షామియానా తొలగించారు
కోటి తులసి పూజ సందర్భంగా వేసిన షామియాను ఆదివారం ఆలయ అధికారులు తొలగించారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కోటి తులసి పూజకు శ్రీకారం’ వార్తలో భక్తుల ఇబ్బందిని ప్రస్తావించిన విషయం తెలిసిందే. 2022లో నిర్వహించిన కోటి తులసి పూజలో కల్యాణ వేదిక ముందు తులసి వనంలో ‘సత్యదేవుడు, అమ్మవారి విగ్రహాలను’ ఉంచడం వల్ల భక్తులు అక్కడ ఫొటోలు దిగేవారు. ఇప్పుడు అటువంటి ఏర్పాటు లేకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేసున్నారు. అలాగే కల్యాణ వేదిక నుంచి విశ్రాంతి మండపం వరకు షామియానా వేయడంతో వేదిక గోపురం కనిపించకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈఓ ఆదేశం మేరకు షామియానాను ఆలయ సిబ్బంది తొలగించారు.కల్యాణ వేదిక ముందు గల విశ్రాంతి మండపంలో తులసి వనం మధ్య సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను సైతం ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడ ఫొటోలు దిగారు.
షామియానా తొలగించారు
షామియానా తొలగించారు


