breaking news
Beetroots
-
బీట్రూట్ మాస్క్‌తో మచ్చలేని అందం
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్రూట్, చర్మం ప్రకాశవంతంగా మారడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. బీట్రూట్లో ఉండే విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని హైడ్రేట్ చేసి, మృదువుగా, నిగారింపుగా ఉంచుతాయి. ఇంట్లోనే తక్కువ సమయంతో తయారు చేసుకునే బీట్రూట్ ఫేస్ మాస్క్‌లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..బీట్రూట్ ముక్కలను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. వడకట్టి తీసిన రసంలో రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్, టీ స్పూన్ నిమ్మరసం కలపండి. దీనిలో కాటన్ బాల్‌ను ముంచాలి. దాంతో బీట్రూట్ రసాన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మురికి తొలగిపోతుంది. నిమ్మరసం వల్ల ముఖంపై ఉండే మచ్చలు తగ్గుతాయి. రోజ్ వాటర్ చర్మానికి సహజసిద్ధమైన తేమను అందిస్తుంది. అలోవెరా జెల్‌తో... బీట్రూట్ రసం తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మురికి, మచ్చలు తొలగియి చర్మం ఆరోగ్యంగా... అందంగా నిగనిగలాడుతుంది.(చదవండి: మానికా విశ్వకర్మకు అప్పుడు సుష్మితాను అడిగిన అదే ప్రశ్న..! స్త్రీగా ఉండటం అంటే అదే..) -
బీట్రూట్తో హెల్తీగా చీజ్ కేక్.. టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు
బీట్రూట్ చీజ్ కేక్ తయారీకి కావల్సినవి: వాల్నట్స్ – 150 గ్రాములు ఎండు అంజీరాలు – 8, దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్ ఉప్పు – చిటికెడు, బీట్రూట్ తురుము – 300 గ్రాములు కోకోనట్ చీజ్ – 200 గ్రాములు కోకో పౌడర్, కొబ్బరి నూనె, నెయ్యి, మేపుల్ సిరప్ (మార్కెట్లో దొరుకుతుంది) – 4 టేబుల్ స్పూన్ల చొప్పున బాదం పాలు – 2 టేబుల్ స్పూన్లు, పిస్తా పొడి – 3 టేబుల్ స్పూన్లు తయారీ విధానమిలా: ముందుగా వాల్నట్స్ని మిక్సీ పట్టుకోవాలి. అందులో ఎండు అంజీరాలు, దాల్చిన చెక్క పొడి, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని.. నెయ్యి కలిపి, పక్కన పెట్టుకోవాలి. అనంతరం బీట్ రూట్ తురుము, కోకోనట్ చీజ్, బాదం పాలు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల మేపుల్ సిరప్ వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కేక్ ట్రేలో ముందు వాల్నట్ మిశ్రమాన్ని .. దానిపైన బీట్రూట్ మిశ్రమాన్ని పరచి.. కాస్త ఆరి, గట్టిపడిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు.. మిగిలిన కోకో పౌడర్, కొబ్బరి నూనె, మేపుల్ సిరప్ వేసుకుని బాగా కలిపి.. కోన్ మాదిరి కవర్లో చుట్టి.. నచ్చిన డిజైన్‌లో కేక్ ముక్కలపై గార్నిష్ చేసుకుని.. వాటిపై పిస్తా పొడిని జల్లుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
సమ్మర్ డ్రింక్
బీట్రూట్ జింజర్ జ్యూస్ కావలసిన పదార్థాలు: బీట్రూట్స్ - 2 అల్లం ముక్కలు - పావుకప్పు నీళ్లు - 1 కప్పు తేనె - 2 చెంచాలు నిమ్మరసం - అరచెంచా తయారీ విధానం: బీట్రూట్స్ని చెక్కు తీసి, శుభ్రంగా కడిగి, ముక్కలుగా కోసుకోవాలి; తర్వాత ఈ ముక్కల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి; కొంచెం మెత్తబడ్డాక అల్లం ముక్కలు కూడా వేసి మరి కాసేపు బ్లెండ్ చేయాలి; బాగా పేస్ట్‌లా అయ్యాక నీరుపోసి ఓ ఐదు నిమిషాల పాటు బ్లెండ్ చేసి తీసేయాలి; చివరగా గ్లాసుల్లో పోసి... తేనె నిమ్మరసం కలిపి, ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. వేసవిలో ఈ జ్యూస్ దాహార్తిని తీర్చడమే కాక శక్తిని కూడా ఇస్తుంది.


