న్యూ ట్విస్ట్! | New twist! | Sakshi
Sakshi News home page

న్యూ ట్విస్ట్!

Feb 7 2015 11:42 PM | Updated on Sep 2 2017 8:57 PM

న్యూ ట్విస్ట్!

న్యూ ట్విస్ట్!

ఆయేషా షరాఫ్, ఆమె బిజినెస్ పార్ట్‌నర్ సాహిల్ ఖాన్‌ల వివాదం కొత్త మలుపు తిరిగింది.

ఆయేషా షరాఫ్, ఆమె బిజినెస్ పార్ట్‌నర్ సాహిల్ ఖాన్‌ల వివాదం కొత్త మలుపు తిరిగింది. తమ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందన్న సాహిల్ వాదనలో వాస్తవం లేదని, కారణం అతడు గే అని ఆయేషా తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సాహిల్ కోర్టులో సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు. తాను ఆయేషాతో ‘బాగా క్లోజ్’గా ఉన్న కొన్ని ఫొటోలను కోర్టు ముందు ఉంచాడనేది మిడ్‌డే కథనం.
 
 గే అన్న కారణంతోనే సాహిల్ భార్య నిగార్ అతడికి విడాకులిచ్చిందని... ఇక తామిద్దరి మధ్య సంబంధాలకు అవకాశమెక్కడిదని గతంలో ఆమె ప్రశ్నించింది. తన దగ్గర వివిధ రూపాల్లో తీసుకున్న రూ.5 కోట్లు సాహిల్ తిరిగి ఇవ్వలేదంటూ ఆయేషా అతగాడికి ఇచ్చిన నోటీసుతో ఈ వివాదం వెలుగు చూసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement