breaking news
rates down
-
కస్టమర్లకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు బదిలీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటుపై 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రయోజనాలను కస్టమర్లు, వ్యాపార భాగస్వాములకు పూర్తిగా బదలాయిస్తామని భారతి సిమెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్) రవీందర్ రెడ్డి తెలిపారు. సెపె్టంబర్ 22 నుంచి ఎంఆర్పీ తగ్గింపు ధరలు .. తమ ఇన్వాయిస్లలో, సిమెంటు బ్యాగ్‌లపై ప్రతిఫలిస్తాయని వివరించారు. సిమెంటు ధరలను తగ్గించి, ప్రయోజనాలను బదిలీ చేయాలని ఇప్పటికే తమ డీలర్లకు సూచించినట్లు రవీందర్ రెడ్డి చెప్పారు. లక్షల కొద్దీ గృహ నిర్మాణదారులు, మౌలిక సదుపాయాల డెవలపర్లు, సామాన్యులకు నేరుగా లబ్ధి చేకూర్చేలా జీఎస్టీ సంస్కరణలు చేపట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. దీనితో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా భారత్ ఆవిర్భవించేందుకు తోడ్పడుతుందని రవీందర్ రెడ్డి చెప్పారు. వికాట్ ఫ్రాన్స్ అనుబంధ సంస్థగా భారతి సిమెంట్ కార్యకలాపాలు సాగిస్తోంది. -
42 కీలక ఔషధాల ధరలకు కళ్లెం
సాక్షి, న్యూఢిల్లీ: ఔషధాల ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్రం ఊరట కల్పించింది. అవయవ మార్పిడి, తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో వాడే 42 కీలక ప్రాణాధార ఔషధాల రిటైల్ ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ ప్రాధికార సంస్థ (ఎన్పీపీఏ) ఖరారు చేసింది. దాంతో రోగులకు వైద్య ఖర్చుల భారం తగ్గడమే గాక ఫార్మా కంపెనీలు, మందుల దుకాణాల అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట పడనుంది. ధరలను నియంత్రించిన జాబితాలో బ్రాడ్–స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, అవయవ మార్పిడి తర్వాత వాడే ఇమ్యునోసప్రెసెంట్స్ వంటి అత్యంత కీలకమైన ఔషధాలున్నాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ల చికిత్సలో వాడే మెరోపెనమ్–సుల్బాక్టమ్ ఇంజెక్షన్ ధరను రూ.1,938.59, అవయవ మార్పిడిలో కీలకమైన మైకోఫెనోలేట్ మోఫెటిల్ టాబ్లెట్‌కు రూ.131.58, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారిణి టాబ్లెట్ క్లారిథ్రోమైసిన్ ఎక్స్టెండెడ్–రిలీజ్ టాబ్లెట్‌కు రూ.71.71గా నిర్ణయించారు. మందుల ధరలను నియంత్రిస్తూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ ప్రాధికార సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం.. ఔషధ తయారీదారులు తప్పనిసరిగా ధరల పట్టికను డీలర్లు, రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థలు, ప్రభుత్వానికి అందజేయాలి. అంతేకాకుండా, ప్రతి రిటైల్ మందుల దుకాణం, డీలర్ తమ ప్రాంగణంలో అందరికీ స్పష్టంగా, సులభంగా కనిపించేలా ధరల జాబితాను ప్రదర్శించాల్సి ఉంటుంది. సామాన్యుడికి ప్రయోజనం ఏమిటి? సామాన్య రోగులను ఆదుకోవడమే ప్రధాన ఉద్దేశం. మందుల దుకాణాల్లో ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలన్న నిబంధనతో వాటికి ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎంత ఉందో వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల మందుల దుకాణదారులు మోసాలకు పాల్పడకుండా నిరోధించవచ్చు. ఈ చర్యతో ఖరీదైన మందుల భారం తగ్గడమే కాకుండా, ఫార్మా రంగంలో పారదర్శకత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య రంగ సంస్కరణల్లో ఇదొక కీలక మలుపు అని అభిప్రాయపడుతున్నారు. -
కోఆపరేటివ్ రంగం పటిష్టం..
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ రేట్ల తగ్గింపుతో దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా డెయిరీ రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, కోఆపరేటివ్ రంగం బలోపేతం అవుతుందని కేంద్ర సహకార శాఖ వెల్లడించింది. పాల ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్ ఉత్పత్తులు, వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, బయో–పెస్టిసైడ్లు, రవాణా వాహనాలపై పన్ను తగ్గింపుల వల్ల రైతులు, కోఆపరేటివ్ సంస్థలు, గ్రామీణ వ్యాపారాలు నేరుగా లాభపడనున్నాయి. ఈ నిర్ణయాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని నిపుణులు విశ్లేíÙ స్తున్నారు. సంస్కరణల్లో భాగంగా పాలు, పనీర్‌పై జీఎస్టీని పూర్తిగా మినహాయించగా, వెన్న, నెయ్యిలపై పన్ను 12% నుంచి 5%కి తగ్గుతుంది. పాల డబ్బాల (ఇనుము, స్టీల్, అల్యూమినియం) పైన కూడా పన్ను తగ్గింపుతో పాల ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. దీని వలన డెయిరీ రైతులకు ఆదాయం పెరుగుతుందని, గ్రామీణ మహిళా స్వయంసహాయక సంఘాలకు ఇది పెద్ద ఊరట అవుతుందని నిపుణులు తెలిపారు. మొత్తం మీద, ఈ పన్ను తగ్గింపులు కోట్లాది గృహాలకు చౌకైన ఆహార ఉత్పత్తులు అందించడంతోపాటు, రైతుల ఆదాయాన్ని పెంచి, గ్రామీణ వ్యాపారాలు మరింత బలోపేతం కావడానికి దోహదం చేయగలవని పేర్కొన్నారు. ‘నెక్ట్స్‌జెన్ జీఎస్టీ సంస్కరణల’ను డెయిరీ కోఆపరేటివ్ రంగం స్వాగతించింది. అమూల్ వంటి ప్రముఖ కోఆపరేటివ్ బ్రాండ్లు దీనిని రైతు–గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా అభివరి్ణంచాయి. ఆహార ప్రాసెసింగ్‌కి ఊతం: చీజ్, నమ్కీన్లు, పాస్తా, జామ్, జెల్లీ, ఫ్రూట్ జ్యూస్ డ్రింక్స్, భుజియా వంటి ఉత్పత్తులపై జీఎస్టీ 5 శాతానికి పరిమితం కానుంది. చాక్లెట్స్, కార్న్‌ఫ్లేక్స్, ఐస్‌క్రీమ్, బిస్కెట్లు, కాఫీ వంటి ఉత్పత్తులపై పన్ను 18% నుంచి 5%కు తగ్గించడం వల్ల ప్రజలపై భారం తగ్గనుంది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగి, ఆహార ప్రాసెసింగ్ రంగం పుంజుకునే అవకాశం ఉంది. రైతులకు ఉపశమనం: 1800 సీసీ లోపు ట్రాక్టర్లు, వాటి విడి భాగాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించడం, అలాగే ఎరువుల తయారీలో వాడే అమోనియా, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్‌పై పన్ను 18% నుంచి 5 శాతానికి తగ్గించడం వంటి అంశాలు రైతులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. 12 రకాల బయో–పెస్టిసైడ్లు, మైక్రోన్యూట్రియెంట్లపై పన్ను తగ్గింపుతో సేంద్రియ వ్యవసాయానికి ఊతం లభిస్తుంది. ట్రక్కులు, డెలివరీ వ్యాన్లపై పన్ను 28% నుంచి 18%కి తగ్గించడంతో రవాణాకు సంబంధించి వాహనాలపరమైన భారం గణనీయంగా తగ్గనుంది. రైతుల ఉత్పత్తులు మార్కెట్లకు తక్కువ ఖర్చుతో చేరి, ఎగుమతుల పోటీ సామర్థ్యం పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. గూడ్స్ క్యారేజ్ వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌పై పన్ను తగ్గించడం మరో ముఖ్యమైన నిర్ణయమని విశ్లేషకులు తెలిపారు. -
కొంచెం ఆగి చూద్దాం!
న్యూఢిల్లీ: కీలకమైన పండుగల సమయంలో వినియోగదారులు (ఆన్లైన్ షాపర్లు) ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్ గూడ్స్ తదితర ఉత్పత్తుల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) క్రమబద్దీకరణతో రేట్లు తగ్గుతాయన్న అంచనాలే ఇందుకు కారణం. అయితే ఈ పరిస్థితి తాత్కాలికమేనని, ఒక్కసారి పన్ను రేట్లపై స్పష్టత వస్తే కొనుగోళ్లు తిరిగి ఊపందుకుంటాయన్నది నిపుణుల అంచనా. కేంద్ర ప్రభుత్వం సైతం జీఎస్టీలో శ్లాబుల తగ్గింపును వేగంగా అమల్లోకి తీసుకురావాలనుకుంటోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 3, 4 తేదీల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానుంది. ప్రస్తుతం వివిధ రకాల వస్తు సేవలపై 5, 12, 18, 28 శాతం జీఎస్టీ రేట్లు అమల్లో ఉండడం తెలిసిందే. 12, 28 శాతం శ్లాబులను ఎత్తివేయాలన్నది ప్రతిపాదన. అప్పుడు అధిక శాతం వస్తు సేవలు 5 లేదా 18 శాతం రేట్ల పరిధిలోకి వస్తాయి. వాషింగ్ మెషిన్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు తదితర ఎన్నో ఉత్పత్తులపై పన్ను భారం తగ్గనుంది. ఈ–కామర్స్‌పై కనిపిస్తున్న మార్పు.. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై వినియోగదారుల కొనుగోళ్ల పరంగా స్పష్టమైన మార్పు కనిపిస్తున్నట్టు గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ నవీన్ మల్పానీ తెలిపారు. ముఖ్యంగా అధిక విలువ కలిగిన ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విషయంలో ఈ ధోరణి నెలకొన్నట్టు చెప్పారు. ‘‘జీఎస్టీ రేట్లపై స్పష్టత ఆలస్యమయితే అప్పుడు ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు తదితర విభాగాలపై 25–30 శాతం మేర ప్రభావం పడొచ్చు. కొత్త శ్లాబులు అమల్లోకి వస్తే రేట్లు తగ్గుతాయన్న అంచనాలు ప్రస్తుత వేచి చూసే ధోరణికి కారణమవుతున్నాయి. ఉదాహరణకు రూ.1.2 లక్షల ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ధర జీఎస్టీలో సంస్కరణల అనంతరం 10 శాతం మేర తగ్గనుంది. ఈ అంచనాలు కొనుగోళ్ల నిర్ణయాలను వాయిదా వేసుకునేందుకు దారితీస్తున్నాయి’’అని మల్పానీ వివరించారు. అమ్మకాలు వేగంగా పెరుగుతాయ్.. ‘‘రిటైలర్ల వద్ద ఉత్పత్తుల నిల్వలు అధికంగానే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విభాగంలో కొనుగోళ్లు వాయిదా పడుతున్నాయి. పండుగల సీజన్ చివర్లో (అక్టోబర్) పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా సన్నద్ధం అయ్యేందుకు ఈ–కామర్స్ సంస్థలు బ్రాండ్లతో సంప్రదింపులు చేస్తున్నాయి. జీఎస్టీలో పన్ను రేట్ల సవరణ ధరల వ్యూహాల్లోనూ మార్పులకు దారితీయనుంది. మొత్తం మీద సమీప కాలంలో కనిపించే ప్రభావం తాత్కాలికమే. కొత్త పన్నులపై ఒక్కసారి స్పష్టత వస్తే అమ్మకాలు వేగంగా పుంజుకుంటాయి’’ అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సీనియర్ అనలిస్ట్ శుభమ్ నింకార్ తెలిపారు. ఈ–కామర్స్ సంస్థలకు పండుగల సీజన్ ఎంతో కీలకం. వార్షిక అమ్మకాల్లో పావు శాతం ఈ సమయంలోనే నమోదవుతుంటాయి.పండుగ షాపింగ్ ప్రత్యేకం..పండుగల సమయంలో కొనుగోళ్లు కేవలం సంస్కృతిలో భాగమే కాకుండా, భావోద్వేగపరమైనవి అని షిప్‌రాకెట్ ఎండీ, సీఈవో సాహిల్ గోయల్ పేర్కొన్నారు. ‘‘కొత్త గృహోపకరణం అయినా, గ్యాడ్జెట్ అయినా లేక గృహ నవీకరణ అయినా పండుగల సమయంలో కొనుగోలు చేసేందుకు కుటుంబాలు ప్రణాళికలతో ఉంటాయి. ఈ అంతర్గత డిమాండ్ కచ్చితంగా కొనసాగుతుంది. జీఎస్టీ క్రమబదీ్ధకరణ అన్నది కొనుగోళ్ల దిశగా వినియోగదారులకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. రేట్ల సవరణతో ధరలు అందుబాటులోకి వస్తాయి. వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుంది’’అని వివరించారు. జీఎస్టీ రేట్ల క్రమబద్దీకరణ అన్నది నిర్మాణాత్మక సంస్కరణ అని, వినియోగానికి బలమైన ఊతం ఇస్తుందని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజనీష్ కుమార్ సైతం అభిప్రాయపడ్డారు. జీఎస్టీలో మార్పులు అమల్లోకి వచ్చినట్టయితే పండుగల సీజన్లో ఈ–కామర్స్ అమ్మకాలు మొత్తం మీద 15–20 శాతం పెరగొచ్చని (గతేడాదితో పోల్చితే) మల్పానీ అంచనా వేశారు. -
ఇక ఏసీలు, టీవీలు చౌక!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్నులో శ్లాబుల తగ్గింపుతో ఏసీలు, టీవీల ధరలు చెప్పుకోతగ్గ స్థాయిలో దిగిరానున్నాయి. ముఖ్యంగా ఎయిర్ కండీషనర్లపై (ఏసీలు) 28 శాతంగా ఉన్న జీఎస్టీ 18 శాతానికి తగ్గనుంది. దీంతో మోడల్‌ను బట్టి ఒక్కో ఏసీ యూనిట్ ధర రూ.1,500–2,500 మేర చౌకగా మారనుంది. 32 అంగుళాలకు మించిన టీవీలపైనా జీఎస్టీ 28% నుంచి 18 శాతానికి తగ్గనున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీనికితోడు బడ్జెట్లో పెద్ద మొత్తంలో ఆదాయపన్ను మినహాయింపులు కలి్పంచడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు ఏసీల కొనుగోళ్లను పెంచుతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. పెద్ద ముందడుగు రూమ్ ఏసీల కొనుగోళ్లు నిలిచిపోయినందున జీఎస్టీలో ప్రతిపాదిత సంస్కరణలను వేగంగా అమల్లోకి తీసుకురావాలని బ్లూస్టార్ ఎండీ బి. త్యాగరాజన్ కోరారు. ‘‘ఆగస్ట్ నెలలో రూమ్ ఏసీలను ఎవరూ కొనరు. సెపె్టంబర్ లేదా అక్టోబర్ 1 వరకు వేచి చూడొచ్చు. ఈ కాలంలో డీలర్లే కాదు, కస్టమర్లు కూడా కొనుగోళ్లు చేయరు’’అంటూ అన్‌సీజన్‌ను ఆయన గుర్తు చేశారు. 10 శాతం వరకు ఏసీల ధరలు తగ్గొచ్చొని చెప్పారు. ఇంధన ఆదా చేసే ఏసీలపై తక్కువ జీఎస్టీని అంచనా వేస్తున్నామని.. ఇతర ఏసీల ధరలు 18% రేటు పరిధిలో ఉండొచ్చని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా చైర్మన్ మనీష్ శర్మ అభిప్రాయపడ్డారు. 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినా కానీ ఉత్పత్తుల ధరలు 6–7 శాతం మేర (రూ.1,500–2,500) దిగిరావొచ్చని చెప్పారు. ప్రతిపాదిత జీఎస్టీ రేట్ల తగ్గింపు వినియోగాన్ని పెంచుతుందని గోద్రేజ్ అప్లయెన్సెస్ సైతం అంచనా వేసింది.‘‘దేశంలో ఏసీల వినియోగం ఇప్పటికీ 9–10 శాతంగానే ఉంది. జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తే మరింత మంది ప్రజలకు ఏసీల ధరలు అందుబాటులోకి వస్తాయి. దీంతో చాలా మంది భారతీయుల జీవన నాణ్యత మెరుగుపడుతుంది’’అని గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ అప్లయెన్సెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ప్రస్తుతం రూమ్ ఏసీలపై 28% జీఎస్టీ అమల్లో ఉండగా, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లపై 18 శాతం రేటు అమలు అవుతున్నట్టు తెలిపారు. ఏసీ, టీవీలకు అనుకూలం.. థామ్సన్, బ్లోపంక్త్ తదితర బ్రాండ్లపై టీవీలను తయారు చేసి విక్రయించే సూపర్ ప్లా్రస్టానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా సైతం ప్రభుత్వ చర్యతో పండుగల సీజన్లో వినియోగం పెరుగుతుంని అంచనా వేశారు. ఏసీ, స్మార్ట్ టీవీలు (32 అంగుళాల పైన) 28% జీఎస్టీ పరిధిలో ఉన్నాయంటూ.. రేట్లను తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని తెలిపారు. తాము 20% వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇక 32 అంగుళాల టీవీలను 5% జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఈ సెగ్మెంట్లో 38 శాతం అసంఘటిత రంగం నుంచే వస్తున్నట్టు చెప్పారు. వేసవిలో ముందస్తు వర్షాలతో ఈ ఏడాది ఏసీ అమ్మకాలు తగ్గాయి.గొప్ప సంస్కరణ జీఎస్టీ పునర్నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న చర్య ఎంతో ముఖ్యమైన సంస్కరణ. దీని ద్వారా ప్రభుత్వం అద్భుతమైన పని చేస్తోంది. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఆటో పరిశ్రమపై పడే ప్రభావంపై వ్యాఖ్యానించేందుకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకునే వరకు వేచి చూడడం మంచిది.– ఆర్సీ భార్గవ, మారుతి సుజుకీ ఇండియా చైర్మన్ -
గరిష్ట ధర వద్ద లాభాల స్వీకరణ
న్యూఢిల్లీ: అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా గరిష్ట ధరల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో బంగారం పరుగు కొంత తగ్గింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర సోమవారం రూ.1,300 తగ్గి రికార్డు స్థాయిల నుంచి రూ.81,100కు దిగివచ్చింది. గత ట్రేడింగ్‌లో రూ.82,400 ఆల్‌టైమ్ రికార్డుకు పసిడి దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఇక వెండి కేజీ ధర ఏకంగా రూ.4,600 తగ్గి రూ.94,900కి చేరింది.ఆభరణ వర్తకులు, రిటైలర్ల నుంచి కూడా డిమాండ్ కొంత మందగించినట్లు ట్రేడర్లు పేర్కొన్నారు. కాగా, 99.5 స్వచ్ఛత పసిడి ధర న్యూఢిల్లీలో రూ.1,300 దిగివచి్చన రూ.80,700కు చేరింది. ఇదిలావుండగా అంతర్జాతీయ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ ఫ్యూచర్స్ ఔన్స్ (31.1గ్రా ములు) ధర 2,747 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ పసిడి ధర వారంరోజుల క్రితం 2,802 డాల ర్ల ఆల్‌టైమ్ రికార్డును తాకిన సంగతి తెలిసిందే. -
లక్షద్వీప్‌లో రూ.15 మేర తగ్గిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: లక్ష ద్వీప్‌లో శనివారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.15 మేర తగ్గాయి. దూరంగా ఉన్న దీవులకు ఇంధనం రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు గాను వసూలు చేస్తున్న ప్రత్యేక సెస్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తొలగించడంతో ఈ మేరకు ద్వీప వాసులకు ఊరట లభించింది. లక్షద్వీప్ సముదాయంలోని అండ్రోట్, కల్పెనీ దీవుల్లో పెట్రోల్, డీజిల్ లీటరుపై రూ.15.3 మేర తగ్గాయి. కవరట్టి, మినికాయ్ దీవుల్లో రూ.5.2 మేర తగ్గాయి. కవరట్టి, మినికాయ్ దీవుల్లో గతంలో లీటరు పెట్రోల్ ధర రూ.105.94 కాగా రూ.100.75కి తగ్గింది. అండ్రోట్, కల్పెనీ దీవుల్లో రూ.116.13గా ఉన్న పెట్రోల్ ధర రూ.100.75కి చేరింది. కవరట్టి, మినికాయ్ దీవుల్లో డీజిల్ ధర 110.91 నుంచి రూ.95.71కి, అండ్రోట్, కల్పెనీల్లో రూ.111.04 నుంచి రూ.95.71కి తగ్గింది. -
వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!
గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2023-2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజునే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించింది. ఏప్రిల్ 1న వంట గ్యాస్ ధరలు దాదాపు రూ.92 తగ్గించింది. అయితే రేట్ల తగ్గింపు కేవలం వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే. గృహోపయోగానికి వినియోగించే డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి తగ్గింపు లేదు. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం గత నెలలోనే రూ.50 పెంచిన విషయం తెలిసిందే. అలాగే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను రూ.350 పెంచింది. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తుంటాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ రేటు భారతదేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలను ప్రభావితం చేసే రెండు కీలక అంశాలు. సవరించిన తర్వాత 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2,028, కోల్‌కతాలో రూ.2,132, ముంబైలో రూ.1,980, చెన్నైలో రూ.2192.50 చొప్పున ఉంది. కాగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం గృహ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని ప్రకటించింది. ఈ పథకం కింద 9.59 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రతి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పైనా రూ.200 సబ్సిడీ అందిస్తున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గత నెలలో ప్రకటించారు. డొమెస్టిక్ సిలిండర్లు ఏడాదికి 12 మాత్రమే వినియోగించకునేలా కేంద్ర ప్రభుత్వం పరిమితిని విధించింది. -
దశాబ్ద కనిష్టానికి గ్యాస్ రేటు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా సహజ వాయువు (నేచురల్ గ్యాస్) ధర దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉన్నట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. గ్యాస్ ఎగుమతి దేశాల ప్రామాణిక రేట్లను బట్టి చూస్తే మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ) ధర 1.9–1.94 డాలర్ల స్థాయికి తగ్గొచ్చని, ఇది దశాబ్దంపైగా కనిష్ట స్థాయి. అక్టోబర్1న జరిగే గ్యాస్ ధర సమీక్షలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వివరించాయి. ఎరువులు, విద్యుదుత్పత్తితో పాటు వాహనాల్లో సీఎన్జీగా, వంట గ్యాస్ అవసరాల కోసం ఉపయోగపడే గ్యాస్ రేటును ప్రతి ఆరు నెలలకోసారి (ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న) ప్రభుత్వం సమీక్షిస్తుంది. ఓఎన్జీసీకి కష్టకాలం.. అమెరికా, కెనడా, రష్యా వంటి గ్యాస్ మిగులు దేశాల రేట్లను ప్రామాణికంగా తీసుకుని 2014 నవంబర్‌లో ప్రభుత్వం కొత్తగా గ్యాస్ ఫార్ములాను ప్రవేశపెట్టినప్పట్నుంచీ దేశీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌పై ఓఎన్జీసీ నష్టాలు చవిచూస్తోంది. బ్రేక్ ఈవెన్ రేటు (లాభ నష్టాలు లేని ధర) 5–9 డాలర్లుగా ఉంటోందని, ప్రస్తుతం నిర్ణయించిన 2.39 డాలర్ల ధర గిట్టుబాటు కాదంటూ కేంద్రానికి ఓఎన్జీసీ ఇటీవలే తెలిపినట్లు సమాచారం. గతంలో గ్యాస్ విభాగంలో నష్టాలను చమురు విభాగం ద్వారా ఓఎన్జీసీ కాస్త భర్తీ చేసుకోగలిగేది. కానీ ప్రస్తుతం చమురు వ్యాపారం కూడా తీవ్ర ఒత్తిడిలో ఉండడం కంపెనీకి ప్రతికూలాంశం. -
భారీగా తగ్గిన విమాన ఇంధన ధరలు
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్/ఏటీఎఫ్) ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గుముఖం పట్టడంతో చమురు మార్కెటింగ్ సంస్థలు ఏటీఎఫ్ ధరలను 23 శాతం తగ్గించాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలకన్నా చౌక ధరకు ఏటీఎఫ్ అందుబాటులోకి రావడం ఆసక్తికరం. ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్ (వెయ్యి లీటర్లు)కు రూ.6,813 తగ్గడంతో రూ.22,545కు దిగొచ్చింది. అంటే లీటర్ ధర రూ.22.54గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.69.59గా ఉండడంతో ఏటీఎఫ్ ధర మూడో వంతుకే అందుబాటులోకి వచ్చినట్టయింది. ఢిల్లీలో డీజిల్ ధర రూ.62.29గా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏటీఎఫ్ ధరలు రెండు వంతుల మేర తగ్గడం గమనార్హం. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు చారిత్రక కనిష్టాలకు పడిపోవడం కలిసొచ్చింది. -
సబ్సిడీయేతర ఎల్పీజీ ధర భారీ తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ముడిచమురు ధరలు పడిపోయిన నేపథ్యంలో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సబ్సిడీయేతర వంట గ్యాస్ ధరను రికార్డు స్థాయిలో రూ.162.50 తగ్గింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,285 నుంచి రూ.1029.50కు తగ్గిపోయింది. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ చమురు ధర, విదేశీ మారకపు ధరల ఆధారంగా ప్రతినెలా ఒకటో తారీఖున వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. సబ్సిడీని వదులుకున్న గ్యాస్ వినియోగదారుల గ్యాస్ ధర గత మూడు నెలలుగా తగ్గుతూ వస్తోంది. అలాగే గృహ వినియోగదారుల 12 కోటా పరిధి దాటిన వారు సైతం సబ్సిడీయేతర గ్యాస్ ధరల్లోనే గ్యాస్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
చమురు ఉత్పత్తి కోతకు డీల్...
లండన్: డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు మరింత పతనమై, తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా ముడిచమురు ఉత్పత్తి దేశాలు అసాధారణ చర్యలు తీసుకుంటున్నాయి. రేట్ల పతనానికి అడ్డు కట్ట వేసే దిశగా ఉత్పత్తిని భారీగా తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఉత్పత్తి దేశాలన్నీ దీనిపై ఒక అంగీకారానికి వచ్చినట్లు సుదీర్ఘంగా సాగిన వర్చువల్ సమావేశం అనంతరం పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ వెల్లడించింది. ఈ డీల్ ప్రకారం జూలై దాకా ఒపెక్, దాని భాగస్వామ్య దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల మేర (బీపీడీ) తగ్గించుకోనున్నాయి. ఆ తర్వాత నుంచి డిసెంబర్ దాకా 8 మిలియన్ బీపీడీకి, 2021 నుంచి 16 నెలల పాటు 6 మిలియన్ బీపీడీకి పరిమితం చేయనున్నాయి. తొలుత ఈ డీల్‌కు ఒప్పుకోకపోయినప్పటికీ ఉత్పత్తి కోతతో తమకు వాటిల్లే నష్టాలను భర్తీ చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇవ్వడంతో మెక్సికో కూడా అంగీకారం తెలిపింది. అమెరికాతో పాటు మరిన్ని దేశాలు కూడా తమవంతుగా ఉత్పత్తి కోతలను పరిశీలిస్తున్నాయి. తాజా డీల్‌తో ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తిలో 15 శాతానికి కోతపడవచ్చని విశ్లేషకుల అంచనా. ఇటు పరిమాణంపరంగాను, అటు ఉత్పత్తి కోతలో భాగమవుతున్న దేశాల సంఖ్యాపరంగాను ఇది అసాధారణమని తెలిపారు. ఇంధన రంగంలో బద్ధవిరోధులైన దేశాలు కూడా ఇందులో పాలు పంచుకోవడం విశేషమని పేర్కొన్నారు. ఇది సరిపోదు.. అయితే, భారీగా పడిపోయిన క్రూడాయిల్ డిమాండ్‌పరమైన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రతిపాదిత కోతలేమీ సరిపోయే అవకాశాలు లేవని విశ్లేషకులు చెప్పారు. ఇప్పటికే నిల్వలు భారీగా పేరుకుపోయాయని, ఉత్పత్తి కోతలపై ఆయా దేశాలు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ ఉత్తర అమెరికన్ సంస్థలు 5 మిలియన్ బ్యారెళ్ల మేర ఉత్పత్తిని తగ్గించుకున్నా.. ఇంకా 5–10 మిలియన్ బీపీడీ మేర సరఫరా అధికంగానే ఉంటుందని అంచనా. ఏప్రిల్‌లో సరఫరా, డిమాండ్ మధ్య 27.4 మిలియన్ బీపీడీ స్థాయిలో అసమతౌల్యత ఉంటుందని రీసెర్చ్ సంస్థ రైస్టాడ్ ఎనర్జీ అంచనా. డిమాండ్‌కి మించి సరఫరా! కరోనా వైరస్ వ్యాప్తితో చమురు డిమాండ్, ధరలపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో ఉత్పత్తి తగ్గించుకోవాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే, దీని వల్ల అమెరికన్ సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో, తన మార్కెట్ వాటాను కాపాడుకునేందుకు రష్యా అంగీకరించలేదు. ఇది సౌదీ అరేబియాకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఉత్పత్తిని భారీగా పెంచేసి రేట్లను తగ్గించేయడం ద్వారా ధరలపరమైన పోరుకు తెరతీసింది. అప్పట్నుంచి రేట్ల పతనం మొదలైంది. రేట్లు పడిపోవడంతో చాలా దేశాలు చౌకగా చమురు కొనుగోళ్లకు ఎగబడి నిల్వ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు స్టోరేజీలో సగటున 79 శాతం దాకా నిండుగా ఉందని అంచనా. 7.4 బిలియన్ బ్యారెళ్ల చమురు, తత్సంబంధ ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని.. ఇవి కాకుండా 1.3 బిలియన్ బ్యారెళ్లు రవాణాలో ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. 2020లో గరిష్ట.. కనిష్టాలు... నిజానికి 2020 తొలి మూడు నెలల్లోనే అంతర్జాతీయంగా క్రూడ్ ధర భారీ ఎగువ, దిగువ స్థితులను చూడ్డం గమనార్హం. అంతక్రితం మూడు నెలల నుంచీ క్రూడ్ ధర అప్‌ట్రెండ్‌లోనే ఉంది. జనవరిలో అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించడం, ఆ తర్వాత భౌగోళిక ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకోవడంతో ముడిచమురు రేటు ఒక్కసారిగా ఎగిసింది. అప్పటికి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఆ వెంటనే.. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, క్రూడ్ ఉత్పత్తికి భయంలేదన్న సంకేతాలు.. తత్సబంధ పరిణామా లతో క్రమంగా చల్లారింది. అటు తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంతో క్రూడ్ ధర మరికొంత చల్లారగా, రష్యా–సౌదీ అరేబియాల మధ్య మార్చి మొదటి వారంలో చోటుచేసుకున్న ‘ధరల యుద్ధం’తో 19 సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. ఈ మూడు నెలల కాలంలో ధరల పరిస్థితిని చూస్తే, అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 66.6–19.27 డాలర్ల గరిష్ట, కనిష్ట స్థాయిలను చూడగా, బ్రెంట్ క్రూడ్ ధర 75.6–21.65 డాలర్ల గరిష్ట, కనిష్ట స్థాయిల్లో తిరుగాడాయి. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సెలవు రోజు కాగా, గురువారం ట్రేడింగ్‌లో నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ ధర 23.21 డాలర్ల వద్ద ముగియగా, బ్రెంట్ 31.82 డాలర్ల వద్ద ఉంది. తాజా డీల్ నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ సందర్భంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నేరాల రేటు ‘డౌన్’
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా రా ష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. సాధారణ రోజుల కంటే కాస్త అటూ ఇటుగా 33 నుంచి 55 శాతం తగ్గుద ల నమోదైంది. రోడ్లపై, వీధుల్లో జ నసంచారం లేకపోవడం నేరాలు త గ్గడానికి ప్రాథమిక కారణమైతే.. ప్ర తీ వీధిలోనూ పోలీసు గస్తీ, ని ఘా పెరగడం రెండో కారణం. అదే సమయంలో లాక్‌డౌన్‌కు సంబంధించిన కేసులు మాత్రం పెరుగుతున్నాయి. నగరాలు, ప ట్టణాల్లో ప్రజలు ముఖ్యంగా యువత లాక్డౌన్ నిబంధనల ను ఇష్టానుసారంగా ఉల్లంఘిస్తున్నారు. మార్చి 22 నుంచి 31 వ రకు 10 రోజుల పాటు రాష్ట్రం లోని వివిధ జిల్లాలు, కమిషనరేట్లలో 4 వేలకు పైగా నేరాలు నమోదయ్యాయి. 2018 నేషనల్ క్రైం బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం.. ఈ నేరా లను పోల్చి చూసినపుడు ఐపీసీ సెక్షన్ల కింద రోజూ 383 నేరాలు నమోదు కాగా, 33 శాతం (254 నేరాలు మాత్రమే) తగ్గుదల నమోదైంది. ఇందులో సాధారణంగా పెట్టీ కేసులు ఎక్కు వగా ఉంటాయి. ప్రస్తుతం నమోదైన ఐపీసీ కే సుల్లో అధికశాతం లాక్‌డౌన్‌కు సంబంధించిన వే కావడం గమనార్హం. ఇక కిడ్నాపుల పరంగా చూస్తే.. రోజుకు సగటున దాదాపు 5 కిడ్నాపు కేసులు నమోదు కాగా.. ఈ పదిరోజుల్లో రోజు కు 2.5 కేసులే నమోదయ్యాయి. 2018 ఎన్సీఆ ర్బీ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో రోజుకు 2.5 హత్యల చొప్పున నమోదవగా.. ఈ పదిరోజుల్లో రోజుకు 1.4 హత్యల చొప్పున రికార్డయింది. పదిరోజుల్లో 4,369 కేసులు.. డెకాయిటీ (1), రాబరీ (2), పగ టి చోరీలు(2), రాత్రిచోరీలు (17), దొంగతనాలు (153), హత్య లు (14), అల్లర్లు (14), కి డ్నాప్‌లు (24), లైంగిక దాడులు (8), తీవ్రంగా గాయపర్చడం (4), స్వల్పదాడులు (260), మోసాలు (101), నమ్మకద్రోహం (12), మాద కద్రవ్యాల సరఫరా (0), హ త్యాయత్నాలు (18), తీవ్ర రోడ్డు ప్రమాదాలు (48), సా ధారణ రోడ్డు ప్రమాదాలు (92), ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసులు (2,546), ఇతర సెక్షన్ల కింద 1,053 కేసులు కలిపి మొత్తంగా పదిరోజుల్లో 4,369 కేసులు నమోదయ్యాయి. అధిక రోడ్డు ప్రమాదాలు అందువల్లే.. రోడ్ సేఫ్టీ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో రో జుకు సగటున 63 రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అందులో 60మంది గాయపడగా, 18 మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ పది రోజు ల్లో చిన్నాపెద్దా అన్నీ కలిపి 140 రోడ్డు ప్రమా దాలు జరిగాయి. వీటిలో 90 శాతం ప్రమాదా లు వాహనదారుల స్వయంకృతాపరా ధం వల్లే జరిగాయని పోలీసులు చెబుతున్నారు. -
రూ. 22కే కిలో విదేశీ ఉల్లి
న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని కిలో రూ. 22 నుంచి రూ. 23కే రాష్ట్రాలకు విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. ప్రస్తుతం ఇలా దిగుమతి చేసుకున్న ఉల్లిని కేంద్రం రూ. 58కి అమ్ముతోంది. అయితే తాజాగా ఉల్లి పంట చేతికి రావడం, రుచిలో దేశీ ఉల్లి బాగుండటంతో విదేశీ ఉల్లిని కొనుగోలు చేయడానికి రాష్ట్రాలు ముందుకు రాకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత నవంబర్‌లో కేంద్రం విదేశాల నుంచి 14 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. అందులో నుంచి భారీస్థాయిలో ఉల్లి అమ్ముడుకుండా పోర్టుల వద్దే మిగిలిపోయింది. ఇలా మిగిలిప ఉల్లి కుళ్లిపోతుండటం, మార్కెట్లో దేశీ ఉల్లి అందుబాటులోకి రావడంతో కేంద్రం ఉల్లి ధరలు తగ్గించాలని నిర్ణయించింది. -
ఉచిత చానళ్ల సంఖ్య పెంపు
న్యూఢిల్లీ: కేబుల్ టీవీ చార్జీల భారాన్ని కాస్త తగ్గించేలా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా కొత్త టారిఫ్ ఆర్డరు ప్రకటించింది. దీంతో మరిన్ని చానళ్లు.. ఇంకాస్త చౌక రేటుకు అందుబాటులోకి రానున్నాయి. ట్రాయ్ తన వెబ్సైట్లో ఉంచిన ఆర్డరు ప్రకారం.. ఉచిత చానళ్ల సంఖ్య పెరగనుండగా, పే చానళ్ల చార్జీలు తగ్గనున్నాయి. అలాగే, వివిధ చానళ్లను కలిపి బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు అందించే బొకే ఆఫర్లపైనా ట్రాయ్ పరిమితులు విధించింది. వీటికి సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన చర్చాపత్రాలపై పరిశ్రమవర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ మార్గదర్శకాలు రూపొందించింది. సవరించిన టారిఫ్‌లను బ్రాడ్కాస్టర్లు జనవరి 15లోగా, మల్టీ సిస్టం ఆపరేటర్లు 20లోగా ప్రచురించాల్సి ఉంటుంది. వినియోగదారులకు.. కొత్త నిబంధనల ప్రయోజనాలు మార్చి 1 నుంచి లభించనున్నాయి. ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డరు ప్రకారం.. ► బొకే కింద అందించే పే చానళ్ల గరిష్ట ధర రూ. 19 నుంచి రూ. 12కి తగ్గుతుంది. ప్రతి చానల్‌కు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ తమకు అనువైన రేటును వసూలు చేసినా, సదరు చానల్‌ను ఇతర చానళ్లతో కలిపి గంపగుత్తగా (బొకే) ఆఫర్ చేసేటప్పుడు గరిష్ట ధర రూ. 12కి (పన్నులు అదనం) మించరాదు. ► రూ. 130 నెట్వర్క్ కెపాసిటీ ఫీజు (ఎన్సీఎఫ్)తో ప్రస్తుతం 100 ఉచిత చానళ్లు లభిస్తుండగా.. ట్రాయ్ ఆదేశాల ప్రకారం ఈ సంఖ్య 200కు పెరగనుంది. కేబుల్ టీవీ ఆపరేటర్లు, డీటీహెచ్ ప్రొవైడర్లు తమ దగ్గరున్న ఉచిత చానళ్లన్నింటినీ అందించేందుకు.. గరిష్టంగా రూ. 160 మించి ఎన్సీఎఫ్ వసూలు చేయరాదు. ► బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలకు దీటుగా డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాం ఆపరేటర్లు కూడా యూజర్లను ఆకర్షించేందుకు ఆఫర్లు ఇవ్వొచ్చు. ఆరు నెలలకు పైగా దీర్ఘకాలిక సబ్స్క్రిప్షన్ తీసుకునేవారికి ఎన్‌సీఎఫ్‌పైన, డిస్ట్రిబ్యూటర్ రిటైల్ ధరపైన డిస్కౌంట్లు వంటివి ఇవ్వొచ్చు. ► ఒకటికి మించి టీవీలు ఉన్న ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ట్రాయ్ సమీక్షించింది. రెండో టీవీకి వసూలు చేసే ఎన్సీ ఫీజు.. మొదటి టీవీ సెట్ ఫీజులో 40 శాతాన్ని మించరాదు. ప్రతీ టీవీ కనెక్షన్‌కు వేర్వేరు చానళ్లను ఎంపిక చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ► మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు, డైరెక్ట్ టు హోమ్ సేవల సంస్థలకు ట్రాయ్ షాక్ ఇచ్చింది. ఆయా ఆపరేటర్లు తమ చానళ్లను ప్రసారం చేసినందుకు వారికి బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు చెల్లించే నెలవారీ క్యారేజీ ఫీజుపై (ఎంసీఎఫ్) పరిమితులు విధించింది. ఒక్కో చానల్‌కు గరిష్టంగా రూ. 4 లక్షల ఎంసీఎఫ్ను నిర్ణయించింది. ఇప్పటిదాకా దీనిపై ఎలాంటి పరిమితులు లేవు. కేబుల్ టీవీ షేర్ల పతనం.. తక్కువ ధరకే అధిక చానళ్లు వీక్షించేలా ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ టీవీ ఆపరేటర్ల కంపెనీ షేర్లను అతలాకుతలం చేసింది. ఆరంభంలో బాగా పతనమైన ఈ షేర్లు చివరకు మిశ్రమంగా ముగిశాయి. సన్ టీవీ నెట్వర్క్స్, డెన్ నెట్వర్క్స్ షేర్లు 0.1–1.2 శాతం రేంజ్లో నష్టపోయాయి. డిష్ టీవీ ఇండియా 2.2 శాతం, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేర్ 0.4 శాతం చొప్పున లాభపడ్డాయి. -
భారీగా తగ్గిన బంగారం!
న్యూయార్క్, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారత్ కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఒక్కసారిగా క్షీణించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్–నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా)కు 30 డాలర్లకు పైగా పతనమై, 1,462 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వాణిజ్య యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా–చైనా మధ్య జరుగుతున్న చర్చలు సానుకూలంగా ఉన్నా యనే ఊహగానాలు పసిడి నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు కారణమన్నది విశ్లేషణ. సహజంగా భౌగోళిక ఆర్థిక, రాజకీయ ఉద్రిక్తతల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు పసిడి సురక్షితమైనదిగా భావిస్తారు. అలాంటి పరిస్థితులు లేనప్పుడు వాస్తవ వృద్ధికి దోహదపడే అసెట్స్‌వైపు తమ ఇన్వెస్ట్మెంట్లను మళ్లిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర గురువారం రాత్రి ఇదే విధంగా బలహీనంగా ముగిస్తే, భారత్ దేశీయ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర భారీగా పతనమయ్యే అవకాశం ఉంది. -
బంగారం 1,530 డాలర్ల పైన... ర్యాలీయే
బంగారం గత మంగళవారం ఆరున్నరేళ్ల గరిష్ట స్థాయిని తాకిన తర్వాత వారం మొత్తం మీద ఆర్జించిన లాభాలను కోల్పోయింది. డిసెంబర్ కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం నష్టపోయి ఔన్స్‌కు 1532.60 డాలర్లుగా ఉంది. అమెరికాకు వ్యతిరేకంగా ప్రతీకార చర్యలను చైనా వాయిదా వేయడం సానుకూల స్పందనకు దారితీసినట్టు టీడీ సెక్యూరిటీస్ గ్లోబల్ స్ట్రాటజీ హెడ్ బార్ట్ మెలెక్ తెలిపారు. వారం మొత్తం మీద లాభాలను కోల్పోయినప్పటికీ, బంగారం కీలక మద్దతు స్థాయి 1,530 డాలర్లకు పైనే నిలిచింది. ఇది కొనసాగితే భవిష్యత్తులో ధరలు పెరిగేందుకే అవకాశం ఉందని బ్లూలైన్ ఫ్యూచర్స్ ప్రెసిడెంట్ బిల్ బరూచ్ తెలిపారు. బంగారం 1,530 డాలర్ల పైన ఉన్నంత వరకు తాను బుల్లిష్‌గానే ఉంటానని, 1,530 డాలర్లకు దిగువన ముగిస్తే 1,500 దిశగా తగ్గుతుందని బరూచ్ చెప్పారు. ఈ వారంలో బంగారం మరింత కన్సాలిడేషన్‌కు అవకాశాలు లేకపోలేదని ఎక్కువ మంది అనలిస్టులు భావిస్తున్నారు. ‘‘బంగారం కొంత మేర దిగువకు వెళ్లొచ్చు. అమెరికా డేటా క్షీణతను సూచిస్తే, ఫెడ్ మరింత డోవిష్‌గా వ్యవహరిస్తుంది. దాంతో ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు పెరగడంతోపాటు, బంగారం అధిక స్థాయికి వెళుతుంది. గణనీయంగా పెరగడాన్ని చూడొచ్చు. దిగువ వైపున 1,488 మద్దతుగా వ్యవహరిస్తుంది’’ అని మెలెక్ వివరించారు. పావెల్ వ్యాఖ్యలపై దృష్టి... స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్‌లో వచ్చే శుక్రవారం అమెరికా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగించనున్నారు. దీనికంటే ముందు ఆగస్ట్ నెలకు సంబంధించి అమెరికా ఉద్యోగ గణాంకాల డేటా బయటకు రానుంది. సెప్టెంబర్ 18 నాటి ఫెడ్ రేట్ల నిర్ణయానికి ముందు పావెల్ చివరి ప్రసంగం ఇదే. ఈ నెలలో మరో విడత రేట్ల కోత ప్రణాళికను ఆయన ప్రకటించొచ్చని క్యాపిటల్ ఎకమనిక్స్ యూఎస్ ఎకనమిస్ట్ ఆండ్రా్యూ హంటర్ తెలిపారు. -
ఏడాది కనిష్టానికి ‘పెట్రోల్’
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం మరింత తగ్గాయి. పెట్రోల్ లీటర్‌కు 22 పైసలు తగ్గడంతో దేశ రాజధానిలో రూ.69.26 నుంచి ఈ ఏడాదిలోనే కనిష్ట స్థాయి రూ.69.04కు చేరుకుంది. డీజిల్ ధర కూడా లీటరుపై 23 పైసలు తగ్గడంతో రూ.63.32 నుంచి తొమ్మిది నెలల కనిష్ట స్థాయి రూ.63.09కి దిగి వచ్చిందని ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు తెలిపాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే కొద్ది రోజుల్లో పెట్రో ధరలు మరింతగా తగ్గే అవకాశముందని వెల్లడించాయి. ఆగస్టు 15వ తేదీన పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.77.14, ముంబైలో రూ.84.58, డీజిల్ లీటర్ ఢిల్లీలో రూ.68.72, ముంబైలో రూ.72.96గా ఉండగా 16వ తేదీ నుంచి పైకి ఎగబాకడం ప్రారంభించి, అక్టోబర్ 4వ తేదీన రికార్డు స్థాయికి ఢిల్లీలో రూ.91.34, ముంబైలో రూ.84కు చేరుకుంది. అదే రోజు డీజిల్ ధర కూడా ఢిల్లీలో లీటర్‌కు రూ.75.45, ముంబైలో రూ.80.10కు చేరుకుంది. ఆ తర్వాత అంతర్జాతీయంగా చమురు ధరలు క్రమంగా తగ్గడంతో ఆ ప్రభావం దేశీయంగా పడింది. హైదరాబాద్‌లో..: ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.73.22కు చేరింది. అక్టోబరులో రూ.89.06 ధరతో రికార్డు సృష్టించిన పెట్రోల్ ధర నవంబర్ నాటికి రూ.84.14కు చేరింది. డిసెంబర్ మొదటివారంలో రూ.76.89 ఉన్న ధర చివరి వారంలో మరో రూ.3.67 తగ్గడం విశేషం. డీజిల్ ధర లీటరుకు ప్రస్తుతం రూ.68.67కు చేరింది. అక్టోబర్‌లో లీటరు డీజిల్ ధర రూ.82.33 కాగా, నవంబర్ నెలలో 80.20కు చేరింది. -
రూ.50 తగ్గిన డీఏపీ ధరలు
పెద్దేముల్: డీఏపీ ఎరువుల ధరలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. నెలరోజుల క్రితం గోదావరి 50 కిలోల బస్తా రూ.1,303 ఉండగా, తరువాత రూ1,260కి విక్రయించారు. రెండు రోజుల క్రితం పెద్దేముల్ రైతు సేవా సహకార సంఘం అధికారులు రూ.1,155కి విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించి రైతులు ఎరువులు ఖరీదు చేసుకోవాలన్నారు. కాగా కొన్ని గ్రామాల్లోని ఎరువుల దుకాణాల్లో మాత్రం అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారని, రసీదులు అడగితే ఇవ్వడం లేదని పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. -
బ్యాంకులు అటూ.. ఇటూ..
ముంబై: ఆర్బీఐ పాలసీ విధానంపై బ్యాంకుల్లో మిశ్రమ స్పందన కనిపించింది. ఎస్బీఐ వంటి కొన్ని బ్యాంకులు మినహా మిగతావి స్వాగతించాయి. బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయాలను తగ్గించే దిశగా సమతుల్యమైన, ఆచరణాత్మకమైన చర్యగా అభివర్ణించాయి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని (ఎంఎస్ఎఫ్) తగ్గించడం వల్ల తమ బ్యాంకు నిధుల సమీకర ణ వ్యయాలు తగ్గుతాయని, అయితే రెపో రేటు పెంపు వల్ల ఆ ప్రయోజనాలు దక్కకుండా పోతాయని ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఆర్బీఐ తాజాగా రెపో రేటు పెంచిన ప్రభావం.. వడ్డీ రేట్లపై తక్షణమే పెద్దగా ఉండకపోవచ్చని కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఏకే గుప్తా తెలిపారు. ఆర్బీఐ ఒక విధంగా సమతుల్యం పాటించే ప్రయత్నం చేసిందన్నారు. ద్రవ్యోల్బణం కట్టడిపైనే ప్రధానంగా దృష్టి నిలపడం మంచిదేనని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కంట్రీ సీఈవో సునీల్ కౌశల్ చెప్పారు. మార్కెట్ ప్రారంభంలో తీవ్ర అసంతృప్తికి లోనైనప్పటికీ, తాము ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. దీన్ని వృద్ధి విఘాత చర్యగా భావించరాదని తెలిపింది. స్వల్పకాలికంగా మనీమార్కెట్ రేట్లు, డిపాజిట్ రేట్లూ తక్షణమే దిగి రాగలవని, బ్యాంకులకు కొంత ఊరట లభించగలదని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఎండీ ఎం నరేంద్ర తెలిపారు. వడ్డీ రేట్లు పెరుగుతాయ్.. పండున సీజన్ సమయంలో రుణాలకు భారీ డిమాండ్ ఉం టుంది. దానికి అనుగుణంగా బ్యాంకు లూ డిపాజిట్ల సమీకరణలో ఉంటాయి. ఈ పరిస్థితుల్లో డిపాజిట్ రేట్లు పెరగొచ్చు.. అలాగే రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరగొచ్చు. బేస్ రేటు అనేది పాలసీ రేటుపై కాకుం డా బ్యాంకుల వద్ద ద్రవ్య లభ్యత, డిపాజిట్లు..రుణాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. - ప్రతీప్ చౌదరి, చైర్మన్, ఎస్బీఐ సమతౌల్యమైన విధానం.. సమీప భవిష్యత్‌లో సమస్యలను పరిష్కరించే దిశగా ఇది సమతౌల్యమైన విధా నం. స్వల్పకాలంలో మార్కెట్లలో స్థిరత్వం, దీర్ఘకాలికంగా ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేదిగా దీన్ని సానుకూల దృక్పథంతో చూడాలి. - చందా కొచర్, ఎండీ, ఐసీఐసీఐ బ్యాంక్