
సెప్టెంబర్‌లో రూ. 1.89 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: గత నెల(సెప్టెంబర్)లో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వసూళ్లు 9 శాతం ఎగశాయి. రూ. 1.89 లక్షల కోట్లను తాకాయి. గత నెల 22 నుంచి జీఎస్‌టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వచి్చన నేపథ్యంలో తాజా వసూళ్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతక్రితం నెల(ఆగస్ట్)తో పోలిస్తే 1.5 శాతం పుంజుకోగా.. 2024 సెప్టెంబర్‌తో చూస్తే 9%పైగా వృద్ధి నమోదైంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం స్థూల వసూళ్లు 1.89 లక్షల కోట్లకు చేరాయి.
2024 సెప్టెంబర్‌లో రూ. 1.73 లక్షల కోట్లు వసూలయ్యాయి. జీఎస్‌టీ రేట్లు, శ్లాబులను క్రమబదీ్ధకరించడంతో వసూళ్లలో వృద్ధి నమోదైంది. రేట్ల మార్పు ప్రభావంతో కిచెన్ అప్లయెన్సెస్‌తోపాటు.. ఎల్రక్టానిక్స్‌వరకూ 375 వస్తువుల ధరలు చౌకయ్యాయి. వీటిలో ఔషధాలు, ఆటోమొబైల్స్ సైతం చేరాయి. జీఎస్‌టీ తగ్గడంతో పలు ప్రొడక్టులకు డిమాండ్ పుంజుకుంది.