కడియపులంకలో అగ్ని ప్రమాదం
కడియం: మండలంలోని కడియపులంక కొబ్బరితోట కాలనీలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కె.సత్తిరాజు ఇంట్లోని వాషింగ్ మెషిన్ ఆన్ చేయగా షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. స్థానికులు అప్రమత్తమై మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ లోపు స్థానిక ఎస్‌ఐ నాగదుర్గాప్రసాద్ స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకుని అగ్ని మాపక శకటాన్ని పిలిపించగా ఆ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రాణనష్టం జరగక పోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.


