
అత్తి పండు,అంజీర లేది ఫిగ్ పిలవడం ఏ పేరుతో పిలిచినా, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అద్భుతం. అంజీర్ పండ్లలో విటమిన్లు ఎ, బి1, బి2, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్, సోడియం, పొటాషియం, క్లోరిన్ . డైటరీ ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే దీన్ని ఔషధ ఫలంగా వాడతారు. రోగనిరోధకశక్తిని పెంచే గుణాలోన్నో ఉన్నాయి. పండుగా గానీ , ఎండ బెట్టి డ్రై ఫ్రూట్‌గా గాన్నీ తీసుకోవచ్చు.
అత్తి పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
లైంగిక బలహీనత: లైంగిక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. రాత్రిపూట 2-3 అత్తి పండ్లను పాలలోనానబెట్టి ఉదయం వాటిని తింటే లైంగిక శక్తి మెరుగుపరుస్తుంది.
మలబద్ధకం : ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. అజీర్ణాన్ని తగ్గిస్తుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ వల్ల బరువును కూడా తగ్గించుకోవచ్చు.
గుండె జబ్బులు : అత్తి పండ్లలో ఫినాల్ మరియు ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యం ఉంటుంది.
కొలెస్ట్రాల్: అత్తి పండ్లలోని పెక్టిన్ అనేకరిగే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది. శరీరం నుండి వ్యర్థ కొలెస్ట్రాల్ బయటకు పంపుతుంది. (ప్రియుడితో పాప్ సింగర్ ఎంగేజ్‌మెంట్ : రూ. 5 కోట్ల డైమండ్ రింగ్)
నిద్రలేమికి : వీటిల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే పోషకం మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.
రక్తహీనత: అంజీర్ పండ్లను తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
ఇంకా పైల్స్‌తో బాధపడుతున్నవారు, దగ్గు, ఉబ్బసం ఉన్నవారు కూడా అత్తిపండ్లను తినడం ద్వారా ఉపశమనం పొందవచ్చని చెబుతారు. అంజీర ఆకుల నుండి తీసిన ఇథనాలిక్ సారాలు బలమైన యాంటీపైరెటిక్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇది వాణిజ్య యాంటీపైరెటిక్స్ కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందట. ఎందుకంటే ఇది ఐదు గంటల కంటే ఎక్కువ కాలం ఉంటుందని చెబుతారు.
ఎవరు తినకూడదు?
గర్భధారణ సమయంలో వీటిని తీసుకోవచ్చు. కానీ మితి మీరి తీసుకోకూడదు. ఇది రక్తంలో చక్కెర తగ్గడానికి దారితీస్తుంది. మితంగా తినగకపోతే ఎవరికైనా నష్టమే. ఎక్కువ తినడం వల్ల విరేచనాలు వస్తాయి. అలాగే మూత్రపిండ సంబంధిత వ్యాధి లేదా పిత్తాశయం సమస్యతో బాధపడేవారు అత్తి పండ్లను తినకూడదు. ఒకవేళ తింటే తీవ్రమైన బెవరేజెస్‌కు కారణమవుతుంది. కాబట్టి మూత్రపిండ సమస్యలు ఉన్నవారిని ఈ పండు తినకుండా నివారించాలి.
ఇదీ చదవండి: బాయ్ ఫ్రెండ్‌తో బాక్సింగ్ క్వీన్..మేరీ కోమ్ మేకప్ వీడియో వైరల్