రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది

Feb 2 2026 7:49 AM | Updated on Feb 2 2026 7:49 AM

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన

రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను గృహ నిర్బంధం చేసిన సందర్భంగా ఆయన నివాసం వద్ద వేణు విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక వ్యాఖ్య చేశారు. కానీ అంతకు ముందు మీరు చేసిందమేటని ప్రశ్నించారు . రాంబాబు సంఘటన జరిగిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా మీ మంత్రులు, నాయకులు ఎటువంటి పదజాలంతో రాంబాబుని దూషించారో ప్రజలందరికీ తెలుసున్నారు. అంబటి మీద చట్టాన్ని ప్రయోగించి అరెస్టు చేశారు. మరి అదే చట్టం కూటమి నేతలకు ఎందుకు వర్తించదని ఆయన ప్రశ్నించారు. అంబటి ఇంటిపై దాడి చేసిన వారు, దాడికి ఉసిగొల్పిన వారి పై చర్యలు తీసుకోవాలన్నారు. అధికారం ఉంటే అరెస్టు చేయడమేనా అని నిలదీశారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేయడం దారుణమన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేశారు. వీటి గురించి ప్రతి పక్షం మాట్లాడకుండా చేయడానికే ఈ కుట్రలు పన్నుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement