Yoga సంకల్ప శక్తి, స్వీయ–క్రమశిక్షణ కావాలంటే.. | Powerful Trataka Meditation Ancient Technique and its benefits | Sakshi
Sakshi News home page

Yoga సంకల్ప శక్తి, స్వీయ–క్రమశిక్షణ కావాలంటే..

Jun 28 2025 9:58 AM | Updated on Jun 28 2025 10:04 AM

Powerful Trataka Meditation Ancient Technique and its benefits

ముఖం కడుక్కోవడం, బ్రష్‌ చేసుకోవడం, స్నానం చేయడం మొదలైనవన్నీ పై శరీరాన్ని శుభ్రపరిచే క్రియలైతే యోగక్రియలు అంతర్గత అవయవాలనీ శుభ్రపరుస్తాయి. వాటిలో అతి ముఖ్యమైనది త్రాటక. యోగాసనాలు వేయడం పూర్తయ్యాక త్రాటక క్రియ సాధన చేస్తే శరీరం ప్రశాంతంగా మారుతుంది. మనసుకు శరీరానికి మధ్య శక్తివంతమైన వంతెనను సృష్టిస్తుంది. బరువు నియంత్రణలో ఉండటానికి కూడా ఈ సాధన ఉపయోగపడుతుంది. 

సాధన చేయడమూ సులువే... 
సౌకర్యవంతమైన ప్లేస్‌లో కూర్చోవాలి. ఎదురుగా టీ పాయ్‌లాంటి చిన్న టేబుల్‌పైన వెలుగుతున్న కొవ్వొత్తిని ఉంచాలి. విశ్రాంతిగా కూర్చొని, ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ దీపకాంతిని చూస్తూ ఉండాలి. రోజూ కొంత సమయం ఈ క్రియను సాధన చేస్తూ ఉండాలి. 

ఇదీ చదవండి: వెయిట్‌లాస్‌ జర్నీలో ఆహారానిదే కీలక పాత్ర

ఈ అభ్యాసం వల్ల...
కంటి కండరాలను బలపరచడంతో పాటు చూపును మెరుగుపరుస్తుంది. భావోద్వేగ స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి నిర్వహణకు ఒక విలువైన సాధనంగా పనిచేస్తుంది. కన్నీటి గ్రంథులను శుభ్రపరుస్తుంది. కళ్ళు ప్రకాశవంతం అవుతాయి. కంటిచూపు  సామర్థ్యాన్ని బలపరుస్తుంది. నాడీ వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. నిద్రలేమి, నిరాశపూరితమైన ఆలోచనలు తగ్గి΄ోతాయి. ఓర్పు, సహన సామర్థ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. 

మెరుగైన శక్తి
దృష్టిని మెరుగుపరచడం ద్వారా జ్ఞాపకశక్తికి కూడా దోహదపడుతుంది. నిలకడగా చూడటం అనే అభ్యాసం మనసుపై ప్రశాంత ప్రభావాన్ని చూపుతుంది. మనసును శాంతపరచడం వల్ల భావోద్వేగ స్థిరత్వం లభిస్తుంది. నిద్ర పట్టని వారికి ఇది మేలైన ఔషధం అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎక్కువసేపు స్క్రీన్‌ లను చూస్తూ గడిపే వారికి, ఈ అభ్యాసం కంటి ఒత్తిడి, అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ అభ్యాసం సంకల్ప శక్తి, స్వీయ–క్రమశిక్షణను పెంపొందించడంలో సహాయ పడుతుంది. 
– ఎన్‌.ఆర్‌. 

Advertisement
 
Advertisement
Advertisement