Brain tumer
-
క్యాన్సర్ చికిత్సలో సంచలనం
న్యూఢిల్లీ: వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రాణాంతకమైన మెదడు క్యాన్సర్‌ను నయం చేసే దిశగా శాస్త్రవేత్తలు ఒక సంచలన విజయాన్ని సాధించారు. అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు అభివృద్ధి చేసిన సరికొత్త ‘కార్-టీ సెల్ థెరపీ’ చికిత్సతో, కేవలం ఐదు రోజుల్లోనే ఒక రోగి మెదడులోని కణితి దాదాపుగా మటుమాయమయ్యింది.ఏమిటీ ‘మ్యాజిక్’ థెరపీ?సాధారణంగా గ్లియోబ్లాస్టోమా (Glioblastoma) అనేది అత్యంత వేగంగా వ్యాపించే, ప్రమాదకరమైన బ్రెయిన్ క్యాన్సర్. దీనికి చికిత్స అందించడం వైద్యులకు పెద్ద సవాలుగా ఉండేది. అయితే ‘CARv3-TEAM-E’ అనే సరికొత్త ప్రయోగాత్మక మందు పరిష్కారంగా మారింది. ఈ పద్ధతిలో రోగిలోని రోగనిరోధక కణాలను సేకరించి, వాటికి జన్యుపరమైన మార్పులు చేస్తారు. ఈ మార్పు చెందిన కణాలు నేరుగా క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని నాశనం చేస్తాయి.క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు‘ఇన్సిపియంట్’ (INCIPIENT) పేరుతో నిర్వహించిన మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌లో 57 నుండి 74 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు రోగులకు ఈ థెరపీని అందించారు. వీరందరూ ఇప్పటికే రేడియేషన్, కీమోథెరపీ వంటి ప్రామాణిక చికిత్సలు పొంది, సరైన ఫలితాలను అందుకోలేకపోయారు. ఇప్పుడు ఒక రోగికి కేవలం ఒకే ఒక్క ఇంజెక్షన్ ఇవ్వగా, ఐదు రోజుల్లోనే కణితి దాదాపు పూర్తిగా కరిగిపోయింది. మరో రోగిలో.. ఆరు నెలల పాటు కణితి పరిమాణం 60 శాతం వరకు తగ్గింది. ఈ మందును నేరుగా మెదడులోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా వైద్యులు గరిష్ట ఫలితాలను సాధించారు.సవాళ్లు.. భవిష్యత్తు ఆశలుఈ చికిత్స పొందిన రోగులకు జ్వరం లాంటి కొన్ని సాధారణ దుష్ప్రభావాలు మినహా పెద్దగా ఇబ్బందులు కలగలేదు. అయితే ఈ థెరపీ వల్ల లభించిన ఫలితాలు ప్రస్తుతం తాత్కాలికంగానే ఉన్నాయి. కణాలు ఎక్కువ కాలం మెదడులో మనుగడ సాగించలేకపోవడం వల్ల కొంతకాలం తర్వాత క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. దీంతో మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం భవిష్యత్తులో క్యాన్సర్ రహిత ప్రపంచాన్ని నిర్మించే దిశగా ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘జైషే’కు భారీ దెబ్బ.. తాహిర్ అనుమానాస్పద మృతి -
అమానుషం: భార్యకు చికిత్స చేయించలేక..
ముంబై : అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేక ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను దారుణంగా హత్య చేసి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన శనివారం రాత్రి మహారాష్ట్రలోని పర్భణి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పర్భిణి జిల్లా ముద్గల్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి భార్య గత కొన్ని సంవత్సరాలుగా బ్రేయిన్ టూమర్‌తో బాధపడుతోంది. నిరుద్యోగి అయిన అతడు ఆమె ఖర్చుల నిమిత్తం విపరీతంగా శ్రమించేవాడు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న భార్యకు కడుపునిండా సరైన తిండి పెట్టలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఆమెను చంపాలని నిశ్చయించకున్నాడు. శనివారం రాత్రి పదునైన ఆయుధంతో ఆమెను చంపేశాడు. అనంతరం ఇంటి బయటకొచ్చి రక్తంతో తడిసిన బట్టల్ని దగ్గరలో పడేసి వెళ్లిపోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దుస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి : దారుణం: నిద్రలేపి నుదుటిపై తుపాకీతో... -
కన్నపేగుకు ఎంతకష్టం
* ఉన్నదంతా అమ్మినా నయకాని రోగం * ఆపన్న హస్తం కోసం ఎదిరుచూపులు పేదరికం వారి పాలిట శాపమైంది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాలు కన్నపేగు బాగు కోసం ఉన్నదంతా ఊడ్చి పెట్టారు. అరుునా మాయదారి జబ్బు నయం కాలేదు. చివరకు చేతిలో చిల్లి గవ్వలేక వైద్యం చేయించడానికి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకొస్తే బిడ్డల ప్రాణాలు నిలుస్తాయని ఆ కన్నతల్లిదండ్రులు వేడుకుంటున్నారు. - ధర్మపురి/హుజూరాబాద్ టౌన్ మెదడు సంబంధ వ్యాధిలో బాలుడు ధర్మపురి మండలం ఆరెపెల్లి గ్రామానికి చెందిన ఆరెల్లి కిష్టయ్య-మమత దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు సంతానం. భర్త ముంబాయిలో ఒకరి ఇంట్లో పనిమనిషిగా చేస్తుం డగా భార్య కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తోంది. చిన్నకుమారుడు రక్షిత్(5) పుటిన మూడేళ్ల వరకు ఆడుతూ పాడుతూ తల్లి గోరుముద్దలు తిన్నాడు. రెండు సంవత్సరాల క్రితం ఒక్కసారి ఫిట్స్‌తో రక్షిత్ పడిపోయాడు. తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేరుుంచి కొన్ని రోజులకు ధర్మపురిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించి మందులు వాడుతున్నారు. ఒక్కసారి వచ్చిన ఫిట్స్ వారంలో మూడు సార్లు వస్తూ ఉండడంతో స్థానిక వైద్యుల సూచన మెరకు జగిత్యాల, కరీంనగర్ పట్టణాల్లో వైద్యం చేయించారు. అప్పటికే రూ.మూడు లక్షల వరకు ఖర్చయ్యూరుు. ఉన్న ఎకురుం పొలం అమ్మెశారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఫిట్స్ కాదు మెదడులో రక్తప్రసరణ లేక తరుచుగా ఇలా జరుగుతోందని చెప్పారు. ఆ తర్వాత ఒకసారి ఫిట్స్‌తో కిందపడిపోగా కోమాలోకి వెళ్లి 15 రోజులు మూసిన కన్ను తెరువలేదు. హైదరాబాద్ తీసుకెళ్లమని డాక్టర్లు చెప్పడంతో ఉన్న ఇల్లు సైతం అమ్మెసి బయట కొంత అప్పుచేసి చికిత్స చేరుుంచారు. సుమారు రూ.8 లక్షల వరకు ఖర్చరుుందని, చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంటికి చేరినట్లు మమత తెలిపింది. గత సంవత్సరం చీఫ్‌విప్ చొరవతో సీఎం రిలీఫ్ ఫండు ద్వారా రూ.48వేలు రాగా అవి ఆస్పత్రిలో ఉన్నపుడు వారంరోజుల మందులకు సరిపోలేదని చెపింది. ప్రస్తుతం రోజువారీ మందులకు ఇబ్బందవుతోందని, ఇటీవల మందులు వాడకపోవడంతో రక్షిత్ కిందపడిపోరుు తలకు, చేతికి తీవ్రగాయాలయ్యాయని కన్నీటి పర్యంతమైంది. కొడుక్కి వైద్యం కొనసాగించడానికి ఆపన్నహస్తం కోసం ఆ కన్నతల్లి ఎదురుచూస్తోంది. సహాయం చేయూలనుకునే దాతలు 94408 43740 నంబర్లో సంప్రదించవచ్చు. చిన్నారి గుండెకు రంధ్రం హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన మన్యాల తిరుపతి, స్వప్న దంపతుల కూతురు జ్ఞానప్రసన్న(9) జన్మించిన కొన్ని నెలలకే అస్వస్థకు గురవుతుండటంతో తల్లిదండ్రులు కరీంనగర్‌లోని పిల్లల ఆస్పత్రిలో చూపించారు. పరీక్షించిన వైద్యులు బాలిక గుండెకు రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా పాపకు చెడు, మంచి రక్తం రెండూ కలుస్తున్నాయని నిర్ధారించి వైద్యానికి భారీగా ఖర్చువుతుందని చెప్పారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ దంపతులకు ఏమి చేయూలో తోచలేదు. కూలీపనికి వెళితేనే కుటుంబం గడవని పరిస్థితి. అయినా చివరకు ధైర్యం చేసి కూతురును కాపాడుకోవాలనే తపనతో వైద్యం చేయించడానికి బంధువులు, మిత్రుల వద్ద అప్పుచేశారు. కరీంనగర్, గోదావరిఖనితోపాటు హైదరాబాద్‌లో ఆస్పత్రులు తిరిగారు. అప్పటికే సుమారు రూ.లక్షా 50 వేలు ఖర్చయ్యాయి. చిన్నారని పరిక్షించిన వైద్యులు ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని చెప్పినటప్పటికీ మందులు, స్కానింగ్‌లు, ఇతర పరీక్షలకు మరో రూ.2లక్షల వరకు అదనంగా ఖర్చవుతుందని చెప్పారు. దీంతో ఏమి చేయూలో తోచని స్థితిలో ఆ దంపతులు కొట్టుమిట్టాడుతున్నారు. వైద్యానికి సాయంమందికి కూతురును కాపాడాలని దాతలను వేడుకుంటున్నారు. సహయం చేయదలిచిన వారు 94407 22283 నంబర్‌కు సంప్రదించాలి.


