Yoga ఆసనాలతో ఆరోగ్యయోగం | Health benefits : Yoga and Asanalu at Seethammapet | Sakshi
Sakshi News home page

Yoga ఆసనాలతో ఆరోగ్యయోగం

Jun 9 2025 4:30 PM | Updated on Jun 9 2025 5:08 PM

Health benefits : Yoga and Asanalu at Seethammapet

ఆసనాలతో ఆరోగ్యయోగం యోగాసనాలు వేసిన సీనియర్‌ సిటిజన్స్, ఉద్యోగులు

క్లిష్టమైన యోగాసనం వేసిన ఉమామహేశ్వరరావు   

సీతంపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో ఆదివారం ‘యోగాంధ్ర’ ఉత్సాహంగా సాగింది. వయో వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, యూసీడీ మహిళలు, విద్యార్థులు, యోగా అసోసియేషన్‌ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. యోగా శిక్షకుల సూచనలకు అనుగుణంగా వివిధ ఆసనాలు వేశారు. యోగాసనాలతో పాటు ఓం శాంతి ఆధ్వర్యంలో ధ్యానం చేశారు. 

78 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌ ఉమామహేశ్వరరావు క్లిష్టమైన యోగసనాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. జూన్‌ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో నగర ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. పలుశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement