LPG Cylinder Rates: Commercial LPG Cylinder Prices Slashed By Rs.92, Check Here City Prices - Sakshi
Sakshi News home page

వంట గ్యాస్‌ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర!

Published Sat, Apr 1 2023 8:41 AM

LPG Cylinder Rates Revised Cooking Gas price cut By Rs 92 - Sakshi

గ్యాస్‌ ధరలపై కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2023-2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజునే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించింది. ఏప్రిల్ 1న వంట గ్యాస్ ధరలు దాదాపు రూ.92 తగ్గించింది. అయితే రేట్ల తగ్గింపు కేవలం వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే. గృహోపయోగానికి వినియోగించే డొమెస్టిక్‌ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరల్లో మాత్రం ఎలాంటి త‍గ్గింపు లేదు. 14.2 కిలోల డొమెస్టిక్‌ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం గత నెలలోనే రూ.50 పెంచిన విషయం తెలిసిందే. అలాగే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను రూ.350 పెంచింది.

(Jio offer: జియో అన్‌లిమిటెడ్‌ డేటా ఆఫర్‌.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్‌!)

సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున పెట్రోలియం కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తుంటాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ రేటు భారతదేశంలో ఎల్‌పీజీ సిలిండర్ ధరలను ప్రభావితం చేసే రెండు కీలక అంశాలు. సవరించిన తర్వాత 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.2,028, కోల్‌కతాలో రూ.2,132, ముంబైలో రూ.1,980, చెన్నైలో రూ.2192.50 చొప్పున ఉంది. 

కాగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం గృహ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని ప్రకటించింది. ఈ పథకం కింద 9.59 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రతి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పైనా రూ.200 సబ్సిడీ అందిస్తున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గత నెలలో ప్రకటించారు. డొమెస్టిక్‌ సిలిండర్లు ఏడాదికి  12 మాత్రమే వినియోగించకునేలా కేంద్ర ప్రభుత్వం పరిమితిని విధించింది.

Advertisement
Advertisement