
పరిస్థితి విషమం, 72 గడవాల్సిందే అంటున్న వైద్యులు
ప్రముఖ నటుడు, టెలివిజన్ ప్రెజెంటర్ రాజేష్ కేశవ్ (47), అలియాస్ RK ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక లైవ్ ఈవెంట్‌లో కుప్పకూలి, కొచ్చిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, పరిశ్రమపెద్దలు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.
ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ఆయనకు గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోవెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నారు. అయితే మెదడు ప్రభావితమైందని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, రాబోయే 72 గంటలు చాలి క్లిష్టమైనవని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి .దీంతో కేశవ్ త్వరగా కోలుకోవాలంటూ సన్నిహితులు, స్నేహితులు, సహచరులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఆదివారం (ఆగస్టు 24) రాత్రి ఆదివారం రాత్రి కొచ్చిలో ఒక పబ్లిక్ ప్రోగ్రాం నిర్వహిస్తూ అకస్మాత్తుగా వేదికపై కుప్పకూలిపోయారు. నిర్వాహకులు, వైద్య సిబ్బంది వెంటనే స్పందించి అత్యవసర చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రాజేష్‌కు అత్యవసర యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై ఉన్నారని, వైద్యులు అతని పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారంటూ,ఈ ఘటన సందర్బంగా, అక్కడే ఉన్న చిత్రనిర్మాత ప్రతాప్ జయలక్ష్మి సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్‌ను పంచుకున్నారు.
ఎవరీ రాజేష్ కేశవ్?
కేరళలో టెలివిజన్ యాంకర్‌గా రాజేష్ కేశవ్ చాలా పాపులర్. అనేక హిట్ రియాలిటీ, టాక్ షోల ద్వారా అపారమైన ప్రజాదరణను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్నాడు.
ఇదీ చదవండి: ఈ గుడిలో ఎలుక రాజా చెవిలో చెబితే చాలు.. అన్ని శుభాలే!
కార్డియాక్ అరెస్ట్ అంటే?
గుండె అకస్మాత్తుగా సరిగ్గా కొట్టుకోవడం ఆగిపోయి, మెదడు, ఇతర ముఖ్య అవయవాలకు రక్త ప్రవాహం నిలిచిపోవడం.
గుండెపోటులాగా కాకుండా ఈ షాక్ వల్ల ఒక్కోసారి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.
ఆకస్మికంగా కుప్పకూలడం, స్పృహ కోల్పోవడం , పల్స్ లేకపోవడం వంటివి తక్షణ లక్షణాలు.
CPR (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) వంటి తక్షణ చర్యలు , డీఫిబ్రిలేటర్ వాడకం కీలకం.
చికిత్సకు స్పందించకపోతే, రాజేష్ విషయంలో లాగా, రోగులకు తరచుగా ఇంటెన్సివ్ కేర్ చికిత్స అవసరం.
లక్షణాలు: తీవ్రమైన తలనొప్పి, ఆందోళన ,గందరగోళం, తలతిరగడం , వాంతులు రావడం, రెండు లేదా ఒక కన్ను చూడటంలో ఇబ్బంది చేతులు, కాళ్ళు ,ఇతర శరీరంభాగాల్లో తిమ్మిరి లేదా బలహీనత లాంటి లక్షణాలుంటే వెంటనే అప్రమత్తం కావాలి.
నివారణ ఎలా?
- ఆరోగ్యకరమైన జీవనశైలిని, కొన్ని ముందు జాగ్రత్త చర్యల ద్వారా కార్డియాక్ అరెస్ట్ ముప్పునుంచి తప్పించుకోవచ్చు.
- క్రమం తప్పకుండా వ్యాయామం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
- కొలెస్ట్రాల్ , రక్తపోటు స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే మరీ జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.
- ఆరోగ్యకరమైన, సమతులం ఆహారం తీసుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.. బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల చాలా అనారోగ్యాలనుంచి దూరంగా ఉండవచ్చు.