పోషకాల పాలకూర పచ్చడి : ఇలా చేస్తే టేస్ట్‌ అదుర్స్‌ | How to make palak or spinachchutney check recipe | Sakshi
Sakshi News home page

పోషకాల పాలకూర పచ్చడి : ఇలా చేస్తే టేస్ట్‌ అదుర్స్‌

Jan 31 2025 3:28 PM | Updated on Jan 31 2025 3:28 PM

How to make palak or spinachchutney check recipe

Palakura Pachadi : శ్రేష్టమైన ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరతో, పాలకూర పప్పు, పాలకూర  ఆలూ, పాలక్‌ పనీర్‌ .. ఇలా రకరకాల  వంటలను చేసుకుంటాం. అలాగే పాలకూర పచ్చడి కూడా చేసుకోవచ్చు. గోంగూర పచ్చడి లాగానే పాలకూరను కూడా రుచికరంగా తయారు చేసుకోవచ్చు. పాలకూర  ఎలా  చేసుకోవాలో చూద్దామా.

పాలకూరతో   బీపీ, మధుమేహం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.  బీపీ అదుపులో ఉంటుందని భావిస్తారు.పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే తో పాటుగా క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, తక్కువ క్యాలరీలు ఉంటాయి. పాలకూరను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. 

కావలసిన పదార్థాలు
పాలకూర ఒక కప్పు,  కొంచెం శుభ్రం చేసుకున్న చింతపండు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ కొద్దిగా నూనె, రుచికి సరిపడినంత ఉప్పు , చిటికెడు పసుపు, ఇంగువ, నాలుగైదు ఎండుమిచ్చి,ధనియాలు-ఒక స్పూను 
పోపు కోసం: పప్పులు,ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ(ఆప్షనల్‌) జీలకర్ర, ఆవాలు,

తయారీ
పాలకూరను శుభ్రంగా రెండుమూడుసార్లు బాగా కడగాలి. ఇసుక, మట్టి శుభ్రంగా పోయాయని నిర్ధారించుకున్నాక  సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. చూసుకోవాలి.

స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి, ఎండుమిర్చి వేయించాలి. ఇందులోనే  కొద్దిగా ధనియాలు, మెంతులు కూడా బాగా వేగనివ్వాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే కళాయిలో పాలకూరను వేసి మెత్తగా ఉడికించుకోవాలి.  ఉత్తినే మగ్గిపోతుంది. అవసరం పడితే కొద్దిగా నూనె వేసుకోవచ్చు.  పాలకూర బాగా దగ్గరికి వచ్చాక, చింతపండును కూడా వేయాలి.  బాగా ఉడికేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులోనే  చిటికెపు పసుపు వేయాలి. ఆతరువాత శుభ్రంగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిరెబ్బల్ని కూడా (ఇష్టంలేనివారు మానివేసి నువ్వులను  చిటచిటపలాడేలూ వేయించి కలుపుకోవచ్చు) వేసి, ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు మినప్పప్పు మెంతులు ఎండుమిర్చి, పచ్చి ఉల్లిపాయ వేసి  మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా మెత్తగా అయ్యాక ఉడికించిన  పాలకూరను కూడా మరోసారి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఉప్పు,పులుపు కారం సరిపోయిందోఒకసారి చెక్‌ చేసుకోవాలి.

ఇపుడు కాస్త మినపప్పు,శనగపప్పు,ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకులు వేసి వేయించి  చివర్లో కాస్త  ఇంగువ కూడా వేసి పోపు పెట్టుకోవాలి. అంతే ఘుమఘుమలాడే పాలకూర చట్నీ రెడీ. 

వేడి వేడి అన్నంలో గానీ, రోటీ, చపాతీలో టేస్టీటేస్టీగా తినవచ్చు. దోశ, ఇడ్లీల్లో కూడా  చట్నీలా వాడుకోవచ్చు. ఒకసారి చేసుకుంటే రెండు రోజుల వరకు తాజాగా ఉంటుంది.

పాలకూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.  రక్తం శుద్ధి అవుతుంది గుండె జబ్బులు కూడా రాకుండా అడ్డుకుంటాయి. మహిళలు పాలకూరను తరచూ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. అలాగే ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయ క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి కూడా పాలకూరకు ఉందని చెబుతారు. అధిక బరువు ఉన్నవారు పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వారు బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement