వైభవంగా గంధోత్సవం
● బషీర్ బీబీ దర్శనానికి పోటెత్తిన భక్తులు
● ప్రత్యేక ప్రార్థనలు
● కిక్కిరిసిన పొన్నాడ
కొత్తపల్లి: స్థానిక పొన్నాడ బంగారు పాపమ్మ (బషీర్ బీబీ ఔలియా) ఉర్స్ ఉత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నాడ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసాయి. పోలీసుల భారీ బందోబస్తు నడుమ సుమారు 30 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ముజావర్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా గంధోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మూలపేటకు చెందిన షెక్‌మౌలాసాహేబ్ ఇంటి వద్ద నుంచి పెద్ద బొడ్డేపల్లికి చెందిన ఎండీ తాజుద్దీన్‌బాబా సమర్పించిన గంధాన్ని (సంథల్) ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంపై ఉంచి ఫకీర్ మేళాతో మూలపేట నుంచి పొన్నాడ బషీర్‌బీబీ ఆలయం వరకు ఊరేగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతికి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ ప్రార్థనల అనంతరం భక్తులకు గంధాన్ని పంపిణీ చేశారు.
ఉత్సవాల సందర్భంగా మూలపేట నుంచి పొన్నాడ వరకు కాలినడకన వెళ్లేందుకు కూడా వీలులేని పరిస్థితులు నెలకొంది. పలు మార్లు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పిఠాపురం, తుని, కాకినాడల నుంచి వచ్చిన వాహనాలు పొన్నాడ చేరుకోవడానికి ఇబ్బంది పడ్డాయి. ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో సుమరు 120 సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. వాహనాలు ఆలయ ప్రాంగణంలోకి వెళ్లకుండా పొన్నాడ, అమరవిల్లి, నాగులపల్లి వద్దె నిలిపివేశారు. గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, పారిశుధ్య నిర్వహణ ఏర్పాట్లు చేశారు.
వైభవంగా గంధోత్సవం
వైభవంగా గంధోత్సవం
వైభవంగా గంధోత్సవం


