కట్టమూరులో పోలీసులపై దాడి
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండల పరిధి కట్టమూరు గ్రామంలో శనివారం రాత్రి అసభ్యకర నృత్య ప్రదర్శన జరుగుతుందని సమాచారం మేరకు వెళ్లిన పోలీసులపై ఆకతాయిల మూక దాడి చేసింది.. ఆ వివరాల ప్రకారం.. కట్టమూరులోని జోడిగుళ్ల ఉత్సవాల్లో భాగంగా నాటిక ప్రదర్శన మధ్యలో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు పెద్దాపురం సీఐ విజయకుమార్ వెళ్లి ప్రదర్శన నిలుపుదల చేయాలని నిర్వాహకులకు చెప్పారు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఆకతాయిలు రెచ్చిపోయి రాళ్లు విసరడంతో సీఐతో పాటు క్రైమ్ హెడ్ కానిస్టేబుళ్లు నాగరాజు, రాధాకృష్ణ గాయపడ్డారు. అయితే హెచ్ కానిస్టేబుళ్లను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను ఎస్సై వి.మౌనిక పరామర్శించారు. పోలీసులపై దాడి చేయడంపై సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది.
వివాహిత అదృశ్యం
నిడదవోలు: ఓ వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి.రవికుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఉండ్రాజవరం గ్రామానికి చెందిన గాలింకి విజయకుమారికి ఆమె భర్త సాయిబాబాతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 29న పుట్టింటికి వెళ్తానని విజయకుమారి చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆమె పుట్టింటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె తల్లి కండెల్లి సుగుణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
కట్టమూరులో పోలీసులపై దాడి


