బహుముఖ ప్రజ్ఞ చిన్నారుల సొంతం | - | Sakshi
Sakshi News home page

బహుముఖ ప్రజ్ఞ చిన్నారుల సొంతం

Nov 14 2026 1:29 AM | Updated on Nov 14 2026 1:29 AM

చదువులోనే కాదు.. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళలు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత ఇలా విభిన్న రంగాల్లో బాలలు ప్రతిభ చాటుతున్నారు. చిన్న వయసులోనే అసాధారణ నైపుణ్యాలు, ధైర్యసాహసాలతో అబ్బురపరుస్తూ ఔరా అనిపిస్తున్నారు. సృజనాత్మక ఆలోచనలు, పట్టుదల, ఏకాగ్రతతో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటున్నారు. శనివారం బాలల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న చిన్నారుల ప్రతిభా పాటవాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
చెస్‌లో రాణిస్తున్న రామ్‌ అంకిత్‌

హిందూపురం టౌన్‌: పట్టణానికి చెందిన రామ్‌అంకిత్‌ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ‘చెస్‌’లో రాణిస్తున్నాడు. చిన్ననాటి నుంచే చెస్‌పై ఆసక్తి పెంచుకున్న రామ్‌ అంకిత్‌.. 2023 నుంచి ప్రొఫెషనల్‌ క్రీడాకారుడిగా ఎదిగాడు. బెంగళూరు, కర్నూలులో నిర్వహించిన ఫిడే రేటెడ్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీల్లో పాల్గొన్నాడు. చెక్‌ అండ్‌ మేట్‌, ఆర్‌యూఏఎస్‌, జీసీఎల్‌ వంటి టోర్నీలతో అనుభవం గడించాడు. ఇటీవల జరిగిన మొదటి రోటరాక్ట్‌ – చిల్డ్రన్‌ చెస్‌ అకాడమీ ఆల్‌ ఇండియా ఓపెన్‌ ఫిడే రేటింగ్‌ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌ పాల్గొని సత్తా చాటాడు. 14 ఏళ్ల వయస్సులోనే 1,549 ఫిడే ర్యాపిడ్‌ రేటింగ్‌ ర్యాంకు దక్కించుకున్నాడు. చెస్‌తో పాటు చదువులోనూ రాణిస్తున్న అంకిత్‌ భవిష్యత్‌లో ఎంబీబీఎస్‌ అభ్యసించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement