
పట్టుచీర, నగలు, మల్లెపూలతో ముస్తాబు
ప్రముఖ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష కుమారుడు వివాహ వేడుకలో బాక్సింగ్ సంచలనం మేరీ కోమ్ (Mary Kom స్పెషల్ ఎట్రాక్షన్ నిలిచారు. బాక్సింగ్ రింగ్‌ను శాసించిన లెజెండ్‌మేరీ కోమ్ గోల్డెన్‌సిల్క్ చీర, నిండుగా నగలు, తలనిండా పూలతో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌తో పాటు పలువుర్ని మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన లుక్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో మేరీ కోమ్ షేర్ చేశారు. దీంతో ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతేకాదు కిర్రాక్ ఫోజులతో బాక్సింగ్ రింగ్‌లోనే కాదు..బ్యూటీలో కూడా క్వీన్ అనిపించుకుంది. అంతేకాదు ఆమె పక్కన నడిచిన వ్యక్తికూడా చర్చల్లో నిలిచాడు.
మేరీ కోమ్ ముస్తాబైంది ఇలా
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో పుట్టిన మాంగ్టే చుంగ్నీజాంగ్ మేరీ కోమ్..అద్భుతమైన బాక్సర్ ఒలింపిక్ మెడల్ విజేతగా నిలిచారు. ఒక సాధారణ క్రీడాకారిణి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చుకోవడం దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచిన ఒక స్ఫూర్తిదాయకమైన మహిళ.
క్రీడలకు ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా, ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డులు లభించాయి. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ గెలిచిన ఏకైక బాక్సర్. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకుని భారత క్రీడా ప్రపంచంలోనే కాకుండా గుర్తింపును తెచ్చుకున్నారు. 2014 ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్ .మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితులైనారు.
2005లో ఆంఖోలర్ అకా ఓన్లర్‌ను పెళ్లి చేసుకోగా, వీరికి నలుగురు పిల్లలు. అయితే విభేదాల కారణంతో గత ఏడాది భర్తతో విడిపోయారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించారు.

ఎవరీ హితేష్ చౌదరి
కాగాభర్తతో విడాకుల తరువాత తన వ్యాపార భాగస్వామి హితేష్ చౌదరి( Hitesh Choudhary))తో ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలు వినిపించాయి.మేరీ కోమ్ లేదా హితేష్ చౌదరి ఇద్దరూ బహిరంగంగా ప్రేమ సంబంధాన్ని ధృవీకరించనప్పటికీ, గతంలో అనేక సార్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ తాజాగా పెళ్లి వేడుకలో కూడా సందడి చేశారు. ఉమ్మడి వ్యాపార వెంచర్ స్పోర్టీ ఫిట్ ప్రైవేట్ లిమిటెడ్ హితేష్ చౌదరి సీఎండీగా ఉన్నారు.