breaking news
business partner
-
నిమిషా ప్రియకు ఉరిశిక్ష ఆగేనా?
సనా: అరబ్ దేశం యెమెన్‌లో మాజీ వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో ఉరిశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియను కాపాడేందుకు ప్రయత్నాలు ఉపందుకున్నాయి. ఆమెకు ఈ నెల 16న ఉరిశిక్ష అమలు చేయాలని యెమెన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇప్పటికే జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ‘సేవ్ నిమిషా ప్రియ కౌన్సిల్’పేరిట స్వచ్ఛంద, సామాజిక కార్యకర్తలు ఆమెను ఉరిశిక్ష నుంచి తప్పించడానికి ఉద్యమిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగడుతున్నారు. హత్యకు గురైన మెహదీ కుటుంబం క్షమాభిక్ష ప్రసాదిస్తే శిక్ష నుంచి ఆమె బయటపడే అవకాశం ఉంది. బాధిత కుటుంబానికి బ్లడ్‌మనీ కింద చెల్లించడానికి నిమిషా ప్రియ బంధువులు, మిత్రులు, మద్దతుదారులు రూ.7,35,000 సేకరించారు. మెహదీ కుటుంబం స్పందన కోసం ఎదురు చూస్తున్నామని ‘సేవ్ నిమిషా ప్రియ కౌన్సిల్’సభ్యుడు, సామాజిక కార్యకర్త బాబు జాన్ చెప్పారు. ఆమెను ఎలాగైనా రక్షించాలన్నదే తశ ఆశయమని అన్నారు. ఇప్పటికైనా క్షమాభిక్ష ప్రసాదించాలని, ఒక మహిళ ప్రాణాలు కాపాడాలని మెహదీ కుటుంబాన్ని కోరారు. నిమిషా ప్రియకు మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు చేస్తున్నారు. ఉరిశిక్ష నుంచి బయటపడి ఆమె క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. నర్సుకు ఎందుకు ఉరిశిక్ష? కేరళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లాలోని కొల్లెంగోడ్‌కు చెందిన నిమిషా ప్రియ నర్సింగ్ విద్య అభ్యసించింది. మెరుగైన జీవితం కోసం 2008లో యెమెన్ చేరుకుంది. వేర్వేరు ఆసుపత్రుల్లో పని చేసింది. కొంత అనుభవం గడించిన తర్వాత సొంతంగా ఆసుపత్రి నిర్వహించాలన్న ఆలోచనతో 2014లో తలాల్ అబ్దో మెహదీ అనే యెమెన్ పౌరుడిని వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంది. సొంత క్లినిక్ ఏర్పాటు చేసింది. యెమెన్ చట్టాల ప్రకారం.. విదేశీయులు వ్యాపారం చేయాలంటే స్థానికులు అందులో తప్పనిసరిగా భాగస్వామిగా ఉండాలి. కొంతకాలం తర్వాత నిమిషా ప్రియ, మెహదీ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమె ఫిర్యాదు మేరకు 2016లో మెహదీని పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. ఆమె పాస్‌పోర్టు లాక్కున్నాడు. చంపేస్తానని పలుమార్లు హెచ్చరించాడు. 2017లో మెహదీ నీళ్ల ట్యాంక్‌లో శవమై కనిపించాడు. అతడి శరీరం ముక్కలు ముక్కలుగా నరికేసి ఉంది. విషపు ఇంజెక్షన్లు ఇచ్చిన మెహదీని హత్య చేసినట్లు నిమిషా ప్రియాపై పోలీసులు అభియోగాలు మోపారు. అరెస్టు చేసి యెమెన్ రాజధాని సనా సిటీలోని సెంట్రల్ జైలుకు తరలించారు. 2018లో ట్రయల్ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ఉరిశిక్ష ఖరారు చేసింది. సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సైతం 2023 నవంబర్‌లో ట్రయల్ కోర్టు తీర్పును సమరి్థంచింది. హౌతీ తిరుగుబాలుదారులు ఆమెకు ఉరిశిక్ష అమలు చేసేందుకు ఈ ఏడాది జనవరిలో అనుమతి ఇచ్చారు. యెమెన్‌లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తమ పౌరుడిని హత్య చేస్తే కోర్టులు మరణశిక్ష విధిస్తాయి. శిక్ష తప్పే మార్గం ఉందా? బాధిత కుటుంబ సభ్యులు బ్లడ్‌మనీ(నష్టపరిహారం కింద నగదు) స్వీకరించి, క్షమాభిక్ష ప్రసాదిస్తే నిమిషా ప్రియకు ఉరిశిక్ష తప్పుతుంది. బ్లడ్‌మనీ ఎంత అనేది బాధిత కుటుంబమే నిర్ణయాల్సి ఉంటుంది. నిమిషా ప్రియ తల్లి కేరళలో ఉంటున్నారు. పనిమనిషిగా జీవనం సాగిస్తున్నారు. తన బిడ్డ ప్రాణాలు కాపాడుకొనేందుకు ఆమె ఇప్పటికే తన ఇల్లు అమ్మేశారు. మెహదీ కుటుంబాన్ని ఒప్పించేందుకు నిమిషా ప్రియ మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు ఉరిశిక్ష తప్పించేలా భారత ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని కోరుతూ సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ బుధవారం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు లేఖ రాశారు. సనా సిటీ ప్రస్తుతం హౌతీ తిరుగుబాటుదారుల ఆ«దీనంలో ఉంది. వీరికి ఇరాన్ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌ను ఒప్పించి హౌతీ తిరుగుబాటుదారులపై ఒత్తిడి పెంచితే ఉరిశిక్ష ఆగిపోయే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు సూచిస్తున్నారు. -
వివేక్ ఒబెరాయ్‌కి రూ.1.55 కోట్ల టోకరా
ముంబై: సామాన్యులే కాదు, ప్రముఖులు సైతం ఆర్థిక నేరాల బారినపడుతున్నారు. ఇదే తరహాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ రూ.1.55 కోట్లు పోగొట్టుకున్నారు. ఈవెంట్, సినీ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు పెట్టాలని, మంచి లాభాలు వస్తాయంటూ ఓ సినీ నిర్మాత, వివేక్ ఒబెరాయ్ ఇద్దరు వ్యాపార భాగస్వాములు నమ్మించారు. ఒబెరాయ్ రూ.1.55 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. కానీ, ఆ సొమ్మును ముగ్గురు వ్యక్తులు సొంతానికి వాడుకున్నారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. సదరు ఈవెంట్, సినీ నిర్మాణ సంస్థలో వివేక్ ఒబెరాయ్ భార్య కూడా భాగస్వామిగా ఉన్నారు. -
‘గైడ్’ సినిమాను తలపించే ప్రేమ కథ.. ఫ్రెంచ్ అమ్మాయి మనసు దోచిన బిహారీ
ఢిల్లీ చూడటానికి వచ్చింది పారిస్ నుంచి ఆమె. అతడు గైడ్. అతడు కబుర్లు చెప్పి తిప్పాడు. ఆమె పదే పదే నవ్వింది. ఇద్దరూ ఫోన్ నంబర్లు తీసుకున్నారు. మూడు నెలల తర్వాత ఐ లవ్ యూ చెప్పుకున్నారు. ఆమె అతణ్ణి గైడ్ నుంచి బిజినెస్‌మేన్‌గా మార్చడానికి పారిస్ పిలిపించింది. ఎదిగేలా చేసింది. ఆరేళ్ల తర్వాత ఇదిగో ఇలా బిహార్‌కు వచ్చి మరీ వివాహం చేసుకుంది. ఒక కుతూహలం రేపే రాకుమారి తోటరాముడు కథ. గైడ్ సినిమాలో దేవ్ఆనంద్ కథ. ఈ ప్రేమకథ వింటే పాత తరం వారికి ‘గైడ్’ సినిమా గుర్తుకు వస్తుంది. ఆర్.కె.నారాయణ్ రాసిన నవల ఆధారంగా దేవ్ ఆనంద్, వహీదా రహెమాన్ నటించిన ‘గైడ్’ సినిమాకు ఈ ప్రేమ కథ కొంతమేర పోలి ఉంది. ‘గైడ్’లో ఉదయ్‌పూర్ దగ్గర గైడ్‌గా పని చేస్తున్న దేవ్ ఆనంద్‌ను ఆ ప్రాంతాన్ని చూడటానికి వచ్చిన వహీదా ప్రేమిస్తుంది. ఈ ప్రేమ కథలో కూడా భారత్‌ను చూడటానికి ఫ్రాన్స్ నుంచి వచ్చిన యువతి ఢిల్లీలో గైడ్‌గా పని చేస్తున్న కుర్రాణ్ణి ప్రేమించింది. అయితే మనదేశంలో కొన్నిసార్లు కనిపించే కుల, మత, జాతి అడ్డంకులు ఈ ప్రేమకథలో రాలేదు. ప్రేమ ఫలించింది. మొన్నటి ఆదివారం వీరి పెళ్లి జరగగా నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆరేళ్ల క్రితం ఆరేళ్ల క్రితం పారిస్ నుంచి మేరీ లోరి హెరెల్ అనే యువతి ఇండియా చూడటానికి ఢిల్లీ వచ్చింది. అక్కడ బిహార్‌లోని బేగుసరాయి జిల్లాకు చెందిన రాకేష్ గైడ్‌గా పని చేస్తున్నాడు. మేరీకి ఢిల్లీ చూపించే బాధ్యత వృత్తిలో భాగంగా అతనిపై పడింది. చురుగ్గా ఉంటూ విసుగు చూపించకుండా నవ్విస్తూ ఢిల్లీలో రెండు మూడు రోజుల పాటు గైడ్‌గా వ్యవహరించిన రాకే మేరీకి నచ్చాడు. నిజానికి పారిస్‌లో మేరీ టెక్స్టైల్ రంగంలో ఉంది. వ్యాపారవేత్త. రాకుమారి కిందే లెక్క. రాకేష్ బేగుసరాయ్‌లో ఒక దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులకు పుట్టిన కుర్రవాడు. ఒక దేశం కాదు. ఒక భాష కాదు. ఒక సంస్కృతి కాదు. అయినా సరే ‘మనిషి మంచివాడు... ఈమె హృదయం మంచిది’ అని స్త్రీ, పురుషులకు అనిపించడానికి అవి అడ్డు నిలవలేకపోయాయి. వారు ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అసలైన ప్రేమ ఆ తర్వాత మొదలైంది. ఫోన్ ప్రేమ టూరిస్ట్‌లు టూర్ ముగిసిన వెంటనే గైడ్లను మర్చిపోతారు. వారికి చూసిన ప్రాంతాలు గుర్తుంటాయి కాని చూపించిన మనుషులు గుర్తుండరు. కాని భారత్ చూసి పారిస్ వెళ్లిపోయిన మేరీ రాకేష్‌కు తరచూ ఫోన్ చేసేది. రాకేష్ కూడా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడేవారు. సరిగ్గా మూడు నెలలు గడిచాక ఇద్దరికీ అర్థమైంది తాము ప్రేమలో ఉన్నామని. ఇద్దరూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు. కాని ప్రపంచాన్ని చూసిన మేరీకి రాకేష్ చేస్తున్న ఉద్యోగం, పని భవిష్యత్తులో ముందుకు పోవడానికి సహకరించవని మేరీకి అర్థమైంది. ‘నువు పారిస్ వచ్చి ఏదైనా మంచి పని చేయి’ అంది. ‘నాకు ఎవరు ఇస్తారు పని’ అన్నాడు రాకేష్. ‘నా వ్యాపారంలోనే పార్టనర్‌గా మారు’ అంది మేరీ. అంతే కాదు వీసా, టికెట్ రెండూ పంపింది. మూడేళ్ల క్రితం రాకేష్ పారిస్ వెళ్లాడు. అంతవరకూ మధ్యలో సంవత్సరానికి ఒకటి రెండుసార్లు మేరీ ఇండియా వచ్చి రాకేష్‌ను కలిసి వెళ్లేది. అప్పటికి వారిది ప్రేమే తప్ప పెళ్లి ఆలోచన లేదు. తండ్రి పాదాలకు నమస్కరిస్తున్న నూతన వధువు ప్రేమతో పని చేస్తుంటే పారిస్ వెళ్లిన రాకేష్ మేరీ వ్యాపారంలో పార్టనర్‌గా మారి పని చేయడం మొదలెట్టాడు. ఢిల్లీలో చూసిన రాకేష్‌లో ఏమాత్రం మార్పు లేదని అతను తన పనిని మనసు పెట్టి చేస్తాడని, జీవితం పట్ల, మనుషుల పట్ల అతనికి విశ్వాసం ఉందని మేరీ అర్థం చేసుకుంది. జీవితాంతం అతనితో కలిసి జీవించవచ్చని మరో మూడేళ్లకు ఆమె నిర్థారణ చేసుకుంది ‘మనం పెళ్లి చేసుకుందాం’ అంది. సరే చేసుకుందాం అని రాకేష్ అంటే ‘ఇక్కడ కాదు... ఇండియాలో. మీ పద్ధతిలో. మీ తల్లిదండ్రుల సమక్షంలో’ అని చెప్పింది. రాకేష్ పారిస్ నుంచి తల్లిదండ్రులతో బంధువులతో మాట్లాడారు. ‘నువ్వు చేసుకుంటే మేము అడ్డు చెప్పేదేముంది’ అన్నారు వారు. రాకేష్‌ను మూడేళ్లుగా చూస్తున్నారు కనుక మేరీ తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పలేదు. పెళ్లి ఖాయమైంది. నవంబర్ 19, ఆదివారం రాత్రి, బేగుసరాయ్‌లో పెళ్లి. వియ్యంకులయ్యారు రాకేష్ తండ్రి రామచంద్ర షా, మేరీ తండ్రి వేస్ హెరెల్ వియ్యంకులయ్యారు. పారిస్ నుంచి తల్లిదండ్రులతో బేగుసరాయ్ వచ్చిన మేరీ వధువుగా మారి రాకేష్‌ను పతిగా పొందింది. దానికి ముందు వియ్యంకులు ‘జప్మాలా’ అనే తంతులో పాల్గొన్నారు. బాలీవుడ్, భోజ్‌పురి పాటలకు నృత్యాలు చేశారు. విదేశీ అమ్మాయిని మన ఊరి కుర్రాడు పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్త విని ఊరి జనాలు విరగపడ్డారు. పెళ్లి బాగా జరిగింది. మరి కొన్ని రోజుల్లో ఆ జంట పారిస్‌కు వెళ్లనుంది. కొన్ని ప్రేమకథలు కలతను కలిగిస్తాయి. కొన్ని సంతోషాన్నిస్తాయి. ఈ పెళ్లి వార్త సోషల్ మీడియాలో అందరికీ నచ్చింది. మేరీ, రాకేష్‌లను అందరూ అభినందిస్తున్నారు. ప్రేమ పండించుకున్న అదృష్టవంతులు వీరు. త్వరలో ఇదంతా సినిమాగా వచ్చినా ఆశ్చర్యం లేదు. -
కొత్త బిజినెస్?
మల్టీప్లెక్స్ (ఏఏమ్బీ మల్టీప్లెక్స్), టైక్స్‌టైల్ (హంబుల్) రంగాల్లో నటుడు–నిర్మాత మహేశ్‌బాబు వ్యాపారవేత్తగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఒక ఓటీటీ (ఓవర్ ది టాప్) ప్లాట్ఫామ్లో వ్యాపార భాగస్వామి కాబోతున్నారట. ఇందుకోసం మహేశ్ ముంబైలోని ఓ పెద్ద నిర్మాణ సంస్థతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారని భోగట్టా. నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల ‘ఆహా’ పేరుతో డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహేశ్ కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. డిజిటల్ వైపు ఇంకెంతమంది స్టార్స్ మొగ్గుచూపుతారో చూడాలి. -
న్యూ ట్విస్ట్!
ఆయేషా షరాఫ్, ఆమె బిజినెస్ పార్ట్నర్ సాహిల్ ఖాన్ల వివాదం కొత్త మలుపు తిరిగింది. తమ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందన్న సాహిల్ వాదనలో వాస్తవం లేదని, కారణం అతడు గే అని ఆయేషా తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సాహిల్ కోర్టులో సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు. తాను ఆయేషాతో ‘బాగా క్లోజ్’గా ఉన్న కొన్ని ఫొటోలను కోర్టు ముందు ఉంచాడనేది మిడ్డే కథనం. గే అన్న కారణంతోనే సాహిల్ భార్య నిగార్ అతడికి విడాకులిచ్చిందని... ఇక తామిద్దరి మధ్య సంబంధాలకు అవకాశమెక్కడిదని గతంలో ఆమె ప్రశ్నించింది. తన దగ్గర వివిధ రూపాల్లో తీసుకున్న రూ.5 కోట్లు సాహిల్ తిరిగి ఇవ్వలేదంటూ ఆయేషా అతగాడికి ఇచ్చిన నోటీసుతో ఈ వివాదం వెలుగు చూసింది.