
నిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. అయితే ఏనుగు చచ్చినా పదివేలే అన్నట్టు... పచ్చి లేదా పండు నిమ్మలోనే కాదు... ఎండిన నిమ్మలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, పేగు సంబంధిత రుగ్మతలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఎండిన నిమ్మకాయలోని విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది తద్వారా వాతావరణంలోని మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. ఎండిన నిమ్మకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన చర్మానికి మంచివి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మంపై ఉన్న మచ్చలు తగ్గి చర్మం శుభ్రంగా, ప్రకాశవంతంగా మారుతుంది.
ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
ఎండిన నిమ్మకాయలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎండిన నిమ్మకాయలు నేచురల్‌గానే శరీరంలోని వ్యర్థాలను, విషాలను తొలగించి, కాలేయ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, జీర్ణ రసాయనాలను కూడా అందిస్తాయి.
దీన్ని ఎలా తినాలి?
ఎండిన నిమ్మకాయలను నేరుగా తినవచ్చు లేదా చాట్స్‌లో లేదా ఇతర వంటకాలకు జోడించడం ద్వారా తినవచ్చు. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా, మీ ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు.