breaking news
sethampet
-
Yoga ఆసనాలతో ఆరోగ్యయోగం
సీతంపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో ఆదివారం ‘యోగాంధ్ర’ ఉత్సాహంగా సాగింది. వయో వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, యూసీడీ మహిళలు, విద్యార్థులు, యోగా అసోసియేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. యోగా శిక్షకుల సూచనలకు అనుగుణంగా వివిధ ఆసనాలు వేశారు. యోగాసనాలతో పాటు ఓం శాంతి ఆధ్వర్యంలో ధ్యానం చేశారు. 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ ఉమామహేశ్వరరావు క్లిష్టమైన యోగసనాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో నగర ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. పలుశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు -
Seethampeta: వనవిహారీ.. ఇదీ దారి
వేకువ గాలులు నొసటన ముద్దాడుతూ ఉంటే ఈ కొండల్లో విహరించాలి. సూరీడి కిరణాలు నడినెత్తిపై వచ్చే వేళకు ఆ జలపాతం మన శిరసుపై నుంచి పాదాలపైకి దూకాలి. కడుపు లోపల చల్ల కదలకుండా సున్నపుగెడ్డ మధ్యన నడుం వాల్చాలి. వెలుతురు వెళ్లి చీకటి ఇంకా రాని ఆ కొన్ని ఘడియల పాటు చెమట్లు వచ్చేలా సాహస క్రీడల్లో మునిగి తేలాలి. కార్తీక వన విహారానికి ఇంతకు మించిన సాఫల్యత ఏముంటుంది..? ఇవన్నీ నిజం కావాలంటే మంచి సెలవు రోజు చూసుకుని చలో సీతంపేట అనేయడమే. సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం): సీతంపేట రారమ్మంటోంది. కార్తీకంలో వన విహారానికి తన బెస్ట్ టూరిజం ప్రదేశాలను చూపిస్తూ ఆకర్షిస్తోంది. ఓ వైపు జలపాతాలు, మరోవైపు పార్కు, ఇంకో వైపు అడవుల అందాలతో మన్యం అద్భుతంగా కనిపిస్తోంది. ఏటా ఎన్టీఆర్ అడ్వంచర్ పార్కు, జగతపల్లి, ఆడలి వ్యూపాయింట్లను చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలతో పాటు ఇటు ఒడిశా నుంచి కూడా పర్యాటకులు క్యూ కడుతుంటారు. సాహస క్రీడా వినోదం సీతంపేట అడ్వంచర్ పార్కు స్థానికంగా దోనుబాయి రహదారి మలుపునకు సమీపంలో ఉంది. ఇక్కడ జలవిహార్‌లో బోటుషికారు ఏర్పాటు చేశారు. సైక్లింగ్, జెయింట్‌వీల్, ఆల్టర్న్ వెహికల్, షూటింగ్, బంజీట్రంపోలిన్ వంటివి ఉన్నాయి. సున్నపుగెడ్డకు ఇలా.. ఏజెన్సీలోని సున్నపు గెడ్డ జలపాతానికి మంచి ప్రాధాన్యం ఉంది. ఇక్కడ వాతావరణం చూపరుల్ని కట్టిపడేస్తుంది. దోనుబాయి గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో సున్నపుగెడ్డ ఉంది. పొల్ల– దోనుబాయి మార్గంలో మేకవ గ్రామానికి సమీపంలో రోడ్డుదిగువ గుండా నడుచుకుంటూ వెళితే సున్నపుగెడ్డ జలపాతానికి చేరుకోవచ్చు. బస్సులు పరిమితంగా ఉంటాయి. సీతంపేట వచ్చి ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. సదుపాయాలు అంతంత మాత్రమే. తిను బండారాలు ఇతర ఆహార సామగ్రి పర్యాటకులు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మెట్టుగూడ.. ఇక్కడ.. ► మెట్టుగూడ జలపాతం మంచి ప్రాచుర్యం పొందింది. మా మూలు రోజుల్లో కూడా ఇక్కడకు వచ్చే సందర్శకుల సంఖ్య అ ధికంగా ఉంటుంది. ► సీతంపేట నుంచి కొత్తూరుకు వెళ్లే రహదారిలో ఈ జలపాతం ఉంది. ► కొత్తూరు నుంచి వస్తే 10 కిలోమీటర్లు, పాలకొండ నుంచి వస్తే 17 కిలోమీటర్ల దూరంలో రహదారి పక్కనే మెట్టుగూడ వస్తుంది. ► అక్కడ వాహనాలు దిగి కొద్ది దూరం నడిచి వెళ్తే జలపాతాన్ని చేరుకోవచ్చు. ► ఆర్టీసీ బస్సులు పాలకొండ–కొత్తూరు నుంచి అనునిత్యం తిరుగుతుంటాయి. పర్యాటకులకు అన్ని సౌకర్యాలున్నాయి. వ్యూపాయింట్ భలే పొల్ల: సున్నపుగెడ్డకు సమీపంలో పొల్ల వ్యూ పాయింట్ ఉంది. ఆడలి: ఏజెన్సీలోని ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లాలంటే కుశిమి జంక్షన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రత్యేక వాహనాల్లో వెళ్లాలి. జగతపల్లి: సీతంపేట నుంచి7 కిలోమీటర్ల దూరంలో జగతపల్లి ఉంది. వీటిని వీక్షించడానికి ప్రత్యేక టూరిజం వెహికల్‌ను ఏర్పాటు చేశారు. -
‘గిరి’జన గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ పాఠశాలల ఏర్పాటు
సీతంపేట, న్యూస్‌లైన్: గిరిజన గ్రామాల్లో డ్రాపౌట్లు నివారించేందుకు ఐటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు. ఐటీడీఏ పరిధిలోని పలు మండలాల్లో 190 ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ (నాన్‌రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్) కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధంచేశారు. గిరిజన ప్రాంతాల్లో బడివయసు పిల్లలందరూ బడికి వెళ్లాలనే ప్రధాన ఉద్దేశంతో వీటిని నెలకొల్పుతున్నారు. విద్యాసంవత్సరం ఆరంభంలో శాటిలైట్ పాఠ శాలలను ప్రభుత్వం మూసివేసింది. దీంతో గిరిజన గ్రామాల్లో సుమారు 1716 మంది విద్యార్థులు డ్రాపౌట్స్‌గా మిగిలారు. వీరంతా తల్లిదండ్రులతో కలిసి పోడు వ్యవసాయంలో పాల్గొంటున్నారు. వీరందరినీ ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ పాఠశాలల్లో చేర్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో చదువుకున్నవారే ఉపాధ్యాయులు శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేసే గ్రామంలో అర్హులైన అభ్యర్థులను బోధకులుగా నియమించనున్నారు. వీరికి రూ.2,500లుగా గౌరవవేతనం నిర్ణయించారు. వీరు ఇంటింటికి వెళ్లి పిల్లలను పాఠశాలకు చేర్చి చదువు చెబుతారు. ప్రధాన పాఠశాలలకు అనుబందంగా ఈ పాఠశాలలు పనిచేస్తాయి. మధ్యాహ్నబోజన పథకం అమలు కానుంది. యూనిఫారాలను విద్యార్థులకు అందజేస్తారు. ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ కేంద్రాల ఏర్పాటు ఎనిమిదేళ్ల వయసు పైబడి చదవని వారు, చదివి డ్రాపౌట్ అయిన వారిని ఈ కేంద్రాల్లో చేర్చుతారు. వీరికి మూడు పూటల భోజనం, వసతి సదుపాయం కల్పిస్తారు. సీతంపేట మండంల హడ్డుబంగి, ఓండ్రుజోల, కొత్తూరు, భామిని మండలం మనుమకొండ, బూర్జ మండలం పెద్దపేటలలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో మూడు పూటల విద్యార్థులకు భోజన సౌకర్యాలు కల్పిస్తారు. ప్రత్యేక ఉపాధ్యాయులతో చదువులు చెప్పించి వారి వయసుకు తగ్గట్టుగా వివిధ ఆశ్రమ పాఠ శాలలో చేర్పించనున్నారు.