వాషింగ్టన్: పాలక్ పనీర్ వాసనతో ప్రారంభమైన వివాదంలో భారతీయ దంపతులు అమెరికా జిల్లా కోర్టులో రూ.1.8 కోట్ల నష్ట పరిహారం గెలుచుకున్నారు.
2023లో ఉన్నత చదువుల కోసం ఆదిత్య ప్రకాష్ అమెరికా వెళ్లాడు. అక్కడ కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీలో ఆంత్రపాలజీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. యూనివర్సిటీలో చేరిన ఏడాది తర్వాత అయితే, ఓ రోజు యూనివర్సిటీలో ఉన్న ఆదిత్యకు బాగా ఆకలివేసింది. వెంటనే డిపార్ట్‌మెంట్‌లో మైక్రోవేవ్‌లో తన పాలక్ పనీర్ భోజనాన్ని వేడి చేసి తినేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఓ మహిళా సిబ్బంది అతని వద్దకు వచ్చింది. మైక్రోవేవ్‌లో పాలక్ పనీర్ వేడిచేస్తుంటే వాసన వస్తుందని ఫిర్యాదు చేసింది. పాలక్ పన్నీర్‌ను వేడి చేసేందుకు మైక్రోవేవ్‌ను ఉపయోగించవద్దని సూచించింది.
ఆమెకు మద్దతుగా పలువురు ప్రొఫెసర్లు సైతం నిలిచారు. వేడి చేయడం వల్ల వాసన వస్తుందనే కారణంతో బ్రోకలీని నిషేధించారు అని ఫ్రొఫెసర్ ప్రస్తావించగా.. దీనికి ప్రకాష్ ప్రతిస్పందిస్తూ..‘సందర్భం ముఖ్యం. బ్రోకలీ తింటే జాత్యాంహాకారాన్ని ఎదుర్కొంటారు? అని ప్రశ్నించారు.
ఆ ఘటన చిలికి చిలికి గాలి వానలా మారింది. పాలక్ పనీర్ వివాదం తర్వాత ప్రకాష్‌ను మీటింగ్స్ పేరుతో వేధిస్తున్నారు. అదే యూనివర్సిటీలో అసిస్టెంట్ టీచింగ్ స్టాఫ్‌లో విధులు నిర్వహిస్తున్న అతని భర్య ఉర్మీ భట్టాచార్యను వివరణ ఇవ్వకుండానే విధుల నుంచి తొలగించారు. విద్యార్థులు తమ పీహెచ్‌డీలో భాగంగా పొందే మాస్టర్స్ డిగ్రీలను ఇవ్వకుండా యూనివర్సిటీ నిరాకరించింది.
దీంతో ప్రకాష్,ఉర్మీభట్టాచార్యలు కొలరాడో జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూనివర్సిటీ తమ విద్యాహక్కుల్ని అడ్డుకుందని, యూనివర్సిటీ మా పట్ల వివక్షత చూపించారు. చదువులో ఆటంకం కలిగించిందని వాపోయారు. విచారణ చేపట్టిన కోర్టు తాజాగా,వారికి మద్దతుగా నిలిచింది. గతేడాది సెప్టెంబర్‌లో కేసు పరిష్కరించేందుకు 2లక్షల డాలర్ల (రూ.1.8 కోట్లు) పరిహారం చెల్లించింది. నిలిపివేసిన మాస్టర్స్ డిగ్రీలను వారికి మంజూరు చేసింది.అయితే, భవిష్యత్తులో ఆ విశ్వవిద్యాలయంలో చదువు లేదా ఉద్యోగం చేసే అవకాశాన్ని వారికి నిరాకరించింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై ఉర్మీ భట్టాచార్య తన ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. ఈ సంవత్సరం నేను ఒక పోరాటం చేశాను. నేను తినాలనుకున్న ఆహారం తినేందుకు స్వేచ్ఛ.నిరసన తెలిపే హక్కు కోసం… నా చర్మరంగు, నా జాతి, నా మారని భారతీయ యాస ఏదైనా ఉన్నా, నేను పోరాడాను’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది.


