నేరాల రేటు ‘డౌన్‌’ 

Crime Rates Down In Telangana Due To Lockdown - Sakshi

హత్యలు,కిడ్నాప్‌లు, ఇతర నేరాలు తగ్గుముఖం

కరోనాను నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌనే కారణం  

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా రా ష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. సాధారణ రోజుల కంటే కాస్త అటూ ఇటుగా 33 నుంచి 55 శాతం తగ్గుద ల నమోదైంది. రోడ్లపై, వీధుల్లో జ నసంచారం లేకపోవడం నేరాలు త గ్గడానికి ప్రాథమిక కారణమైతే.. ప్ర తీ వీధిలోనూ పోలీసు గస్తీ, ని ఘా పెరగడం రెండో కారణం. అదే సమయంలో లాక్‌డౌన్‌కు సంబంధించిన కేసులు మాత్రం పెరుగుతున్నాయి. నగరాలు, ప ట్టణాల్లో ప్రజలు ముఖ్యంగా యువత లాక్‌డౌన్‌ నిబంధనల ను ఇష్టానుసారంగా ఉల్లంఘిస్తున్నారు. మార్చి 22 నుంచి 31 వ రకు 10 రోజుల పాటు రాష్ట్రం లోని వివిధ జిల్లాలు, కమిషనరేట్లలో 4 వేలకు పైగా నేరాలు నమోదయ్యాయి.

2018 నేషనల్‌ క్రైం బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం.. ఈ నేరా లను పోల్చి చూసినపుడు ఐపీసీ సెక్షన్ల కింద రోజూ 383 నేరాలు నమోదు కాగా, 33 శాతం (254 నేరాలు మాత్రమే) తగ్గుదల నమోదైంది. ఇందులో సాధారణంగా పెట్టీ కేసులు ఎక్కు వగా ఉంటాయి. ప్రస్తుతం నమోదైన ఐపీసీ కే సుల్లో అధికశాతం లాక్‌డౌన్‌కు సంబంధించిన వే కావడం గమనార్హం. ఇక కిడ్నాపుల పరంగా చూస్తే.. రోజుకు సగటున దాదాపు 5 కిడ్నాపు కేసులు నమోదు కాగా.. ఈ పదిరోజుల్లో రోజు కు 2.5 కేసులే నమోదయ్యాయి. 2018 ఎన్‌సీఆ ర్‌బీ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో రోజుకు 2.5 హత్యల చొప్పున నమోదవగా.. ఈ పదిరోజుల్లో రోజుకు 1.4 హత్యల చొప్పున రికార్డయింది. 

పదిరోజుల్లో 4,369 కేసులు.. 
డెకాయిటీ (1), రాబరీ (2), పగ టి చోరీలు(2), రాత్రిచోరీలు (17), దొంగతనాలు (153), హత్య లు (14), అల్లర్లు (14), కి డ్నాప్‌లు (24), లైంగిక దాడులు (8), తీవ్రంగా గాయపర్చడం (4), స్వల్పదాడులు (260), మోసాలు (101), నమ్మకద్రోహం (12), మాద కద్రవ్యాల సరఫరా (0), హ త్యాయత్నాలు (18), తీవ్ర రోడ్డు ప్రమాదాలు (48), సా ధారణ రోడ్డు ప్రమాదాలు (92), ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసులు (2,546), ఇతర సెక్షన్ల కింద 1,053 కేసులు కలిపి మొత్తంగా పదిరోజుల్లో 4,369 కేసులు నమోదయ్యాయి.

అధిక రోడ్డు ప్రమాదాలు అందువల్లే.. 
రోడ్‌ సేఫ్టీ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో రో జుకు సగటున 63 రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అందులో 60మంది గాయపడగా, 18 మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ పది రోజు ల్లో చిన్నాపెద్దా అన్నీ కలిపి 140 రోడ్డు ప్రమా దాలు జరిగాయి. వీటిలో 90 శాతం ప్రమాదా లు వాహనదారుల స్వయంకృతాపరా ధం వల్లే జరిగాయని పోలీసులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top