
భారతి సిమెంట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటుపై 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గే వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ప్రయోజనాలను కస్టమర్లు, వ్యాపార భాగస్వాములకు పూర్తిగా బదలాయిస్తామని భారతి సిమెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్) రవీందర్ రెడ్డి తెలిపారు. సెపె్టంబర్ 22 నుంచి ఎంఆర్‌పీ తగ్గింపు ధరలు .. తమ ఇన్‌వాయిస్‌లలో, సిమెంటు బ్యాగ్‌లపై ప్రతిఫలిస్తాయని వివరించారు.
సిమెంటు ధరలను తగ్గించి, ప్రయోజనాలను బదిలీ చేయాలని ఇప్పటికే తమ డీలర్లకు సూచించినట్లు రవీందర్ రెడ్డి చెప్పారు. లక్షల కొద్దీ గృహ నిర్మాణదారులు, మౌలిక సదుపాయాల డెవలపర్లు, సామాన్యులకు నేరుగా లబ్ధి చేకూర్చేలా జీఎస్‌టీ సంస్కరణలు చేపట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. దీనితో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా భారత్ ఆవిర్భవించేందుకు తోడ్పడుతుందని రవీందర్ రెడ్డి చెప్పారు. వికాట్ ఫ్రాన్స్ అనుబంధ సంస్థగా భారతి సిమెంట్
కార్యకలాపాలు సాగిస్తోంది.