
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ ప్రేమకథ తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ గాయకుడు అమేయా డబ్లీని ఈ లవ్‌బర్డ్స్ ప్రేమ, ప్రపోజల్, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గురించి కొన్ని విషయాలను తాజాగా వివరించారు.
ఆనంద్, పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ కుమారుడు, ఆనంద్ ఇషాకు మహాబలేశ్వరంలో ప్రపోజ్ చేశాడట. ఈ విషయాన్ని అమేయా ఇలా వివరించారు. అజయ్ భాయ్ పిరమల్, స్వాతి జీ పిరమల్ చాలా సంవత్సరాల నుండి తెలుసు. "రేపు మీరు మహాబలేశ్వర్ రావాలి అని రాత్రి 11:30 గంటలకు ఫోన్ చేసారు. కొంతమంది అతిథులు సాయంత్రం మా ఫామ్‌హౌస్‌లో ఉంటారు. వారికోసం బ్రీఫ్ 'డాన్సింగ్ అండర్ ది స్టార్స్',అనే థీమ్‌పై ఒక కచేరీ చేయాలి’ అని అడిగారు.
ఉదయం సాఫ్ట్ మ్యూజిక్ ,మధ్యాహ్నం ఎనర్జిటిక్ నంబర్లను ప్లే చేయమన్నారు. మరుసటి రోజు, స్వాతి జీ కూడా కాల్‌చేశారు. కోకిలా ఆంటీ, ముఖేష్ భాయ్, నీతా భాబీ , మిగతా అందరూ ఇంటికి వస్తున్నారని చెప్పారు. ఇది గుజరాతీ ,మార్వాడీ కుటుంబాల కలయిక కాబట్టి, బాలీవుడ్ కూడా పాటలు కూడా ఉండొచ్చుఘూమర్ లాగా అన్నారు. అన్నట్టు, వాళ్లు బాలీవుడ్ అభిమానులు, షారుఖ్ ఖాన్ వాళ్ల ఫ్యావరెట్ హీరో’’ అని చెప్పారని తెలిపాడు.
సింగర్ : అమేయ డబ్లీ
కానీ ఈ వేడుకు ఆనంద్, ఇషాల ప్రపోజల్‌గురించి తెలియదనీ, వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని లేదా వివాహం చేసుకోబోతున్నారని చెప్పలేదు. అక్కడికి వెళ్లిన మరుసటి రోజు,ఆనంద్, ఇషా ఒక ఆలయంలో ప్రపోజ్ చేశారని అమేయా గుర్తు చేసుకున్నాడు.
చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్‌లు
కాగా ఇషా అంబానీ ఆనంద్ పిరమల్ 2016 నుంచి డేటింగ్‌లో ఉండి రెండేళ్ల తరువాత 2018లో వివాహం చేసుకున్నారు.ఇషా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె. 2022లో వీరికి కవలలు పుట్టారు. ఆనంద్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అయిన పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. యేల్ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ఇషా రిలయన్స్ జియో , రిలయన్స్ రిటైల్ డైరెక్టర్‌గా ఉన్నారు.
ఇదీ చదవండి: అవిభక్త కవలలు : అవును ఆమె ప్రియడ్ని పెళ్లాడింది!