నువ్వులలో బోలెడన్ని ఆరోగ్యప్రయోజనాలు లభిస్తాయి. చూడ్డానికి చిన్నగా కనిపించినా నవ్వు గింజ పోషకాల గని. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
జుట్టు ఆరోగ్యం కోసం నువ్వులను ఇలా మన ఆహారంలో చేర్చుకోవచ్చు.
నువ్వుల పొడి: కరివేపాకుతో కారంపొడి ఎలా చేసుకుంటామో అదేవిధంగా దోరగా వేయించిన నువ్వుల పొడి మిగిలిన పదార్థాలన్నీ కలిపి తయారు చేసిన నువ్వుల కారం పొడి చాలా రుచికరంగా ఉండటమే కాదు, గొప్ప ఔషధం లాగా పనిచేస్తుంది. రోజూ రెండుపూటలా ఆహారంలో పరిమితంగా నువ్వుల పొడితీసుకుంటూ వుంటే కురులు నల్లగా నిగనిగలాడతాయి. దీంతోపాటు నువ్వుల పడి వివిధ కూరల్లో చేర్చుకుంటే, రుచికి రుచి,ఆరోగ్యానికి ఆరోగ్యం.
చదవండి: ఎక్కడ చూసినా సీతాఫలాలే, ఇవిగో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్
అలాగే శీతాకాలంలో నువ్వులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నువ్వుల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు లిగ్నన్స్, ఫైటోస్టెరోల్స్ వంటి మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇదీ చదవండి: రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్


