాలు
అరాచకం చేశారు
పంచాయతీ ఎన్నికల్లో మా ఓటు మేమే వేసేలా అవకాశం కల్పించండి
కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు పేరూరు,
కొండాపురం, ఎంసీ పల్లి వాసుల వినతి


