ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Feb 8 2026 4:27 AM | Updated on Feb 8 2026 4:27 AM

ఏపీపీ

ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) టి.సీతారామమూర్తి ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో సమన్వ య శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 9 నుంచి 13 వరకూ పరీక్షలు జరుగుతాయని, ఆయా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. పోలీసు బందోబస్తు, ప్రశ్నపత్రాలు, రవాణా భద్రత, 144 సెక్షన్‌ అమలు, నిరంతర విద్యు త్‌ సరఫరా, వైద్య సదుపాయాలు, పరీక్ష కేంద్రాల కు వెళ్లే మార్గాల్లో బస్సుల ఏర్పాటు, కంట్రోల్‌ రూమ్‌ నిర్వహణ తదితర అంశాలపై శాఖల వారీగా చర్చించారు. అలాగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌ టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని, పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు.

అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): దేశ భవిష్యత్తు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌ను రూపొందించినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలోని ఒక హోటల్లో 2026–27 కేంద్ర బడ్జెట్‌పై శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు. వికసిత్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా 2047 నాటికి భారత్‌ను సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారన్నారు.

ప్రైవేట్‌ పాఠశాలల్లో

ప్రవేశాలకు దరఖాస్తులు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రైవేట్‌ పాఠశాలల్లో 2026, 27 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ఉచిత అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతున్నట్లు సమగ్ర శిక్షా జిల్లా అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌ ఎస్‌.సుభాషిణి తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆర్థికంగా బలహీన వర్గాలు, వెనుక బడిన వర్గాల పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. మార్చి 10వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుందన్నారు. వివరాలకు మండల విద్యాశాఖ అధికారి, జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

మూడు డ్రెడ్జింగ్‌ బోట్లు,

642 టన్నుల ఇసుక సీజ్‌

రాజమహేంద్రవరం రూరల్‌: కాతేరు గ్రామ పరిధిలోని డిసిల్టేషన్‌ ఇసుక రీచ్‌లో జిల్లా గనులు, భూగర్భశాఖ అధికారి ఆధ్వర్యంలో గనుల శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక రీచ్‌ ఒడ్డున మూడు డ్రెడ్జింగ్‌ బోట్లు, వాటి సమీపంలో రెండు ఇసుక గుట్టలు ఉన్నట్లు గుర్తించారు. డ్రెడ్జింగ్‌ బోట్లలో ఇసుక ఆనవాళ్లు లభించడంతో, అవి గోదావరిలో నియమాలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలలో పాల్గొన్నట్లు నిర్థారించారు. ఈ నేపథ్యంలో ఆ మూడు డ్రెడ్జింగ్‌ బోట్లను సీజ్‌ చేసి, వాటిని సంబంధిత ఇరిగేషన్‌శాఖ అధికారులకు అప్పగించారు. సమీపంలోని 642 టన్నుల ఇసుక గుట్టలను సీజ్‌ చేశారు. తదుపరి చర్యలు తీసుకునే వరకు స్థానిక రెవెన్యూ అధికారుల సంరక్షణకు అప్పగించారు. కాతేరు డిసిల్టేషన్‌ ఇసుక రీచ్‌లో నియమాలకు విరుద్ధంగా డ్రెడ్జింగ్‌ ద్వారా ఇసుక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులను అధికారులు హెచ్చరించారు. తనిఖీల్లో జిల్లా గనులు, భూగర్భ అధికారి డి.ఫణిభూషణ్‌రెడ్డి, అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ జి.విఘ్నేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ‘కోటి తులసి పత్రి పూజ’

అన్నవరం: లోక కల్యాణార్థం రత్నగిరి సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న ‘కోటి తులసి పూజ’ శనివారం రెండో రోజు కు చేరుకుంది. శనివారం తెల్లవారు జామున సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం పండితులు స్వా మి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు 60 మంది రుత్విక్కులు ఆరు లక్షల తులసి దళాలతో స్వామిని అర్చించారు. 11–30 గంటలకు వేదాశీస్సులు అందచేసి స్వామి, అమ్మవారికి నివేదన సమర్పించారు.

ఏపీపీఎస్సీ పరీక్షలకు  పకడ్బందీ ఏర్పాట్లు1
1/2

ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఏపీపీఎస్సీ పరీక్షలకు  పకడ్బందీ ఏర్పాట్లు2
2/2

ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Advertisement
 
Advertisement
Advertisement