
ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తన చిరకాల ప్రియుడు ప్రముఖ అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ట్రావిస్ కెల్సీ నిశ్చితార్థం చేసుకుంది. ఈ సంతోషకరమైన వార్తను ప్రకటిస్తూ పోస్ట్ చేయడంతో ‘స్వెల్స్’ అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారింది. దీనికి తోడు టేలర్ స్విఫ్ట్ భారీ డైమండ్ ఉంగరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 7-20 క్యారెట్లు, 18 కేరట్ల బంగారం టేలర్ స్విఫ్ట్ నిశ్చితార్థ ఉంగరం ధర ఎంత? అనే చర్చ నడుస్తోంది.
'నేను కాగితపు ఉంగరాలతో నిన్ను పెళ్లి చేసుకుంటాను' అని ఒకప్పుడు పాడిన టేలర్ స్విఫ్ట్, భారీ విలువైన ఉంగరంతో ఆగస్టు 26న, తన డ్రీమ్ బోయ్ ట్రావిస్ కెల్స్‌తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించడం విశేషంగా నిలిచింది. డిజైన్, టేలర్ స్విఫ్ట్ అభిరుచికి తగినట్టుగా ఎంతో ప్రత్యేకంగా ఉందని టాక్ వినిపిస్తోంది.
ఈ రింగ్‌లో పురాతన 'ఓల్డ్ మైన్ బ్రిలియంట్' కట్ వ జ్రాన్ని పొదిగారు. దీని విలువ సుమారు రూ. 4.8 కోట్లు.
చదవండి: లైవ్ ఈవెంట్‌లో కుప్పకూలిన నటుడు, వెంటిలేటర్‌పై చికిత్స
ప్రియురాలి కోసం ప్రత్యేకంగా ఈ ఉంగరాన్ని న్యూయార్క్‌కు చెందిన ఆర్టిఫెక్స్ ఫైన్ జ్యువెలరీతో కలిసి స్వయంగా డిజైన్ చేయించారటట్రావిస్ కెల్సీ . ఇందులో 7 నుంచి 10 క్యారెట్ల బరువున్న అరుదైన 'ఓల్డ్ మైన్ బ్రిలియంట్' కట్ వజ్రాన్ని 18 క్యారెట్ల బంగారంతో చేశారు. దీనిపై నిపుణులు అంచనా వేస్తున్న విలువ అక్షరాలా 5,50,000 డాలర్లు.

ప్రముఖ ఆభరణాల వ్యాపారి జార్జ్ ఖలీఫ్, అలియాస్ జార్జ్ ది జ్యువెలర్ అంచనా వజ్రం దాదాపు 20 క్యారెట్ల బరువు ఉంటుంది. ఈ ఉంగరం ఖచ్చితంగా విక్టోరియన్ యుగానికి చెందినదై ఉంటుందని మరో నిపుణుడి అంచనా. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ఊహలు మరింత జోరుగా వ్యాపిస్తున్నాయి.