ఆనందంగా ఉంది
కాకినాడ జిల్లాలో జాతీయ స్థాయి కోకనాడ గోల్డ్ కప్ పోటీలు జరగడం ఆనందంగా ఉంది. ఈ పోటీలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు రావడంతో వర్ధమాన క్రీడాకారులు వారి ఆట చూసి చేర్చుకోవడానికి వీలు ఉంటుంది. భవిష్యత్తులో కాకినాడ నుంచి జాతీయ, అంతార్జతీయ స్థాయి క్రీడాకారులు తయారు కావడానికి ఇదో చక్కని వేదిక.
– నాగేంద్ర, డీఎస్‌ఏ హాకీ కోచ్
అన్ని ఏర్పాట్లూ చేశాం
కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో హాకి ఇండియా, హాకీ ఆంధ్రప్రదేశ్ సహకారంతో కాకినాడ డీఎస్‌ఏ మైదానంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. సుమారు 10 రోజుల పాటు జరిగే పోటీలో పాల్గొనే క్రీడాకారులకు ఏ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ పోటీలను క్రీడాభిమానులు తిలకించవచ్చు.
– రవిచంద్ర,
కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకుడు
ఆనందంగా ఉంది


