
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ముడిచమురు ధరలు పడిపోయిన నేపథ్యంలో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సబ్సిడీయేతర వంట గ్యాస్ ధరను రికార్డు స్థాయిలో రూ.162.50 తగ్గింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,285 నుంచి రూ.1029.50కు తగ్గిపోయింది. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ చమురు ధర, విదేశీ మారకపు ధరల ఆధారంగా ప్రతినెలా ఒకటో తారీఖున వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. సబ్సిడీని వదులుకున్న గ్యాస్ వినియోగదారుల గ్యాస్ ధర గత మూడు నెలలుగా తగ్గుతూ వస్తోంది. అలాగే గృహ వినియోగదారుల 12 కోటా పరిధి దాటిన వారు సైతం సబ్సిడీయేతర గ్యాస్ ధరల్లోనే గ్యాస్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.