breaking news
engangement
-
ప్రియుడితో పాప్ సింగర్ ఎంగేజ్మెంట్ : రూ. 5 కోట్ల డైమండ్ రింగ్
ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తన చిరకాల ప్రియుడు ప్రముఖ అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ట్రావిస్ కెల్సీ నిశ్చితార్థం చేసుకుంది. ఈ సంతోషకరమైన వార్తను ప్రకటిస్తూ పోస్ట్ చేయడంతో ‘స్వెల్స్’ అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారింది. దీనికి తోడు టేలర్ స్విఫ్ట్ భారీ డైమండ్ ఉంగరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 7-20 క్యారెట్లు, 18 కేరట్ల బంగారం టేలర్ స్విఫ్ట్ నిశ్చితార్థ ఉంగరం ధర ఎంత? అనే చర్చ నడుస్తోంది.'నేను కాగితపు ఉంగరాలతో నిన్ను పెళ్లి చేసుకుంటాను' అని ఒకప్పుడు పాడిన టేలర్ స్విఫ్ట్, భారీ విలువైన ఉంగరంతో ఆగస్టు 26న, తన డ్రీమ్ బోయ్ ట్రావిస్ కెల్స్‌తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించడం విశేషంగా నిలిచింది. డిజైన్, టేలర్ స్విఫ్ట్ అభిరుచికి తగినట్టుగా ఎంతో ప్రత్యేకంగా ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ రింగ్‌లో పురాతన 'ఓల్డ్ మైన్ బ్రిలియంట్' కట్ వ జ్రాన్ని పొదిగారు. దీని విలువ సుమారు రూ. 4.8 కోట్లు.చదవండి: లైవ్ ఈవెంట్లో కుప్పకూలిన నటుడు, వెంటిలేటర్‌పై చికిత్సప్రియురాలి కోసం ప్రత్యేకంగా ఈ ఉంగరాన్ని న్యూయార్క్‌కు చెందిన ఆర్టిఫెక్స్ ఫైన్ జ్యువెలరీతో కలిసి స్వయంగా డిజైన్ చేయించారటట్రావిస్ కెల్సీ . ఇందులో 7 నుంచి 10 క్యారెట్ల బరువున్న అరుదైన 'ఓల్డ్ మైన్ బ్రిలియంట్' కట్ వజ్రాన్ని 18 క్యారెట్ల బంగారంతో చేశారు. దీనిపై నిపుణులు అంచనా వేస్తున్న విలువ అక్షరాలా 5,50,000 డాలర్లు.ప్రముఖ ఆభరణాల వ్యాపారి జార్జ్ ఖలీఫ్, అలియాస్ జార్జ్ ది జ్యువెలర్ అంచనా వజ్రం దాదాపు 20 క్యారెట్ల బరువు ఉంటుంది. ఈ ఉంగరం ఖచ్చితంగా విక్టోరియన్ యుగానికి చెందినదై ఉంటుందని మరో నిపుణుడి అంచనా. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ఊహలు మరింత జోరుగా వ్యాపిస్తున్నాయి. -
అందరి కళ్లు దీపికా పదుకొణె వైపే.. ఆ శారీ అన్ని లక్షలా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ముంబైలో గురువారం జరిగిన ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కు బాలీవుడ్ నుంచి దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ పాల్గొన్నారు. తాజాగా ఈ వేడుకలో పాల్గొన్న బాలీవుడ్ జంట ధరించిన దుస్తులపై నెట్టింట చర్చ నడుస్తోంది. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె సంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కాగా.. దీపికా చీరలో అద్భుతంగా కనిపించగా.. రణ్వీర్ షేర్వాణీ ధరించి తళుక్కున మెరిశారు. దీపికా ధరించిన సిందూరి తాషి చీర దాదాపు రూ. 1.50 లక్షలుగా ధర ఉన్నట్లు తెలుస్తోంది. బంగారం, ఎరుపు కలయికతో రూపొందించిన ఈ చీరను షాలీనా నథాని అనే స్టైలిస్ట్ తయారు చేశారు. రణ్వీర్ సింగ్ షేర్వాణీ ధరించడంతో ఈ జంట మరింత ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలో వీరితో పాటు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్, మనీష్ మల్హోత్రా, అర్జున్ కపూర్, బోనీ కపూర్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్య, కత్రినా కైఫ్, జాన్వీ కపూర్, ఖుషి కపూర్, అనన్య పాండే సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. -
సమంత, చైతు నిశ్చితార్థం డేట్ ఫిక్స్?
హైదరాబాద్: టాలీవుడ్ అందమైన జంటగా అభిమానులు యాక్సెప్ట్ చేసిన లవ్లీ కపుల్ నాగచైతన్య, సమంత నిశ్చితార్థానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైయిందట. ఈ మేరకు టాలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తమ అభిమాన జంటకు నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ అయిందన్నవార్తల అటు అభిమానులను, ఇటు ఫిలింనగర్ ను మురిపిస్తోంది. ఇటీవల చైతూ ట్విట్టర్ లో చేసిన సందడి కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. మరోవైపు నాగర్జున చిన్నకుమారుడు అఖిల్ నిశ్చాతార్థం ఇప్పటికే పూర్తి కావడంతో.. ఈ శుభకార్యాన్ని కూడా తొందరగా జరిపించాలని నాగార్జున భావిస్తున్నారట! చైతు, సమంతల నిశ్చితార్థ వేడుక జనవరి 29న నిర్వహించనున్నారనే ఫిలింనగర్ లో గుప్పుమంది. ఇప్పటికే ఏర్పాట్టు ముమ్మరంగా సాగుతున్నాయనీ, అతిథులను ఆహ్వానించే పనిలో నాగ్ దంపతులు బిజీగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ శుభఘడియకోసం ఎదురుచూస్తున్న ఈ జంట అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. అయితే దీనిపై అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకు సస్పెన్స్ మాత్రం తప్పదు.