సండే ఆన్‌ సైకిల్‌ : సైకిల్‌ మన దినచర్యలోభాగం కావాలి! | World Bicycle Day Celebrated In Hyderabad By South Central Railway | Sakshi
Sakshi News home page

సండే ఆన్‌ సైకిల్‌ : సైకిల్‌ మన దినచర్యలోభాగం కావాలి!

Jun 9 2025 10:24 AM | Updated on Jun 9 2025 10:53 AM

World Bicycle Day Celebrated In Hyderabad By South Central Railway

దక్షిణమధ్య రైల్వే స్పోర్ట్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ‘సండేస్‌ ఆన్‌ సైకిల్‌’ కార్యక్రమాన్ని జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌జైన్‌ ప్రారంభించారు. రైల్వేస్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అరుణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఉద్యోగులతో కలిసి ఆయన కూడా సైకిల్‌ తొక్కారు. ‘ఫిట్‌ ఇండియా సైక్లోథీన్‌’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో రైల్వే అదనపు జీఎం నీరజ్‌ అగర్వాల్, డీఆర్‌ఎం భర్తేష్‌ కుమార్, దక్షిణమధ్య రైల్వే వివిధ విభాగాలకు చెందిన అధికారులు, దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, ఉద్యోగులు, రైల్వే క్రీడాకారులు పాల్గొన్నారు. – సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్‌  

సైక్లింగ్‌తో ఆరోగ్యం, ఫిట్‌నెస్, పర్యావరణ బాధ్యత లాంటి ప్రయోజనాలు ఉంటాయని, దీన్ని దిన చర్యలో భాగం అలవర్చుకోవాలన్సిన అవసరం ఎంతైనా ఉందని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) హైదరాబాద్‌ బ్రాంచ్‌ చైర్మన్‌ ఎ.చిన్న సీతారామిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ గిరిధారిలాల్‌ తోషిన్‌వాల్‌ అన్నారు. 

చదవండి: అఖిల్‌ పెళ్లి సందడి : జైనాబ్‌ డైమండ్‌ జ్యుయల్లరీ స్పెషల్‌ ఎట్రాక్షన్‌

ప్రపంచ సైకిల్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని నార్సింగిలోని ఔటర్‌రింగ్‌ రోడ్డు సైకిల్‌ ట్రాక్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్, సమాజహితం సాధించాలంటే సైక్లింగ్‌ చేయాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలి, ఐక్యతని పెంపొందించేందుకు సైక్లింగ్‌ ఉపయోగపడుతుందన్నారు. అంతకు ముందు డీఎంకే టీమ్‌ నిర్వహించిన వార్మప్‌ సెషన్‌లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నార్సింగి నుంచి అప్పా సర్కిల్‌ వరకూ సైక్లింగ్‌ చేశారు. స్ప్రింట్‌ డయాగ్నోస్టిక్స్‌ సహాయంతోపాటు హైడ్రేషన్, రిఫ్రెష్‌మెంట్‌ అందించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున చార్టర్డ్‌ అకౌంటెంట్ల కుటుంభాలు పాల్గొన్నాయి. భాగం చేసుకోవాలి.

 

 

Advertisement
 
Advertisement
Advertisement