30న ఆటోల బంద్‌! | Auto Drivers' Strike in Telangana | Sakshi
Sakshi News home page

30న ఆటోల బంద్‌!

Nov 16 2026 12:47 PM | Updated on Nov 16 2026 1:09 PM

Auto Drivers' Strike in Telangana

హైదరాబాద్‌: ఆటో మీటర్‌ చార్జీల పెంపుతో సహా పదిహేను సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. ఈనెల 30వ తేదీన ఆటో బంద్‌ నిర్వహిస్తామని మహాత్మాగాంధీ తెలంగాణ ఆటో డ్రైవర్‌ జేఏసీ కన్వీనర్ మహ్మద్‌ అమానుల్లా ఖాన్‌ తెలిపారు. ఆదివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేకరులతో మాట్లాడుతూ.... గ్రీన్‌ క్యాబ్‌లను వెంటనే నిషేధించాలని, తమిళనాడుతో సమానంగా ఆటో మీటర్‌ రేట్లు పెంచాలని డిమాండ్‌ చేశారు.

 ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల మేరకు ఏడాదికి రూ.12 వేలు అంటే గడిచిన మూడు సంవత్సరాలకు మొత్తం రూ.36 వేలు వెంటనే చెల్లించాలన్నారు. ఫ్రీ బస్సు కారణంగా ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. జీఓ నంబరు 2063లో మిగిలిన ఆటోలను వెంటనే ఇవ్వాలని కోరారు. పదిహేను రోజులలోగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ముజాహీద్‌ హాస్మీ, రమే‹Ù, అబ్దుల్‌ రజాక్, ఆంజనేయులు, మహబూబ్, అక్తర్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement