వెయిట్‌లాస్‌ జర్నీలో ఆహారానిదే కీలక పాత్ర | food is crucial in a weight loss journey | Sakshi
Sakshi News home page

వెయిట్‌లాస్‌ జర్నీలో ఆహారానిదే కీలక పాత్ర

Jun 28 2025 9:33 AM | Updated on Jun 28 2025 11:36 AM

food is crucial in a weight loss journey

బరువు తగ్గడానికి అయినా పెరగడానికి అయినా వ్యాయామాలపాత్ర 20 శాతం ఉంటే, ఆహారంపాత్ర 80 శాతం ఉంటుంది. సాధారణ మనిషికి రోజుకు 2,200 క్యాలరిస్‌ అవసరం. బరువు తగ్గాలి అనుకునే వారు క్యాలరీ లోటులో ఉండాలి. మన శరీరం 2,200 కావాలి అంటే, ఒక 5 – 10 శాతం ఆహార క్యాలరీ లోటు తో మొదలుపెట్టాలి. అంటే రోజుకు 2000 క్యాలోరీలు ఇచ్చే ఆహారం తీసుకోవాలి. అది కూడా ఆరోగ్యకరమైన ఆహారం. కూరగాయలు, పళ్ళు, మాంసకృత్తులు, ఓట్స్‌ లాంటివి.

ఉదాహరణకు కేజీ బరువు తగ్గాలి అంటే దాదాపు 7500 క్యాలరీలు కరిగించాలి. అంటే ఈ విధంగా చేస్తూ ఉంటే, 3 వారాలకు ఒక కేజీ తగ్గుతారు అన్నమాట. నెమ్మదిగా తగ్గినా ఆరోగ్యంగా తగ్గుతారు ఈ విధంగా. కానీ ఒక మనిషిలో ఎదుటి వాళ్ళు గుర్తించగలిగే మార్పు రావాలి అంటే ఒక 3 కేజీలు అయినా తగ్గాలి. అలా తగ్గడానికి కనీసం 2 నెలలు పడుతుంది.

ఇదీ చదవండి: Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు

Advertisement
 
Advertisement
Advertisement