కొత్త బిజినెస్‌?

Mahesh Babu to launch his own digital streaming platform - Sakshi

మల్టీప్లెక్స్‌ (ఏఏమ్‌బీ మల్టీప్లెక్స్‌), టైక్స్‌టైల్‌ (హంబుల్‌) రంగాల్లో నటుడు–నిర్మాత మహేశ్‌బాబు వ్యాపారవేత్తగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఒక ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) ప్లాట్‌ఫామ్‌లో వ్యాపార భాగస్వామి కాబోతున్నారట. ఇందుకోసం మహేశ్‌ ముంబైలోని ఓ పెద్ద నిర్మాణ సంస్థతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారని భోగట్టా. నిర్మాత అల్లు అరవింద్‌ ఇటీవల ‘ఆహా’ పేరుతో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహేశ్‌ కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. డిజిటల్‌ వైపు ఇంకెంతమంది స్టార్స్‌ మొగ్గుచూపుతారో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top