
కొబ్బరిలో అద్భుతమైన ఆరోగ్యదాయక లక్షణాలున్నాయి. కొబ్బరి ఒక చక్కని ఆహారం. ఆరోగ్యదాయకమైన కొబ్బరి నీరును, అద్భుతమైన నూనెను అందించే గొప్ప పంట. ప్రపంచవ్యాప్తంగా ఎందరికో జీవనో పాధిని అందిస్తుండటం వలన దీన్ని ‘జీవన వృక్షం (ట్రీ ఆఫ్ లైఫ్)’గా పరిగణిస్తారు. కొబ్బరి శాస్త్రీయ నామం కోకోస్ న్యూసిఫెరా ఎల్ (అరేకేసి). కొబ్బరిని ఆహారంగా, ఆథ్యాత్మిక సాధనంగా, పానీయంగా, ఔషధ విలువలున్న నూనెగా ఉపయోగపడుతోంది.
పీచుగా అనేక ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలకు ముడిసరుకుగా ఉపయోగపడుతోంది. 80 కంటే ఎక్కువ దేశాల్లో సుమారు కోటి కుటుంబాలు కొబ్బరిని తమ ప్రాథమిక ఆహారంగా, ఆదాయ వనరుగా ఉపయోగించుకుంటున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా సాగు చేస్తున్న, ఉపయోగించబడే చెట్టుగా మారింది. కొబ్బరి గానుగ నూనెను వంటకు వాడటం ఇటీవల కాలంలో బాగా పెరిగిన నేపథ్యంలో వండర్ ట్రీ ఆఫ్ లైఫ్‌పై స్పెషల్ ఫోకస్...
కొబ్బరి ఆధారిత వ్యవసాయ విధానం తరతరాలుగా అభివృద్ధి చెందిన ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతులకు ప్రసిద్ధ ఉదాహరణ. కొబ్బరి చెట్లు ఇంటి పంటల్లో/తోటల్లో ముఖ్యమైన భాగాలు. ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు నాటుకోవటం అనేక దేశాల్లో సుదీర్ఘ కాలపు సంప్రదాయంగా కనిపిస్తుంది. ఇంటి తోటలలోని కొబ్బరి చెట్లు ఆ కుటుంబానికి జీవనాధార వ్యవస్థగా మారాయి.
ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ఇలా చెబుతోంది: కొబ్బరి తదితర పంటల వైవిధ్యంతో కూడిన ఇంటి/పెరటి పంటలు రైతు కుటుంబం ప్రాథమిక అవసరాలను తీర్చటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆహార భద్రత, ఆదాయ భద్రత, ఉ పాధి భద్రత కల్పిస్తుంది. ప్రతికూల వాతావరణ విపత్తులను తట్టుకునే శక్తిని ఇంటి/పెరటి పంటలు మెరుగుపరుస్తాయి. ఇందుకోసం పెరటి తోటల్లో అనేక పంటలు, పశువులు, కోళ్లు, చేపల పెంపకం కూడా కలిసి ఉంటుంది. 15వ శతాబ్దపు మళయాళ కావ్యం ‘కృషి గీత’లో కేరళలో మధ్యయుగపు పర్యావరణ అనుకూల సాగు వ్యవస్థల ప్రస్తావన ఉంది. కొబ్బరి ఆధారిత వ్యవసాయ వ్యవస్థలను ఇందులో ప్రముఖంగా పేర్కొనటం విశేషం.
కొబ్బరి సేద్యంలో ఉత్తమ వ్యవసాయ పద్ధతులు...
నాణ్యమైన, స్వచ్ఛమైన లేక జన్యు స్వచ్ఛత కలిగిన కొబ్బరి నారు మొక్కల పూర్తి వివరాలు తెలుసుకొని నమ్మ దగ్గ నారు మొక్కలను ఎంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యానశాఖ విభాగం వారి గుర్తింపు పొందిన నర్సరీల నుంచి సేకరించుకొని జాగ్రత్త పడాలి. సంవత్సరం అంతా పండే పంట కాబట్టి నాణ్యత విషయంలో రాజీ పడకుండా నారు మొక్కలను శ్రద్ధగా ముందు జాగ్రత్తతో సేకరించుకొని నాటుకోవాలి. పచ్చి కొబ్బరి బోండం (చౌగాట్ ఆరెంజ్ డ్వార్ఫ్ అంటే నారింజ రంగు గల ΄÷ట్టి రకం) తెగులును తట్టుకునే/తెగులును ఎదుర్కొనే (కల్ప రక్ష, కల్ప శ్రీ కల్ప శంకర) రకాలను, కురిడి కొబ్బరి రకం (లక్షద్వీప్ మైకో) మొదలైనవి మేలు.
నాటేందుకు అనుకూల నేలలు...
కొబ్బరి సాగులో అతి ముఖ్యమైన సూత్రం ఏమిటంటే, వెలుతురు బాగా ప్రసరించాలి. కొబ్బరికి అనుకూలమైన నేలలను ఎంచుకుంటే గాలి, వెలుతురు ప్రసరణ బాగా జరిగి నత్రజనిని, కర్బనాన్ని, ఆక్సిజన్‌ను బాగా గ్రహించి పంటలు బాగా ఎదగడానికి సహకరిస్తుంది. చెట్టు ఆకుల్లో కిరణ జన్య సంయోగ క్రియ సామర్థ్యం పెరగాలంటే ఖాళీ భూముల్లో సాధ్యమైనంత వరకు మొక్క నాటడం ఉత్తమం. కేరళలో ఎక్కువగా కొబ్బరి నారు మొక్కలను వెలుతురు కోసం పెద్ద చెట్ల కింద నాటుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గాలి, వెలుతురు ప్రసరణ సక్రమంగా అందక లేత మొక్కలు చీడ పీడల తాకిడికి తీవ్రంగా గురి అవుతూవుంటాయి. అంతేగాక ఈ చెట్లు పూత పూయడానికి ఎక్కువ కాలాన్ని వెచ్చిస్తాయి కూడా!
కొబ్బరి నారు మొక్కల్ని నీరు సరిగ్గా పారని భూముల్లో నాట కూడదు. ఇలా చేయడం వల్ల ప్రారంభ దశలో పోషకాలు సరిపడక వేర్ల శ్వాసక్రియ సక్రమంగా ఉండదు. ఒక వేళ ఈ పరిస్థితులలో పెరిగినా ఎదుగుదలలో ఆటంకం ఏర్పడి కాయల దిగుబడిలో ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. లేత మొక్కలకు ఎదిగెందుకు తగిన తేమ అవసరం. అదే తరుణంలో పాదులో నీరు నిలచే పరిస్థితిని తట్టుకోలేవు. కొబ్బరి చెట్లు ఎదగడానికి ముందుగానే మంచి వెలుతురు, గాలిలోని మూలకాలు బాగా గ్రహించేందుకు సహకరించే భూసారం అవసరం. అప్పుడే మొక్కలు బాగా ఎదుగుతాయి.
పంటకు కావలసిన భూభౌతిక వనరులు...
నిర్థిష్టమైన నియమం ప్రకారం ఒక సెంటు భూమి(40 చదరపు మీటర్ల)లో ఒకే ఒక్క కొబ్బరి నారు మొక్కను నాటే ఏర్పాటు చేసుకోవాలి. రైతులందరు కొబ్బరి సాగును ఏక పంటగా పెంచేటపుడు అన్ని మొక్కలకు 7.5మీ. “ 7.5 మీ.లు, ΄÷ట్టి రకాల మొక్కలను 7.0మీ గీ 7.0మీ. ల ఖాళీ స్థలం ఉండే విధంగా నాటాలి. పెరటి తోటలలాగా ఎక్కువ పంటలను కలిపి పండించే సమయంలో చెట్లకు గాలి బాగా సోకే విధంగా తక్కువ మొక్కలు నాటాలి. రాజీ పడకూడదు. నాటే సమయంలో తక్కువ స్థలం కేటాయిస్తే గాలి ఆడక చెడు వాసన ప్రబలి చీడపీడలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అంతర పంటలను అనుబంధంగా పండించడం వల్ల చీడపీడల నియంత్రణ బాగా జరుగుతుంది.
తోటలో పక్షులు వాలడానికి పంగ కర్రలు, సన్నని కాడ కలిగినటువంటి పూల మొక్కలను గుంపులుగా పెంచితే చీడపీడల నెదుర్కొనేలా పర్యావరణ రక్షణ సేవలు పొందవచ్చు. కొబ్బరి తోటల్లో కొమ్ము పురుగును నివారించేందుకు కొబ్బరి ఆధారిత వివిధ పంటల సాగు ఏక పంటగా కొబ్బరి చెట్ల సాగుకంటే బాగా అనుకూలంగా ఉన్నట్లు రూఢి అయ్యింది.
పంట రక్షణ...
నారు మొక్కల జీవక్రియ పెంచడానికి, నారు మొక్కలను నాటిన తర్వాత స్యూడోమొనాస్‌ను నాలుగు ఏడు, పది నెలల్లో 50 గ్రా. చొప్పున వేస్తూండాలి. మొక్కల్ని నాటేటప్పుడు 100 గ్రాముల స్యూడోమోనాస్ ΄÷డితో ద్రావణం చేసి వేరు మొక్కలను అందులో ముంచి నాటాలి. నాటిన మొక్కల హద్దుల వెంబడి గ్లైరిసీడియా మొక్కలను పెంచుతూ, వాటి ఆకులను కత్తిరించి మొక్కల పాదులలో మల్చింగ్ వేయడం వల్ల భూసారంలో మేలు చేసే సూక్ష్మజీవులే గాక సేంద్రియ పదార్థం వల్ల భూభౌతికంగా రసాయనికంగా, జీవనసంబంధమైన ఎరువులు వృద్ధి అవుతాయి. సేంద్రియ సూక్ష్మ పోషకాలు కూడా అభివృద్ధి అయి అందుబాటులో ఉంటాయి. సేంద్రియ ఎరువు తయారవుతూండడం వల్ల పంటలకు పోషకాలు (బయో ఎంజైములు) చెట్ల ఎదుగుదలకు బాగా అనుకూలిస్తాయి. బాగా మగ్గిన వర్మికంపోస్టు (10గ్రా. ఒక చెట్టుకు) లేక పశువుల ఎరువు (ఒక కిలో / చెట్టుకు) వేప చెక్క (2కిలోలు / చెట్టుకు) (ట్రైకోడెర్మా కలిపి (250 గ్రా/ చెట్టుకు) లేత కొబ్బరి మొక్కకు నాటిన తొలి దశలో ఎరువుగా ఉపయోగించుకోవాలి.
జీవవ్యర్థాల పునరుత్పత్తి వినియోగం...
ఏప్రిల్ – మే, సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో జనుము, జీలుగ పంటల ఆకులను పచ్చి రొట్ట ఎరువుగా చెట్టుకు 100 గ్రాములు పాదులలో వేసినట్లయితే వాతావరణ సంబంధ నత్రజని మాత్రమే గాక కాల్షియం: నత్రజని నిష్పత్తి కూడా బాగా వృద్ధి అవుతుంది. పచ్చి రొట్ట ఎరువును వేయడం వల్ల భూమి లోపలి ΄÷రలలోకి గాలి పుష్కలంగా ప్రవహించేందుకు దోహదం చేస్తుంది. వేరు వ్యవస్థ బాగా వృద్ధి అవడం, తేమ కొరత ఉన్నా కూడా మొక్కలు నిలదొక్కుకుని పెరగడం గమనించవచ్చు.
చెట్లకు నీటి పారుదల చాలా క్లిష్టమైన అంశం వేసవి కాలంలో తేమ కొరతను నివారించేందుకు చెట్టుకు 200 లీటర్ల నీటిని వారానికి ఒక్కసారి అందివ్వడం అతి ముఖ్యమైన విషయం. అత్యధిక ఉత్పత్తిని సాధించేందుకు బిందు సేద్యం అందిస్తూ వినియోగించ వలసిన నీటిని పూర్తిగా ఉపయోగించడం అన్నది మరొక విధానం. వర్షాకాలంలో కూడా తగిన విధంగా నీరు ఇవ్వాలి. కోస్తా తీరంలో సముద్రజలాల పారుదలకు వీలున్నప్పుడు 500ల గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో నాణ్యమైన వేప చెక్కను, పచ్చి రొట్ట ఎరువుగా పచ్చని ఆకులను చేర్చి వేసుకోవాలి.
కొబ్బరి తోటల అభివృద్ధికో పథకం
కొబ్బరి ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల కోసం రైతులకు కొబ్బరి అభివృద్ధి బోర్డు సహాయం
దరఖాస్తుకు చివరి తేదీ జూలై 31
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే సాగులో ఉన్న కొబ్బరి తోటల్లో అంతర పంటల సాగు ద్వారా ఉత్పాదకతను పెంపొందించటం కోసం కొబ్బరి బోర్డు 2025–26 సంవత్సరానికి గాను రైతులు, రైతు బృందాలు, ఉత్పత్తిదారుల సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కొబ్బరి ఆధారిత పంటల వ్యవస్థ ద్వారా ఉత్పాదకత మెరుగుదలకు క్లస్టర్ ప్రాతిపదికన, బోర్డు నియమ నిబంధనలకు లోబడి రైతు భాగస్వామ్య విధానం ద్వారా ప్రస్తుత తోటల్లో ఉత్పత్తి, ఉత్పాదకతలను మెరుగుపరచడానికి కొబ్బరి బోర్డు ఆర్థిక సహాయం అందిస్తుంది. సూచించిన ఫార్మాట్‌లో దరఖాస్తులు / ప్రతి పాదన లు ఈ నెల 31 లోగా పం పాలి.
కీలకమైన ఉత్పాదకాలు, అంతర పంటలు నాటడం, సామగ్రి, పచ్చి ఎరువు విత్తనాలు, మొక్కల రక్షణ రసాయనాలు మొదలైన వాటి ఖర్చులకు బోర్డు సహాయం వరుసగా రెండు సంవత్సరాలు అందించనుంది. కూలీల ఖర్చులు, ఇతర అద్దె సేవలు, మౌలిక సదు పాయాల అభివృద్ధి మొదలైన వాటికి ఈ పథకం వర్తించదు. ఆసక్తిగల రైతు బృందాలు 2025–07–31 ఉదయం 10.30 గంటల్లోగా అవసరమైన పత్రాలతో పాటు సూచించిన ఫార్మాట్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతులు దరఖాస్తులను స్వయంగా లేదా పోస్టు ద్వారా ఇవ్వాల్సిన చిరునామా: డిప్యూటీ డైరెక్టర్, కొబ్బరి అభివృద్ధి బోర్డు, రాష్ట్ర కార్యాలయం, డోర్ నంబర్ 54–14/5–18ఎ, రోడ్ నెం.11, భారతి నగర్, నోవోటెల్ దగ్గర, రింగ్ రోడ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా – 520008.
పోషకాలమయం కొబ్బరి నూనె!
కొబ్బరి నూనెను తల నూనెగానే చాలా మంది ఉపయోగిస్తుంటారు. కానీ, పోషకాల నిలయమైన కొబ్బరి నూనెను వంటకు ఉపయోగించవచ్చు. మనుషుల ఆయుప్రమాణం ఎక్కువగా ఉండే కేరళ రాష్ట్రంలో వంటకు కొబ్బరి నూనెనే విరివిగా ఉపయోగిస్తారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు సమాచారం ప్రకారం.. ఈ నూనెలోని పోషకాలు, వంటకు ఉపయోగించే విధానాల గురించి తెలు సుకుందాం.
ఆరోగ్యపరమైన ప్రయోజనాలు
కొబ్బరి నూనె జీర్ణశక్తిని పెంచి వ్యాధులు, ఇన్ఫెక్ష న్లకు గురికాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ఇందులోని శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు హాని కలిగిస్తాయనుకుంటారు. కానీ అది నిజం కాదు. శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు మేలు చేస్తాయి. దీన్లోని లారిక్ యాసిడ్ కొలెస్ట్రాల్.. రక్తపోటు వల్ల గుండెకు హాని కలగకుండా రక్షణనిస్తుంది
కొబ్బరి నూనెలోని షార్ట్ అండ్ మీడియం చైన్ ఫ్యాటీ ఆమ్లాలు శరీర అధిక బరువును తగ్గిస్తాయి. అలాగే కొబ్బరినూనె వాడటం వల్ల ΄÷ట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా ఉంటుంది
కొబ్బరినూనె వాడకం వల్ల థైరాయిడ్ ఇతర ఎండోక్రైన్ గ్రంథులు సక్రమంగా పనిచేస్తాయి
శరీర మెటబాలిక్ రేటును పెంచుతుంది. ఫలితంగా శరీర బరువు అదుపులో ఉంటుంది
ఈ నూనెలో ఉండే యాంటీమైక్రోబియల్ లిపిడ్స్, లారిక్ యాసిడ్, కాప్రిలిక్ యాసిడ్లు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాల్ని కలిగి ఉంటాయి. కాబట్టి కొబ్బరి నూనె వాడకం వల్ల సంబంధిత వ్యాధులు దరి చేరవు
కిడ్నీలో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి కూడా కొబ్బరి నూనెకు ఉంది.
కొబ్బరి నూనెను వంటల్లో ఇలా వాడాలి
కొబ్బరి నూనె స్మోకింగ్ పాయింట్ 350 ఫారిన్‌హీట్ కాబట్టి ఈ నూనెను అన్ని రకాల వంటలకూ వాడొచ్చు
కేకు వంటి వంటకాల్లో వెన్నకు బదులుగా కొబ్బరి నూనెను ఉపయోగించొచ్చు
అలాంటప్పుడు వెన్న పరిమాణంలో 25% తక్కువ కొబ్బరి నూనె వాడాలి
పాప్‌కార్న్ తయారీకి కొబ్బరినూనెను వాడొచ్చు
వర్జిన్ కోకోనట్ ఆయిల్ వెన్నలా ఉంటుంది. దీన్ని బటర్ మాదిరిగా బ్రెడ్ మీద పూసుకొని తినొచ్చు
స్మూదీస్, సూప్స్, సాసుల్లో కలుపుకోవచ్చు
ఈ నూనెతో అన్ని రకాల కూరగాయల వేపుళ్లు వండుకోవచ్చు
పప్పు తాలింపులో వాడొచ్చు.
ఆధారం: భారత ప్రభుత్వ సంస్థ ‘కొబ్బరి అభివృద్ధి బోర్డు’.