Akhil-Zianab : జైనాబ్‌ డైమండ్‌ జ్యుయల్లరీ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ | Akhil Akkineni Zianab wedding her Diamond Jewellery goes viral | Sakshi
Sakshi News home page

అఖిల్‌ పెళ్లి సందడి : జైనాబ్‌ డైమండ్‌ జ్యుయల్లరీ స్పెషల్‌ ఎట్రాక్షన్‌

Jun 7 2025 4:43 PM | Updated on Jun 9 2025 11:32 AM

Akhil Akkineni Zianab wedding her Diamond Jewellery goes viral

అక్కినేని కుటుంబం మొత్తానికి  అఖిల్ అక్కినేని ,  జైనాబ్ రవ్జీ  మూడు ముళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. గత ఏడాది నవంబరులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో(జూన్ 6న)వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అఖిల్‌ తల్లిదండ్రులు అక్కినేని నాగార్జున-అమల,  సవతి సోదరుడు నాగ చైతన్య -శోభిత ధూళిపాళ దంపతులు దగ్గరుండి వీరి పెళ్లి వేడుకను  వైభవంగా జరిపించారు.  అఖిల్‌-జైనాబ్‌  వెడ్డింగ్‌ పిక్స్‌ నెట్టింట సందడిగా మారాయి. అలాగే వధువు జైనాబ్‌ చీర, నగలపై ఆసక్తి నెలకొంది.

వధువు జైనాబ్ వజ్రాభరణాలతో అందంగా మెరిసిపోయింది. జైనాబ్ ముఖంలో ఐవరీ-గోల్డ్ చీర, జడలో  మల్లె పూలతో పెళ్లి కళ ఉట్టి పడింది. అలాగే  పెళ్లి  ముస్తాబులో మొత్తం డైమండ్‌ నగలనే ఎంచుకోవడం స్పెషల్‌ ఎట్రాక్షన్‌. వజ్రాల ఆభరణాలతో తన బ్రైడల్‌ లుక్‌ను తీర్చిదిద్దుకుంది. రెడ్‌ రూబీ పొదిగిన డైమండ్ చోకర్ నెక్‌పీస్ అందంగా అమిరింది. దీంతోపాటు మ్యాచింగ్‌ చైన్‌, మూడు లేయర్ల  డైమండ్ నెక్లెస్, మఠపట్టి, మ్యాచింగ్ ఝుమ్కాలు,  ముక్కెర, వజ్రాల గాజులు, డైమండ్‌ వడ్డాణం ఇలా ప్రతీదీ డైమండ్స్‌తో  తళుక్కున మెరిసింది. అటు  కొత్త పెళ్లికొడుకు అఖిల్‌ కూడా శ్వేత వస్త్రాల్లో  సింపుల్‌గా అందంగా కనిపించాడు.

జైనబ్‌తో  తన రిలేషన్‌షిప్‌ను అఖిల్‌ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. రెండు ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఈ ఫోటోలు జైనబ్‌  డైమండ్‌ రింగ్‌ను కూడా మనం చూడవచ్చు. మొత్తానికి అక్కినేని నాగార్జున  తన ఇద్దరి కొడుకులకు పెళ్లిళ్లు చేసి, తండ్రిగా తన బాధ్యతలను పూర్తి చేశాడు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement