
కొరాపుట్: వర్షాలు కురుస్తుండడంతో పుట్టగొడుగుల (Mushrooms) సీజన్ ప్రారంభమైంది. వీటిని సేకరిస్తున్న వ్యక్తులు విక్రయించేందుకు జయపూర్ మార్కెట్‌కు మంగళవారం భారీగా తీసుకొని వచ్చారు. ఇప్పుడిప్పుడే పుట్టగొడుగులు లభ్యమవుతుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది. కిలో 1400 రూపాయల చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు.
పుట్టగొడుగుల్లోని పోషక లక్షణాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అవి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలకు మంచి మూలం. అంతేకాదు కొన్ని పుట్ట గొడుగులు ప్రీబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి పేగు ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.
చదవండి: ఇషా-ఆనంద్ లవ్, ప్రపోజల్ స్టోరీని రివీల్ చేసిన పాపులర్ సింగర్
పుట్టగొడుగులతో ఆరోగ్య ప్రయోజనాలు
మష్రూమ్స్‌ను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో అద్భుత లాభాలు ఉన్నాయి.
విటమిన్ డి,డి2, పుష్కలంగా లభిస్తాయి.ఎముకలు, కండలకి బలం
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఇక్సిడెంట్స్ కారణంగా స్ట్రెస్ తగ్గుతుంది.
మష్రూమ్స్‌లోయాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. దీంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
పుట్టగొడుగులు తినడం వల్ల బరువు తగ్గుతారు. వీటిల్లో పొటాషియం, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి బీపిని అదుపులో పుంచుకునేందుకు సాయ పడతాయి.
పుట్టగొడుగులతో కార్డియోవాస్క్యులర్ సమస్యలు తగ్గుతాయి. పుట్టగొడుగుల్లోని ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్స్ రక్తనాళాలని మెరుగ్గా చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. సోడియం లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం అందించిన వివరాలివి. అలాగే ఆరోగ్యకరమైన పుట్ట గొడుగులను మాత్రమే ఎంచుకోవాలి. కొన్ని విషపూరితమైన పుట్ట గొడుగులతో ప్రాణాలకు ముప్పు అని గమనించగలరు.
ఇదీ చదవండి: Soumyashree అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులు