కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం జాతీయ బాలికా దినోత్సవం (NationalGirlChildDay) సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బాలికలు కేవలం బాధ్యత మాత్రమే కాదని,వారు దేశ నిర్మాణంలో బలమైన శక్తి అని, మహిళలు భారతదేశ ప్రగతికి ముందుండి నడిపిస్తున్నారంటూ ఎక్స్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు.
అందరికీ జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి బాలికలు కేవలం మన బాధ్యతలు మాత్రమే కాదు, వారు అపారమైన శక్తి అన్నారు. రాణి లక్ష్మీబాయి, రాణి వేలు నాచియార్, మూలా గభారు , ప్రీతిలత వాడేదార్ వంటి వారు ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో ,స్ఫూర్తితో నింపుతారు.” అని ట్వీట్ చేశారు. భారతదేశ అభివృద్ధి గాథలో మహిళల పాత్రను ప్రశంసిస్తూ మోడీ ప్రభుత్వ మహిళా నేతృత్వ అభివృద్ధి మంత్రం నారీ శక్తిని ప్రగతిలో అగ్రస్థానంలో నిలబెట్టిందనీ, నేడు మహిళలు దేశ అభివృద్ధికి నాయకత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు.
Greetings to everyone on 'National Girl Child Day.’#NationalGirlChildDay symbolizes that girls are not merely our responsibilities but sheer strength. The glorious examples of Rani Lakshmi Bai, Rani Velu Nachiyar, Mula Gabharu, and Pritilata Waddedar fill every Indian heart…
— Amit Shah (@AmitShah) January 24, 2026
నేషనల్ గర్ల్ ఛైల్డ్ డే- లక్ష్యాలు
ఆధునిక సమాజంలో ఇప్పటికీ బాలికలకు సమ ప్రాధాన్యత లభించంలేదు.ఈ వివక్షను తొలగించి, ఆడపిల్లలకు కూడా అబ్బాయిలతో సమానంగా ఆహారం, విద్య, గౌరవం దక్కాలనేది ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం.
బాలికల డ్రాపౌట్ రేటును తగ్గించి, వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడం ఈ కాన్సెప్ట్‌లో కీలక భాగం. విద్యాపరంగా వారు సాధికారత సాధించినపుడే ఆర్థికంగా కూడా వారు సాధికారత సాధించగలరు.
ఆడపిల్లలపై జరుగుతున్న దాడులు, వేధింపులు మరియు బాల్య వివాహాలను అరికట్టడం.
ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం తదితర అంశాలో స్వయం నిర్ణయం తీసుకునేలా తామే తీసుకునేలా వారిని శక్తివంతులను చేయడం. స్వతంత్రులుగా తీర్చిదిద్దడం.
లింగ నిష్పత్తి (Sex Ratio): ఆడపిల్లల సంఖ్యను పెంచడం మరియు భ్రూణహత్యలను అరికట్టడం.
"బేటీ బచావో - బేటీ పఢావో" అనే నినాదం ఇందులోభాగంగా వచ్చిందే.
అలాగే బాలికల రక్షణ కోసం, వారి సంక్షేమం కోసం కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి.
బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006
లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2012
జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015
వీటితోపాటు చైల్డ్ హెల్ప్‌లైన్ మరియు ట్రాక్ చైల్డ్ పోర్టల్ వంటి సేవలను అందిస్తుంది, ఇది తప్పిపోయిన పిల్లలను రక్షించేందుకు ఉద్దేశించినవి.


