సింపుల్‌ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్‌ టాప్‌లు | Check Bharti Singh weight loss journey Lost 15 Kg In 10 Months With A Simple tips | Sakshi
Sakshi News home page

సింపుల్‌ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్‌ టాప్‌లు

Jul 14 2025 4:26 PM | Updated on Jul 14 2025 6:29 PM

Check Bharti Singh weight loss journey Lost 15 Kg In 10 Months With A Simple tips

ప్రముఖ  హాస్యనటి,'లాఫర్ క్వీన్' భారతీ సింగ్‌ (Bharti Singh) చాలా కష్టపడి బరువును తగ్గించుకొని  స్లిమ్‌గా మారడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. 10 నెలల్లో దాదాపు 15 కిలోలు వెయిల్‌ లాస్‌ అయ్య ఎంతోమందికి  స్ఫూర్తిగా  నిలిచింది. యూట్యూబర్  నటి ప్రజక్తా కోలితో జరిగిన పాడ్‌కాస్ట్‌లో, భారతీ తన వెయిట్‌ లాజ్‌జర్నీ గురించి వివరించింది.

భారతీ సింగ్  వెయిట్ లాస్ జర్నీ ఇలా
కేవలం బరువు తగ్గడం మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూడా ఆలోచించింది భారతీ సింగ్‌.  ఎందుకంటే అప్పటికే ఆమె ఆస్తమా . డయాబెటిస్‌తో బాధపడేది. ఎక్కువగా తల తిరుగుతూ ఉండేది. ఒక్కోసారి ఊపిరి ఆడేది కాదు.   డాక్టర్ల సలహామేరకు  ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించింది. 2021లో 91 కిలోల నుండి 76 కిలోలకు తగ్గించుకుని ఆటు ఫ్యాన్స్‌ను ఇటు సినీ అభిమానులను ఆశ్చర్య పర్చింది. బరువుతగ్గడం వల్ల ఆత్మవిశ్వాసంతోపాటు, ఆరోగ్యంగా, శక్తివంతంగా మారినట్టు తెలిపింది. అంతేకాదు డయాబెటిస్,  ఆస్తమా కూడా నియంత్రణలో  ఉన్నాయని సంతోషంగా చెప్పింది. ఇపుడు తాను చాలాఫిట్‌గా, హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. తలతిరగడాలు, ఊపిరి ఆడకపోవడంలాంటి ఇబ్బందులేవీ లేవని వెల్లడించింది.


అడపాదడపా ఉపవాసం Intermittent Fasting
సాయంత్రం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు  ఉపవాసం.  మధ్యాహ్నం ఆహారం తీసుకునేది. 30-32  ఏళ్లుగా చాలా తినేశాను. ఆ తరువాత సంవత్సరం పాటు విరామం ఇచ్చాను.

2022 అధ్యయనం ప్రకారం  అడపాదడపా ఉపవాసం జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇదిబ ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

కడుపు మాడ్చుకోలే, ఇష్టమైన ఫుడ్‌ను త్యాగతం చేయలేదు: తనకిష్టమైన ప్రతిదాన్ని  ఆహారంలో చేర్చుకునేది. కానీ  మితంగా తినడాన్ని అలవాటు చేసుకుంది. తనకెంతో ఇష్టమైన రెగ్యులర్ పరాఠాలు, గుడ్లు, పప్పు-సబ్జీ, నెయ్యి ఇవన్నీ తీసుకునేదాన్నని తెలిపింది. 

పోర్షన్ కంట్రోల్: అతిగా తినకుండా తనను తాను నియంత్రించుకుంది. ఎక్కువ కేలరీలు తీసుకోకుండా పోర్షన్ కంట్రోల్‌ను అలవాటు చేసుకున్నానని  భారతీ సింగ్  తెలిపింది.  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ ప్రకారం, పోర్షన్ కంట్రోల్ సాధన చేయడం  అధిక బరువును తగ్గించుకోవచ్చు.

ఇదీ చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!

ఖచ్చితమైన మీల్‌ టైమింగ్స్‌ : భోజనం టైమింగ్స్‌ పాటించకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుందనీ, అందుకే తాను తన భోజన సమయాలను పాటించేదానన్ని గుర్తు చేసుకుంది. బాగా హెక్టిక్‌ పనుల్లో ఉంటే,  బాగా లేట్‌ నైట్‌ తినడం వదిలివేసింది.  వేళగాని వేళ తినడాన్ని పూర్తిగా మానేసింది.  మరో విధంగా చెప్పాలంటే రాత్రి 7 గంటల తర్వాత  నో డిన్నర్‌ సూత్రం తు.చ తప్పకుండా పాలించింది. ఇది తన బరువును తగ్గించుకోవడంలో చాలా ఉపయోగపడిందని తెలిపింది.  

15 కిలోల భారీ బరువు తగ్గడం చాలా  ఆనందానిచ్చిందని  భారతీ సింగ్‌కు  సంతోషంగా తెలిపింది. క్రాప్‌ టాప్స్‌, ఇంకా ఇష్టమైన బట్టలు వేసుకోగలగడం భలే సంతోషాన్నిస్తోందని చెప్పింది.

బరువు తగ్గడం స్లిమ్‌గా కనపించడం ఆనందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి అనుభూతిని కలిగిస్తుంది. కష్టంగా కాకుండా, ఇష్టంగా నిష్టగా  కృషి చేస్తే భారతీ సింగ్‌లా మంచి ఫలితాలను సాధించడం కష్టమేమీ  కాదేమో కదా!

ఇదీ చదవండి: TodayRecepies బనానాతో ఇలాంటి వెరైటీలు ఎప్పుడైనా ట్రై చేశారా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement