
చాక్లెట్ ప్రియులకు పండగే పండగ!
World Chocolate Day 2025: ప్రతీ సంవత్సరం జూలై 7న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ఉద్దేశం.
ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ ప్రియులు ప్రపంచ చాక్లెట్ దినోత్సవం కోసం ఎదురు చూస్తారు. చిన్న చాక్లెట్ బార్ నుండి ఫ్యాన్సీ డెజర్ట్‌ల వరకు ప్రతి రూపంలో చాక్లెట్‌ను ఆస్వాదించాలని ఆరాట పడతారు. 1550, జూలై 7న ఐరోపాలో మొదటిసారిగా చాక్లెట్ తయారయిందట. దీనికి గుర్తుగానే తొలిసారిగా 2009, జూలై 7న ప్రపంచ చాక్లెట్ దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి అదే ఆనవాయితీగా వస్తోంది. అయితే చాక్లెట్ దినోత్సవం ఒక్కో దేశంలో ఒక్కో రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారని మీకు తెలుసా?
చాక్లెట్ దినోత్సవం తేదీ దేశాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. పశ్చిమ ఆఫ్రికాలోనే కోకో వంటి సంస్థల రెండవ అతిపెద్ద ఉత్పత్తి దేశమైన ఘనాలో ఫిబ్రవరి 14న చాక్లెట్ దినోత్సవం జరుపుకుంటారు. అలాగే లాట్వియాలో జూలై 11న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. జనవరి 10న బిట్టర్‌స్వీట్ చాక్లెట్, జూలై 28న మిల్క్ చాక్లెట్, సెప్టెంబరు 22న వైట్ చాక్లెట్, డిసెంబరు 16న చాక్లెట్ కవర్డ్ వంటి దినోత్సవాలు జరుపుకుంటారు.
చాక్లెట్ ఒక ఎమోషన్
యూరోపియన్లు అమెరికాను కనుగొన్న తర్వాత, చాక్లెట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సందర్భంలోనే ఒక ఎమోషన్‌లాగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహంలేదు. ప్రతిరోజూ ఆనందించే ఒక స్వీట్ నథింగ్‌గా ఆదరణ పొందింది.
మెదడు పనితీరును మెరుగు పరచడంతోపాటు, చాక్లెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలున్నాయి. చాక్లెట్‌లో అధిక కొవ్వు , చక్కెర కంటెంట్ ఉండటం వల్ల చాలా ఒత్తిడికి చెక్ చెబుతుందట. గుండె జబ్బులు , స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఇటీవల కొన్ని అధ్యయనాలు తెలిపాయి.చాక్లెట్‌లో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని, చాక్లెట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలదని ,జ్ఞాపకశక్తి క్షీణతను నిరోధించవచ్చని సూచించాయి . అయితే మరింత అధ్యయనం జరగాల్సి ఉందని స్పష్టం చేశాయి.
డార్క్ చాక్లెట్
కొకోవా కంటెంట్ ఎక్కువగా ఉన్న డార్క్ చాక్లెట్ సాధారణంగా తక్కువ చక్కెర కంటెంట్ , అధిక యాంటీఆక్సిడెంట్ స్థాయిల కారణంగా ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ పుష్కలంగా ఉండే డార్క్ చాక్లెట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది, ముఖ్యంగా ఫ్లేవనాల్స్, ఇది హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మెదడు పనితీరును, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలు రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడతాయి. చర్మ రక్షణను కూడా అందిస్తుంది. వయస్సు సంబంధిత మతిమరుపునుంచి రక్షణ కల్పింస్తుంది.
నోట్: చాక్లెట్ తినడం మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది మొటిమలు, ఊబకాయం,మధుమేహం, కరోనరీ హార్ట్ డిసీజ్ , హైపర్‌టెన్షన్ ఉన్నవారు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతారు. చాక్లెట్‌లో పెద్ద సంఖ్యలో కేలరీలు ఉంటాయి, కనుక బరువు తగ్గాలని కోరుకునే వారు చాక్లెట్‌ను మితంగా మాత్రమే తినాలి.