
వేపను మానవాళికి ఒక వరంలా భావిస్తారు. ఆయుర్వేదం అయితే అనేక రకాల వ్యాధులకు వేప వాడకాన్ని సిఫార్సు చేసింది. వేపపై జరిపిన శాస్త్రీయ పరిశోధనలు దీనిని ఒక సర్వరోగ నివారిణిగా నిరూపిస్తాయి. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీహెల్మింటిక్, యాంటీవైరల్, క్యాన్సర్ నిరోధకతలోనూ, ముఖ్యంగా వ్యాధి నిరోధకత పెంపులోనూ వేపను ప్రముఖంగా పరిగణిస్తారు. వేపలో మొటిమలను, చర్మంపై పడే మచ్చలను
తగ్గించడంలో సహాయపడే లక్షణాలుంటాయి.
చర్మ సంరక్షకి
వేపలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది, ఇది దెబ్బతిన్న చర్మ కణాలను మరమ్మతు చేయడంలో సహాయపడుతుంది. అందుకే చికెన్ పాక్స్ వంటి వ్యాధులకు వాడే మందుల తయారీలో వేపను ఉపయోగిస్తారు. పెద్దవాళ్లు అమ్మవారు పోసిన వారికి వేపాకులను నూరి ముద్దగా చేసి అందులో పసుపు వేసి వళ్లంతా పట్టిస్తారు.
ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో...వేపశాస్త్రీయంగా నిరూపించబడిన యాంటీ ఫంగల్ గుణం, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.
విషాలకు విరుగుడు: వేప ఆకులు లేదా పొడిని తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, కాలేయం ఉత్తేజిత మవుతాయి, జీవక్రియల వేగం అంటే మెటబాలిజం పెరుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన విషాలు తొలగు తాయి. బాహ్యంగా, వేప స్క్రబ్‌లు లేదా పేస్ట్‌ను మీ చర్మం నుండి క్రిములు, బ్యాక్టీరియా, ధూళి మొదలైన వాటిని తొలగించడానికి ఉపయోగించవచ్చు,
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: వేప దాని యాంటీమైక్రోబియల్, యాంటీ బాక్టీరియల్ ప్రభావాలకు ప్రసిద్ధి చెందింది. ఈ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో భారీ పాత్ర పోషిస్తాయి.
కీటకాలు, దోమల వినాశిని..: కీటకాలను నివారించడానికి మీరు కొన్ని వేప ఆకులను కాల్చవచ్చు. వేపాకుల పగ వివిధ రకాల దోమలను తరిమి కొట్టడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. మలేరియా నివారణకు వాడే ఔషధాల తయారీలో కూడా వేపను విరివిగా ఉపయోగిస్తారు.
రకరకాల వ్యాధుల నివారణలో: వేపలోని శోథ నిరోధక లక్షణాలు జీర్ణశయంలోని ప్రేగువాపును తగ్గించడంలో సహాయపడతాయి, ఇది మలబద్ధకం, కడుపులో పుండ్లు, గ్యాస్, మొదలైన వ్యాధులని తగ్గించడంలో సహాయపడుతుంది.వేప ఆకులు క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటాయి, అందుకే దీనిని గాయాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
చదవండి: పండగవేళ దివ్యమైన కానుకలు : టాప్ ఐడియాలివిగో!
చుండ్రును తగ్గిస్తుంది: వేపను షాంపూలు, కండిషనర్లలో విస్తృతంగా ఉపయోగిస్తారు. అజాడిరక్తా ఇండికాలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి చుండ్రును తొలగించడంలో సహాయ పడతాయి. మీ జుట్టు కుదుళ్లను దృఢపరుస్తాయి.