breaking news
Non-subsidized cooking gas cylinder
-
సబ్సిడీయేతర ఎల్పీజీ ధర భారీ తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ముడిచమురు ధరలు పడిపోయిన నేపథ్యంలో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సబ్సిడీయేతర వంట గ్యాస్ ధరను రికార్డు స్థాయిలో రూ.162.50 తగ్గింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,285 నుంచి రూ.1029.50కు తగ్గిపోయింది. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ చమురు ధర, విదేశీ మారకపు ధరల ఆధారంగా ప్రతినెలా ఒకటో తారీఖున వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. సబ్సిడీని వదులుకున్న గ్యాస్ వినియోగదారుల గ్యాస్ ధర గత మూడు నెలలుగా తగ్గుతూ వస్తోంది. అలాగే గృహ వినియోగదారుల 12 కోటా పరిధి దాటిన వారు సైతం సబ్సిడీయేతర గ్యాస్ ధరల్లోనే గ్యాస్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
సబ్సిడీయేతర సిలిండర్‌పై వడ్డన
రూ. 16.50 పెంపు న్యూఢిల్లీ: నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర మంగళవారం రూ. 16.50 పెరిగింది. అలాగే విమానాల ఇంధన ధరలు కూడా అర శాతం మేర పెరిగాయి. ఇరాక్ సంక్షోభంతో అంతర్జాతీయంగా చమురు ధరలకు రెక్కలు రావడమే ఇందుకు కారణం. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను కూడా కేంద్రం పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా గ్యాస్ ధర పెరగడంతో నాన్ సబ్సిడీ సిలిండర్ రేటు ఢిల్లీలో రూ. 922.50గా ఉంది. ప్రస్తుతం వినియోగదారులకు ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ కింద పొందే వీలుంది. ఈ పరిమితి దాటిన తర్వాత తీసుకునే సిలిండర్లకు సబ్సిడీ వర్తించదు. ఆరు నెలలుగా తగ్గుతూ వచ్చిన వీటి ధర తొలిసారి మళ్లీ పెరిగింది. కాగా, ఒక్కో సబ్సిడీ సిలిండర్‌పై రూ. 449 నష్టం వస్తున్నట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి. ఇక ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) లేదా జెట్ ఫ్యూయల్‌గా పిలిచే విమాన ఇంధనం ధర కూడా కిలోలీటర్‌కు రూ. 413.78 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలోలీటర్ ఇంధనం రేటు ఢిల్లీలో రూ. 70,161.76కు చేరింది. ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న విమానయాన సంస్థలకు ఈ పెంపు భారంగా పరిణమిస్తుందని నిపుణులు అంటున్నారు.