ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్‌రూట్, చర్మం ప్రకాశవంతంగా మారడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని హైడ్రేట్ చేసి, మృదువుగా, నిగారింపుగా ఉంచుతాయి. ఇంట్లోనే తక్కువ సమయంతో తయారు చేసుకునే బీట్‌రూట్ ఫేస్ మాస్క్‌లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
బీట్‌రూట్ ముక్కలను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. వడకట్టి తీసిన రసంలో రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్, టీ స్పూన్ నిమ్మరసం కలపండి. దీనిలో కాటన్ బాల్‌ను ముంచాలి. దాంతో బీట్‌రూట్ రసాన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మురికి తొలగిపోతుంది. నిమ్మరసం వల్ల ముఖంపై ఉండే మచ్చలు తగ్గుతాయి. రోజ్ వాటర్ చర్మానికి సహజసిద్ధమైన తేమను అందిస్తుంది.
అలోవెరా జెల్‌తో... బీట్‌రూట్ రసం తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మురికి, మచ్చలు తొలగియి చర్మం ఆరోగ్యంగా... అందంగా నిగనిగలాడుతుంది.
(చదవండి: మానికా విశ్వకర్మకు అప్పుడు సుష్మితాను అడిగిన అదే ప్రశ్న..! స్త్రీగా ఉండటం అంటే అదే..)


