కోటి తులసి పూజకు రూ.1.08 లక్షలు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న కోటి తులసి పత్రి పూజకు సప్తగిరి హేచరీస్ ఎండీ పెదబాబు శుక్రవారం రూ.1.08 లక్షల విరాళం అందజేశారు.
‘నన్నయ’లో కోర్సులకు
దరఖాస్తుల ఆహ్వానం
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశానికి ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వాటి వివరాలు తెలియజేశారు.
సర్టిఫికెట్ కోర్సులివీ
ఫంక్షనల్ ఇంగ్లిష్, కలినరీ స్కిల్స్, ఫారెన్ లాంగ్వేజెస్ (జపనీస్, ప్రెంచ్, జర్మన్), ఒరియంటల్ పీసీ కల్చరల్, ప్లోరల్ బై ప్రొడక్షన్, ఇంటర్నేషనల్ ఎకానమీ అండ్ ఫైనాన్స్, ఫౌండేషన్స్ ఆఫ్ డేటా సైన్స్, ఇంట్రడక్షన్ టు హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, బేసిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, బేసిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, న్యూట్రిషన్ అండ్ డిటెటిక్స్
అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత.
కోర్సు వ్యవధి : మూడు నెలలు
ఫీజు: విద్యార్థులకు రూ.వెయ్యి, వర్సిటీ సిబ్బందికి రూ.రెండు వేలు, ఇతరులకు రూ.మూడు వేలు
డిప్లొమా కోర్సులు
ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్, మోబైల్ యాప్ డెవలప్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
అర్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
కోర్సు వ్యవధి : ఆరు నెలలు
ఫీజు: విద్యార్థులకు రూ.2 వేలు, వర్సిటీ సిబ్బందికి రూ.3 వేలు, ఇతరులకు రూ.4 వేలు.
పీజీ డిప్లొమా కోర్సులు
ఫంక్షనల్ ఇంగ్లిష్, ఫైన్ ఆర్ట్స్ (మ్యూజిక్, పెయింటింగ్, థియేటర్ ఆర్ట్స్), టూరిజం అండ్ హాస్పిటాలిటీ, క్వాయర్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ (పీజీడీఎం), హాస్పిటల్ మేనేజ్‌మెంట్, కంప్యూటేషన్ మేథమెటిక్స్, లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా, గాంధీయన్ ఐడియాలజీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రొగ్రామ్, క్వాంటమ్ కంప్యూటింగ్
అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
కోర్సు వ్యవధి : ఒక సంవత్సరం
ఫీజు: విద్యార్థులకు రూ.3 వేలు, వర్సిటీ సిబ్బందికి రూ.4 వేలు, ఇతరులకు రూ.5 వేలు
అక్రమ మైనింగ్‌లో తనిఖీలు
వాహనాల సీజ్
అనపర్తి: జిల్లాలో గ్రావెల్ అక్రమ తవ్వకాల నియంత్రణలో భాగంగా గనులు, భూగర్భశాఖ అధికారి డి.ఫణిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం క్షేత్రస్థాయి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బిక్కవోలు మండలం, కాపవరం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 15/1ఏ లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని ఈ బృందం తనిఖీ చేసింది. సదరు భూమి గతంలో సీహెచ్ వెంకటేష్ పేరున లీజు మంజూరు కాగా, ప్రస్తుతం కాల పరిమితి ముగిసినట్టు గుర్తించినట్టు ఫణిభూషణ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఒక పొక్లెయిన్, అక్రమ రవాణాకు వినియోగిస్తున్న మూడు లారీలను సీజ్ బిక్కవోలు పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో అసిస్టెంట్ జియాలజిస్ట్ జి.విఘ్నేశ్వరుడు, రాయల్టీ ఇన్‌స్పెక్టర్ జ్యోతిర్మయి, టెక్నికల్ అసిస్టెంట్లు శైలజ, మనీష, సర్వేయర్ శ్రీనివాస్, స్థానిక రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
కోటి తులసి పూజకు రూ.1.08 లక్షలు
కోటి తులసి పూజకు రూ.1.08 లక్షలు


