బీట్‌రూట్‌తో హెల్తీగా చీజ్‌ కేక్‌.. టేస్ట్‌ చేస్తే అస్సలు వదిలిపెట్టరు | How To Make Beetroot Cheese Cake Recipe In Telugu | Sakshi
Sakshi News home page

Beetroot Cheese Cake: బీట్‌రూట్‌తో హెల్తీగా చీజ్‌ కేక్‌.. టేస్ట్‌ చేస్తే అస్సలు వదిలిపెట్టరు

Sep 25 2023 4:54 PM | Updated on Sep 25 2023 5:14 PM

How To Make Beetroot Cheese Cake Recipe In Telugu - Sakshi

బీట్‌రూట్‌ చీజ్‌ కేక్‌ తయారీకి కావల్సినవి:
వాల్‌నట్స్‌ – 150 గ్రాములు
ఎండు అంజీరాలు – 8, దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్‌ 
ఉప్పు – చిటికెడు, బీట్‌రూట్‌ తురుము – 300 గ్రాములు
కోకోనట్‌ చీజ్‌ – 200 గ్రాములు
కోకో పౌడర్, కొబ్బరి నూనె, నెయ్యి, మేపుల్‌ సిరప్‌ (మార్కెట్‌లో దొరుకుతుంది) – 4 టేబుల్‌ స్పూన్ల చొప్పున
బాదం పాలు – 2 టేబుల్‌ స్పూన్లు, పిస్తా పొడి – 3 టేబుల్‌ స్పూన్లు



తయారీ విధానమిలా:
ముందుగా వాల్‌నట్స్‌ని మిక్సీ పట్టుకోవాలి. అందులో ఎండు అంజీరాలు, దాల్చిన చెక్క పొడి, 2 టేబుల్‌ స్పూన్ల కోకో పౌడర్‌ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని.. నెయ్యి కలిపి, పక్కన పెట్టుకోవాలి. అనంతరం బీట్‌ రూట్‌ తురుము, కోకోనట్‌ చీజ్, బాదం పాలు, 2 టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్‌ స్పూన్ల మేపుల్‌ సిరప్‌ వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి.

తర్వాత ఒక కేక్‌ ట్రేలో ముందు వాల్‌నట్‌ మిశ్రమాన్ని .. దానిపైన బీట్‌రూట్‌ మిశ్రమాన్ని పరచి.. కాస్త ఆరి, గట్టిపడిన తర్వాత ముక్కలుగా కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి. సర్వ్‌ చేసుకునే ముందు.. మిగిలిన కోకో పౌడర్, కొబ్బరి నూనె, మేపుల్‌ సిరప్‌ వేసుకుని బాగా కలిపి.. కోన్‌ మాదిరి కవర్‌లో చుట్టి.. నచ్చిన డిజైన్‌లో కేక్‌ ముక్కలపై 
గార్నిష్‌ చేసుకుని.. వాటిపై పిస్తా పొడిని జల్లుకుని సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement